Tag Archives: employees

గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. విషయం ఏంటంటే..?

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపురానే వచ్చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షణ, కస్తూరిభాగాంధీ విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రాతి పదికన పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ సంస్థల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతాలు పెంచుతన్నట్లు పేర్కొన్నారు. ఆ ఉద్యోగులకు జీతాలు మొదట 20 శాతం వేతనాలు పెంచాలనే ఆలోచన ఉండగా.. మరికొన్ని ఎలిమెంట్స్ ను దృష్టిలో ఉంచుకొని..30 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. అంతే కాకుండా మరో బొనాంజాను ప్రకటించారు.

ఈ పెంచిన జీతాలను ఈ నెల నుంచి కాకుడా 2021 జూన్ మాసం నుంచి అమలు చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. అంటే ఆరు నెలల జీతం అదనంగా రానుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. సమర్థవంతంగా పని చేస్తున్నారాని కితాబిచ్చారు. ఇక ముందు కూడా ఇలాంటి పనితనమే చూపించాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక వర్క్ విషయంలో గానీ.. పని చేసే ప్రదేశంలోగానీ ఎమైనా సమస్యలు ఉంటే.. వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ.. కృతజ్ఞతలు తెలియజేశారు. మరి కొంతమంది అయితే స్వీట్స్ పంచి పెట్టారు.

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్.. ఎంతంటే?

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది బోనస్‌కు అదనంగా 1 శాతం పెంచి 29 శాతం బోనస్‌గా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ బోనస్ ను దసరా కంటె ముందే వారి వారి అకౌంట్లలో జమ చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కార్యకలాపాలను మరింత విస్తరించాలని సీఎం పేర్కొన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్మికులు ఎంతో కష్టపడి పని చేయడం వల్లనే దేశంలోనే ఉన్నత స్థానం లభించిందని గుర్తు చేశారు.

బొగ్గు తవ్వకంతో పాటు రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాలను చేపట్టి కార్మికులకు పని, ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వమే పూనుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజసం అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. రిటైర్డ్ సిబ్బందికి వస్తున్న పింఛన్ ను కూడా రూ. 2వేల నుంచి పెంచే యోజనలో ప్రభుత్వం ఉందంటూ స్పష్టం చేశారు.

బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయని.. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయన్నారు. గత సంవత్సరం రూ.68,500గా బోనస్ ప్రకటించగా.. ఈ మొత్తాన్ని ప్రస్తుత సంవత్సరంలో పెంచారు. దీంతో సింగరేణిలో పనిచేసే దాదాపు 43 వేల మందకి ఈ బోనస్ వర్తించనుంది. ఈ నిర్ణయంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులకు షాక్.. ఉద్యోగం ఉండాలంటే ఆ పనికి ఒప్పుకోవాలి..

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. కొందరికి ఇది బాగానే ఉన్నా.. మరికొందరికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. దీనిలో భాగంగానే ఓ కంపెనీ తమ ఉద్యోగుకలు షాక్ ఇచ్చింది. తమ ఉద్యోగుల ఇళ్ళల్లో కెమెరాలు ఇన్‌స్టాల్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఒక వేళ కెమెరాలు పెట్టేందుకు అంగీకరించకుంటే ఉద్యోగం నుంచి కూడా తీసేయడానికి వెనకాడటం లేదు. దీంతో ఈ కంపెనీ తీరు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. టెలీ పర్ఫార్మెన్స్ అనే ఓ ప్రముఖ కాల్ సెంటర్ కంపెనీ ఉద్యోగుల ఇళ్లలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి, రికార్డ్ చేయడానికి ఏఐ-ఆధారిత కెమెరాలను ఇన్‌ స్టాల్ చేస్తామని ప్రకటించింది.

కొలంబియాలో వర్క్ చేస్తున్న ఉద్యోగులపై కెమెరాల ఏర్పాటుపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబసభ్యుల సమ్మతికి సంబంధించి సంతకం కూడా తీసుకుంటారట. 3.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్న ఈ బీపీఓ కంపెనీ.. భారత్ లో 70 వేల మంది ఉన్నారు. కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారంతో ఆందోళన చెందుతున్నారు. తాము బెడ్ రూంలో పని చేస్తాం.. అయితే బెడ్ రూంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా.. అంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగి తమ కంపెనీ సిస్టంలో లాగిన్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి.. భద్రతా కారణాల వల్లనే తాము ఈ పని చేస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత ప్రైవసీకి తమ సంస్థ కట్టుబడి ఉందని.. ఇతర సమాచారం సేకరించాల్సిన అవసరం తమకు లేదని ఈ సంస్థ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్.. రూల్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దీంతో ఉద్యోగుల కుటుంబాలకు ఎక్కువ పెన్షన్ వస్తుంది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందేందుకు దీనికి అర్హులు కానున్నారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ నియమనిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందొచ్చు. ఇందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు ఇద్దరి పెన్షన్ వస్తుంది.

అయితే ఈ పెన్షన్ రూ. 45 వేలు వరకు మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం దాని లిమిట్ ను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి నుంచి ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ తెలిపింది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నియమనిబంధనల మేరకు గరిష్టంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందొచ్చు.

ఈ మేరకు కుటుంబ పెన్షన్లకు సంబంధించి 75 ముఖ్యమైన కొత్త రూల్స్‌ తీసుకొచ్చామని పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖ ప్రకటించింది. వీటికి డీఆర్ సమయానుగుణంగా జతవుతుంది. అలాగే నెలకు కనిష్టం మొత్తంగా రూ.9 వేల పెన్షన్ అందుకోవచ్చు. దీనికి కూడా డీఆర్ అదనంగా జతవుతుంది.

ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎఫ్ లిమిట్ భారీగా పెంపు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి నెలవారీ కనీస స్థూల వేతన పరిమితిని పెంచడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయల వరకు పీఎఫ్ డిడక్షన్ లిమిట్ ను కేంద్రం పెంచనుందని తెలుస్తోంది. ఫలితంగా 21,000 రూపాయల లోపు బేసిక్ వేతనం పొందేవారు పీఎఫ్ స్కీమ్ కు అర్హులని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో పీఎఫ్ మంత్లీ వేతన పరిమితి కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. పీఎఫ్ డిడక్షన్ లిమిట్ పెంపు గురించి కార్పొరేట్ సంస్థలకు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు మధ్య చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియాల్సి ఉంది. పీఎఫ్ డిడక్షన్ కు సంబంధించి మరో కొత్త నిర్ణయం తెరపైకి వస్తుండగా ఆ నిర్ణయం విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

కేంద్రం 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవారికి వేతనం నుంచి పీఎఫ్ డబ్బులను కట్ చేయవద్దని.. అలా కట్ చేయడం వల్ల తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్రాన్ని కోరుతోంది. పీఎఫ్ డిడక్షన్ లిమిట్ 2014 సంవత్సరం నుంచి 15,000 రూపాయల లోపు బేసిక్ శాలరీ వస్తే కట్ అయ్యే విధంగా ఉంది. ఇప్పుడీ లిమిట్ ను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2014 సంవత్సరానికి ముందు పీఎఫ్ డిడక్షన్ లిమిట్ 6,500 రూపాయలుగా ఉండేది. పీఎఫ్ డిడిక్షన్ లిమిట్ పెంచితే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మరి కేంద్రం బడ్జెట్ లో పీఎఫ్ డిడక్షన్ పరిమితిని పెంచుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎల్టీసీ నగదు వోచర్లను ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు కొత్తగా తీసుకునే బీమా పాలసీలపై ఎల్టీసీ నగదు వోచర్ పథకం కీంద రీయింబర్స్ మెంట్ ను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది.

డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్ పిడెంచర్ నుంచి ఈ మేరకు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసిన వాటికి ఒరిజినల్ బిల్లులను కాకుండా జిరాక్స్ లను పెట్టి కూడా ప్రయోజనాలను పొందవచ్చు ఎల్టీసీ నగదు ఓచర్ పథకం గురించి కేంద్ర ప్రభుతం వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వర ఉద్యోగుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో లీవ్ ట్రావెల్ వోచర్ స్కీమ్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీన మోదీ సర్కార్ లీవ్ ట్రావెల్ వోచర్ స్కీమ్ ను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం వస్తువులను కొనుగోలు చేయవచ్చు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్లు బీమా పాలసీలకు కూడా వర్తిస్తాయని చెప్పిన కేంద్రం గతంలో తీసుకున్న పాలసీలకు మాత్రం ఈ వోచర్లను ఉపయోగించడం సాధ్యం కాదని తెలిపాయి.

అక్టోబ నెల 12 నుంచి వచ్చే ఏడాది లోపు ఎవరైనా కొత్తగా బీమా పాలసీలను తీసుకుంటే 2021 మార్చి 31 లోపు బిల్లులను సమర్పించి ప్రయోజనం పొందవచ్చు. అధికారులు అవసరమైతే జిరాక్స్ లతో పాటు ఒరిజినల్ బిల్లులను కూడా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కేంద్రం సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు భారీ షాక్..?

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలలు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయడంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సైతం కరోనా మహమ్మారి ప్రభావం పడింది. గతంతో పోలిస్తే కేంద్రానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా కేంద్రం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ను నిలిపివేస్తున్నట్టు కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. . సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రియల్ డియర్ నెస్ అలవెన్స్ వేతన మార్గదర్శకాలను అనుసరించి వేతనాలను చెల్లిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కేంద్రం కీలక ప్రకటన చేసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కరోనా విజృంభణ వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీ.పీ.ఎస్.ఈ ఉద్యోగుల డీఏలకు, అదనపు ఇన్‌స్టాల్‌మెంట్లకు ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ మార్గదర్శకాలు అమలవుతాయని అందువల్ల డీఏ అదనపు చెల్లింపులు ఉండవని తెలిపింది. 2021 జులై నుంచి కేంద్రం డీఏ చెల్లించనుండగా ఎంతమొత్తం చెల్లించనుందో తెలియాల్సి ఉంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే డీఏ పెంపు ఉండదని కీలక ప్రకటన చేసింది. కేంద్రం డీఏ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లపై పడటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్..?

ప్రధాన నరేంద్ర మోదీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వాళ్లకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను సైతం కల్పించడానికి సిద్ధమవుతోంది. రాబోయే బడ్జెట్ ద్వారా కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేయనుందని సమాచారం అందుతోంది.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ సుప్రతిం బంద్యోపాద్యాయ్ మాట్లాడుతూ కేంద్రం మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని.. కంపెనీ కంట్రిబ్యూషన్ ‌కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని సమాచారం.

సుప్రతిం బంద్యోపాద్యాయ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ కు సంబంధించి 14 శాతం కంట్రిబ్యూషన్‌‌ పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రానికి కంపెనీలకు కూడా రాయితీ ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తామని తెలిపారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉద్యోగులకు సైతం పన్ను మినహాయింపు ప్రయోజనాలను కల్పించాలని సూచనలు చేస్తున్నాయి.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 2 అకౌంట్ కు సైతం ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతి సబ్ స్క్రైబర్ కు ఈ ప్రయోజనం కల్పించనుందని తెలుస్తోంది.

పెన్షన్ తీసుకునే వాళ్లకు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..?


గత కొన్ని నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.

కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం కూడా తగ్గిన నేపథ్యంలో కేంద్రం గతంలో ఈ సంవత్సరం డీఏ పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గడం పరిస్థితుల మార్పు నేపథ్యంలో డీఏ పెంపు అమలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెరగనుందని సమాచారం.

2021 సంవత్సరం జులై నుంచి డీఏ పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే కేంద్రం ఈ విషయం గురించి స్పందించకపోవడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తే దేశంలోని 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు పాత డీఏనే లభిస్తోంది.

అయితే ఈ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డీఏ పెంపు గురించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది.