Tag Archives: ntr

NTR : రోజుకు రెండు ఇడ్లీలు, ఒక వడ.. నెలకు 250 రూ.లు.. ఇవి ఎన్టీఆర్ “పాతాళభైరవి” చిత్రానికి తీసుకున్న జీతభత్యాలు.!!

NTR : దాదాపు 70 సంవత్సరాల క్రితం అంటే 1951లో విడుదలైన “పాతాళభైరవి” చిత్రం అనగానే ఆ అత్యద్భుత జానపద కళాఖండం మనందరికీ గుర్తొస్తుంది. నాగిరెడ్డి, చక్రపాణి 1949లో వాహిని స్టూడియోను తీసుకున్నారు. అలా వారు విజయప్రొడక్షన్ తో నిర్మించిన మొదటి తెలుగు చిత్రం “షావుకారు”. షావుకారు చిత్రానికి అయితే పేరు బ్రహ్మాండంగా వచ్చింది కానీ కాసులు మాత్రం కురవలేదు. ఎంత పేరు తీసుకొచ్చిన చిత్రమైన కాసులు కురవందే కొత్త కథలు రావు కథలు లేనిదే సినిమాలు లేవు. ఈ సందర్భంలో నాగిరెడ్డి, చక్రపాణిలు కాశీమజిలీ కథలు లేదా అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి కథలతో ఒక జానపద చిత్రాన్ని రూపొందించాలకున్నారు.

విజయ ప్రొడక్షన్స్ వారు అంతకుముందే “గుణసుందరి కథ” చిత్రం హిట్ కావడంతో కే.వి.రెడ్డి గారిని తాము తీయబోయే జానపద చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా కోరడం జరిగింది. అప్పుడు విజయ ప్రొడక్షన్స్ వారు ఎన్టీ రామారావును, కె వి రెడ్డి అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని హీరోగా తీసుకుందామని సందిగ్ధంలో.. వీరు లోగడ “సంసారం” అనే చిత్రంలో షూటింగ్ లో పాల్గొని విరామ సమయంలో వాహిని స్టూడియోలో టెన్నిస్ ఆడుతూ ఉండేవారు. ఆఫీసులో ఉండి కె.వి రెడ్డి.. అక్కినేని, ఎన్టీఆర్ టెన్నిస్ ఆడే విధానాన్ని చూశారు. అక్కినేని కొట్టిన బాలును ఎన్టీఆర్ రెండు చేతులతో బ్యాట్ తో ఒక రకమైన ఫోర్స్ తో తిరిగికొట్టారు. ఆట ఆడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆడే విధానం కే.వి రెడ్డికి బాగా నచ్చింది. తన కథలోని తోటరాముడుకు ఎన్టీఆర్ బాగుంటాడని ఆయననే హీరోగా ఎంపిక చేసుకున్నారు. అలా రెండు సంవత్సరాల గాను ఎన్టీఆర్ విజయ సంస్థలో పనిచేయాలి. అలాగే విజయ సంస్థ వారు తీయబోయే నాలుగు చిత్రాల్లో నటించాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇక ఆ రోజు నుండి ఎన్టీఆర్ ఉదయం 4.30 నిమిషాలకు వాహిని స్టూడియోకు రావడం రిజిస్టర్లో సంతకం చేసి కర్రసాము సాధన ఉ.9.00 గం.ల వరకు అభ్యాసన చేయడం. స్టూడియోలో ఉన్న క్యాంటీన్ కి వెళ్లి వారు పెట్టిన రెండు ఇడ్లీలు ఒక వడ తినేవారు. విపరీతంగా కర్ర సాములో పాల్గొనడం వలన వారు పెట్టే రెండు ఇడ్లీలు సరిపోయేవి కావు.. ఆ విషయం తాతినేని ప్రకాశరావు కు తెలియడంతో నిర్మాతలకు చెప్పి ప్రతిరోజు డబుల్ టిఫిన్ పెట్టించారు. పారితోషికంగా రోజు రెండు ఇడ్లీలు ఒక వడ, నెలకు 250రూ.లు ఎన్టీఆర్ కు ఇచ్చేవారు. అలా కష్టపడి పట్టుదలతో సినీ పరిశ్రమలో నిలదుక్కోవాలని ప్రయత్నించిన ఎన్.టి.ఆర్ అనతి కాలంలోనే తన లక్ష్యాన్ని చేరుకున్నారు. 1951లో విడుదలైన “పాతాళ భైరవి” చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీ రామారావుకి ఈ సినిమాలో నటించడం ఆయన సినీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడిందనడం లో సందేహం లేదు.

Swapna Dutt: నా జీవితంలో ఎన్టీఆర్ ను ఎప్పుడు మర్చిపోలేను.. పెళ్లి విషయంలో చాలా హెల్ప్ చేశాడు: స్వప్న దత్

Swapna Dutt: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యానర్ ద్వారా ఎంతో మంది హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేశారు.ఇక శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ కంత్రి శక్తి వంటి సినిమాలు చేశారు. ఇలా ఈ బ్యానర్ లో పలు సినిమాలలో నటించడం వల్ల ఎన్టీఆర్ కి అశ్విని దత్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.

ఇకపోతే అశ్విని దత్ చిన్న కుమార్తె స్వప్న దత్ ప్రస్తుతం శ్రీవైజయంతి మూవీస్ బ్యానర్ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇప్పటికే నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ బ్యానర్ లో వచ్చిన సీతారామం సినిమా కూడా మంచి హిట్ కావడంతో స్వప్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ స్వప్నను ప్రశ్నిస్తూ.. మీ పెళ్లిలో ఎన్టీఆర్ చేసిన హెల్ప్ ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించాను.అయితే ఈ విషయం ఇంట్లో చెప్పడానికి సరైన టైమ్ కుదరకపోవడం లేదు అందుకే ఈ మేటర్ చెప్పడానికి కాస్త టైం తీసుకుందామని అనుకున్నాను.ఇలా నా లవ్ మేటర్ విషయంలో వెనకడుగు వేస్తున్న సమయంలో ఎన్టీఆర్ వచ్చి షూటింగ్ అయిపోగానే మేకప్ కూడా తీయకుండా నాన్నగారికి ఈ విషయం చెప్పేసారు.

Swapna Dutt: ఇలాంటి విషయాలు ఆలస్యం చేయకూడదు…

ఇలా లవ్ మేటర్ ఎక్కువగా డిలీట్ చేయకూడదు వెంటనే చెప్పేయాలి అంటూ తారక్ తన లవ్ మ్యాటర్ నాన్నకు చెప్పి ఎన్టీఆర్ నాన్నను ఒప్పించారని ఈ సందర్భంగా స్వప్న దత్ పేర్కొన్నారు.ఎన్టీఆర్ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని,తాను చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషించారు అనే విషయం గురించి ఈ సందర్భంగా వెల్లడించారు.

Ashwini dutt: మహానటి సినిమాలో ఎన్టీఆర్ చేయకపోవడానికి అసలు కారణం అదేనా.. బయటపెట్టిన అశ్విని దత్?

Ashwini dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత అశ్విని దత్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.తాజాగా ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సీతారామం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా గురించి ఈయన ఎన్నో విశేషాలు వెల్లడించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య నటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పాత్రలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని భావించారట. అయితే చివరికి ఎన్టీఆర్ పాత్రను ఈ సినిమాలో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలని అనుకున్నాము. అయితే అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించారు.

Ashwini dutt: ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించడమే కారణం…

ఈ విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రకటించడంతో మహానటి సినిమాలో ఆయన పాత్రలో ఎవరిని పెట్టి నటింపచేసిన ప్రజలు, అభిమానులు తప్పుగా భావిస్తారన్న ఉద్దేశంతోనే చివరి నిమిషంలో ఎన్టీఆర్ ను వద్దనుకున్నామని వెల్లడించారు.అయితే ఈ విషయం నాగ్ అశ్విన్ కి తెలియడంతో ఎన్టీఆర్ లేకుండా ఆయన పాత్ర చేస్తా అంటూ తెరవెనక ఎన్టీఆర్ వాయిస్ తో రాజేంద్రప్రసాద్ చేత రెండు డైలాగులు చెప్పించామని ఈ సందర్భంగా అశ్విని మహానటిలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

Pranathi -Anjana: నాని భార్యతో కలిసి సందడి చేస్తున్న ఎన్టీఆర్ భార్య ప్రణతి.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Pranathi -Anjana: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున వారి సినిమాలకు సంబంధించిన విషయాలను వారి ఫ్యామిలీ విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక నటీనటులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏకంగా సెలబ్రిటీ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు.

అయితే ఇలాంటి వాటికి ఎన్టీఆర్ కుటుంబం కాస్త దూరంగానే ఉంటుందని చెప్పాలి.ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం ఆయనకు సంబంధించిన సినిమా విషయాలను మాత్రమే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈయన భార్య ప్రణతి ఇక సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటారు.

ఎప్పుడైనా కుటుంబంతో కలిసి వెకేషన్ వెళితే ఆ ఫోటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారే తప్ప లక్ష్మీ ప్రణతి మాత్రం ఎక్కడ తన విషయాలను చర్చించరు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి నాని భార్య అంజనాతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఇలా ఈ హీరోలు ఇద్దరు భార్యలను ఒకే చోట చూడడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pranathi -Anjana: ఆ పెళ్లిలో ఏర్పడిన పరిచయమే…

నాని భార్య అంజనా, ప్రణతి ఇద్దరూ కూడా రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో కలిశారట. ఈ పెళ్లిలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారింది. దీంతో అప్పటినుంచి వీరిద్దరూ తరచూ కలుస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ వీరి స్నేహితులతో కలిసి సందడి చేసినటువంటి ఫోటోలను నాని భార్య అంజన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

NTR -Rajendra Prasad: సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా.. ఏ సినిమా అంటే?

NTR -Rajendra Prasad: నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈయన నిమ్మకూరు సమీపంలో దొండపాడు గ్రామంలో జన్మించారు.ఇక నిమ్మకూరు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వస్థలం చిన్నప్పటినుంచి ఆయనను చూస్తూ పెరిగిన రాజేంద్రప్రసాద్ కు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి కలిగింది. ఎన్టీఆర్ సహాయంతోనే రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలోకి వచ్చానని ఎన్నోసార్లు వెల్లడించారు.

ఈ విధంగా చెన్నైలోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణలో కోచింగ్ తీసుకున్న రాజేంద్రప్రసాద్ అనంతరం అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా మొదట్లో ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకొని అనంతరం నటుడిగా అవకాశాలు అందుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా ఎంతో అవలీలగా నటించే రాజేంద్రప్రసాద్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాత అశ్విని దత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రాజేంద్రప్రసాద్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్నార్ పాత్రలు కూడా కనపడతాయి. అయితే ఏఎన్ఆర్ పాత్ర నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ పాత్రలో కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉంటాయి. అవి కూడా వెనక మాత్రమే కనపడతాయని తెలిపారు.

NTR -Rajendra Prasad: మహానటి సినిమా కోసం డబ్బింగ్ చెప్పిన నట కిరీటి…

ఇలా మహానటి సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఉన్న రెండు డైలాగులకు ఎన్టీఆర్ తరహాలోని రాజేంద్రప్రసాద్ ఎంతో చక్కగా డబ్బింగ్ చెప్పారని ఈ సందర్భంగా అశ్విని దత్ పేర్కొన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అశ్విని దత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సీతారామం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Baby Vernika: సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అవ్వాల్సిందే !

Baby Vernika: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అదే స్థాయిలో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ వర్ణిక ఒకరు.

ఈ సినిమాలో ఎంతో బొద్దుగా అమాయకపు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బేబీ వర్ణిక అల్లు అర్జున్ అన్నయ్య కూతురు పాత్రలో నటించారు.ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈ చిన్నారి అనంతరం ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో చిన్నప్పటి రకుల్ ప్రీతిసింగ్ పాత్రలో నటించారు.

ఈ రెండు సినిమాల ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు.ఈ విధంగా వర్ణిక సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే బేబీ వర్ణిక ఇతర సినిమాలలో నటించకపోవడానికి ఓ కారణం ఉంది.

Baby Vernika: చదువు కారణంగా ఇండస్ట్రీకి దూరం..

ప్రస్తుతం ఈమె తన దృష్టిని మొత్తం తన చదువుపై పెట్టడం వల్ల సినిమాలకు దూరం అయిందని తెలుస్తోంది. ఇక సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోచైల్డ్ ఆర్టిస్టుల కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆడిషన్స్ నిర్వహించగా ఈ చిన్నారి నచ్చడంతో తన తల్లిదండ్రుల అంగీకారం మేరకు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Uma Maheswari: పోలీసుల చేతికి వచ్చిన ఉమామహేశ్వరి పోస్ట్ మార్టం రిపోర్ట్… ఆమె చనిపోవడానికి కారణం అదేనా?

Uma Maheswari:దివంగత నటుడు రాజకీయ నాయకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఈమె ఆకస్మిక మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.అయితే ఈమె కేవలం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు భావించారు.

ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం ఈమె పార్తివదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తాజాగా ఈమె పోస్టుమార్టం నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులకు అందించారు.

ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీసులు ఈమె మృతి చెందడానికి గల కారణాలను వెల్లడించారు. ఉమామహేశ్వరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఈమె ఉరి వేసుకోవడంతో స్వర పేటిక విరిగిపోయిందని పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు గురించి వెల్లడించారు. ఇలా ఈమె అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

Uma Maheswari: ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్…

ఇక ఈమె మరణ వార్త విన్న నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. అయితే ఈమె చనిపోయినప్పటికీ ఎన్టీఆర్ ఇండియాలో లేకపోవడంతో ఈమె చివరి చూపులకు నోచుకోలేదు. అయితే ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే తన భార్య తల్లితో కలిసి తారక్ తన మేనత్త కుటుంబ సభ్యులను పరామర్శించారు.

NTR-Balakrishna: ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య మనస్పర్ధలు ఉన్నాయా..? అందుకే బాలయ్య పేరు కూడా ప్రస్తావించలేదా?

NTR – Balakrishna: నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ హరికృష్ణ ఎంట్రీ ఇచ్చారు. అయితే హరికృష్ణ వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి బాలనటులుగా అడుగుపెట్టి అనంతరం హీరోలుగా కొనసాగుతున్నారు.కళ్యాణ్ రామ్ అడపాదడపా సినిమాలలో నటించినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు పొందారు. అయితే గతంలో ఎన్టీఆర్ ను సినిమా ఇండస్ట్రీలో ఉండకుండా ఆయనని తొక్కేయాలని భావించినట్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతుంటాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ నారా కుటుంబంతో కలిసి పోగా హరికృష్ణ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. ఇలా బాలకృష్ణ నారా కుటుంబంతో కలిసి రాజకీయాలలోకి కూడా వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ కూడా రావాలని అభిమానులు భావించారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడం బాలకృష్ణకు ఇష్టం లేదని చంద్రబాబు అనంతరం తన అల్లుడు లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాలని బాలకృష్ణ భావించారట.అందుకే ఎన్టీఆర్ ను పార్టీకి దూరంగా పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. అప్పటినుంచి తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మరోసారి బయటపడ్డ మనస్పర్ధలు…

ఈ విధంగా తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన బాబాయ్ తో మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఎక్కడ తన బాబాయ్ పేరు కూడా తారక్ ప్రస్తావనకు తీసుకురారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తన తాత తండ్రి అన్నయ్యల గురించి ప్రస్తావన తీసుకువచ్చినప్పటికీ ఎక్కడ కూడా తన బాబాయ్ పేరు ప్రస్తావించకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందుకే తన బాబాయ్ పేరు పలకడానికి కూడా ఎన్టీఆర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైందంటూ అభిమానులు భావిస్తున్నారు.

Bimbisara Movie: బింబిసార ఈవెంట్‌లో అభిమాని మృతి.. అసలేం జరిగిందంటే?

Bimbisara Movie: చాలా సంవత్సరాలు తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా బింబిసార. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ వేడుకను శుక్రవారం సాయంత్రం శిల్పారామంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ రావడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలానికి చెందిన సాయి రామ్ అనే అభిమాని హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన కూడా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఇక వేదికపై ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సాయిరామ్ కుప్పకూలిపోయారు.

అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న చిత్ర బృందం..

ఈ విధంగా ఆయనకు ఫిట్స్ రావడంతోనే పడిపోయారని భావించిన తోటి అభిమానులు వెంటనే అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయిరామ్ మృతి చెందారు.ఇలా ఫ్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ అభిమాని మృతి చెందడంతో చిత్ర బృందం ఈ వార్తపై స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా ఎలాంటి సమయంలోనైనా తన కుటుంబాన్ని ఆదుకుంటామని ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ ఖాతా ద్వారా సాయిరామ్ కు నివాళులు అర్పించారు.

Kalyan Ram: బింబిసార కోసం భారీగా కష్టపడిన కళ్యాణ్ రామ్.. ఏకంగా 13 కిలోలు బరువు తగ్గారట!

Kalyan Ram: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన పలు సినిమాలలో నటించిన సరైన గుర్తింపు లభించకపోవడంతో ఏకంగా నిర్మాతగా మారిపోయారు. ఇలా తన నిర్మాణంలో పలు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు నటుడిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారా అనే సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్స్ విపరీతంగా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి ఈయన పక్కా హిట్ కొట్టేలా ఉన్నారు అనిపిస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం తాను ఎలాంటి హార్డ్ వర్క్ చేశారో తెలిపారు. ఎంతమంచి వాడవురా సినిమా సమయంలో తాను 88 కేజీల శరీర బరువు ఉన్నానని, సినిమా కోసం తాను ఏకంగా 13 కిలోల బరువు తగ్గానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు. ఈవిధంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ సందర్భంగా వెల్లడించారు.

త్రిగర్తల సామ్రాజ్యానికి చెందిన రాజు కథ..

ఇలా తాను 88 నుంచి 75 కేజీలకు తగ్గానని చెబుతూనే తన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథ ఏంటి అనే విషయం గురించి కూడా వెల్లడించారు.
త్రిగర్తల సామ్రాజ్యానికి చెందిన ఒక క్రూరమైన రాజు ఆ కాలం నుంచి ప్రయాణం చేస్తూ ప్రస్తుత కాలంలోకి వచ్చాడు. ఇలా వచ్చిన ఆయనలోఎలాంటి మార్పులు వచ్చాయి అతను ఎలా ప్రవర్తించాడు అనేది ఈ సినిమా కథాంటూ కళ్యాణ్ రామ్ అసలు విషయం వెల్లడించారు.