Movie News

NTR-Balakrishna: ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య మనస్పర్ధలు ఉన్నాయా..? అందుకే బాలయ్య పేరు కూడా ప్రస్తావించలేదా?

NTR – Balakrishna: నందమూరి తారక రామారావు వారసులుగా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ హరికృష్ణ ఎంట్రీ ఇచ్చారు. అయితే హరికృష్ణ వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి బాలనటులుగా అడుగుపెట్టి అనంతరం హీరోలుగా కొనసాగుతున్నారు.కళ్యాణ్ రామ్ అడపాదడపా సినిమాలలో నటించినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు పొందారు. అయితే గతంలో ఎన్టీఆర్ ను సినిమా ఇండస్ట్రీలో ఉండకుండా ఆయనని తొక్కేయాలని భావించినట్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతుంటాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ నారా కుటుంబంతో కలిసి పోగా హరికృష్ణ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. ఇలా బాలకృష్ణ నారా కుటుంబంతో కలిసి రాజకీయాలలోకి కూడా వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ కూడా రావాలని అభిమానులు భావించారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడం బాలకృష్ణకు ఇష్టం లేదని చంద్రబాబు అనంతరం తన అల్లుడు లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాలని బాలకృష్ణ భావించారట.అందుకే ఎన్టీఆర్ ను పార్టీకి దూరంగా పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. అప్పటినుంచి తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

మరోసారి బయటపడ్డ మనస్పర్ధలు…

ఈ విధంగా తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన బాబాయ్ తో మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఎక్కడ తన బాబాయ్ పేరు కూడా తారక్ ప్రస్తావనకు తీసుకురారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తన తాత తండ్రి అన్నయ్యల గురించి ప్రస్తావన తీసుకువచ్చినప్పటికీ ఎక్కడ కూడా తన బాబాయ్ పేరు ప్రస్తావించకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని అందుకే తన బాబాయ్ పేరు పలకడానికి కూడా ఎన్టీఆర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైందంటూ అభిమానులు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

6 minutes ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

30 minutes ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

1 hour ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

3 hours ago

పాస్ చేయండి సార్ అంటూ బోర్డుకు కాల్.. విశాఖలో విద్యార్థి వింత ఘటన

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…

3 hours ago

కూతురి ప్రాణం తీశిన తండ్రి.. భువనగిరిలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…

3 hours ago