Tag Archives: pavitra

Pavitra: వాలెంటైన్స్ డే రోజే కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్?

Pavitra: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో పవిత్ర ఒకరు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా గతంలో ఈమె తన ప్రియుడు సంతోష్ అనే మరో యూట్యూబర్ ను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

వీళ్ళిద్దరూ మళ్లీ పెళ్లి అంటూ ఒక పెళ్లి వీడియోని చేసి అందరికీ షాక్ ఇచ్చారు అయితే ఇది ప్రాంక్ అని చెప్పారు. ఇక ఈ వీడియో చేసిన కొన్ని నెలలకే ఈమె సంతోష్ ను ప్రేమిస్తున్నానని తన ప్రేమ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇక గత ఏడాది నవంబర్ నెలలో ఈమె తనతో నిశ్చితార్థం జరుపుకొని తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక వాలెంటెన్స్ డే రోజు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండగా పవిత్ర మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. ఈమె తన ప్రియుడు సంతోష్ కు బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తామిద్దరం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ సమయంలో మాకు సపోర్ట్ చేయండి అంటూ ఈమె కోరారు.

నిజమేనా లేక ప్రాంక్ నా..

ఇలా తమ బ్రేకప్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా కామెంట్ బాక్స్ కూడా ఈమె క్లోజ్ చేశారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సంతోష్ తో కలిసి దిగినటువంటి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేశారు.దీనితో ఈ వార్తలు కాస్త వైరల్ కావడంతో నిజంగానే తనకు బ్రేకప్ చెప్పారా లేకపోతే ఇది కూడా ప్రాంకేనా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/C3VK8e_pxEF/?utm_source=ig_embed&ig_rid=64f16ca7-e277-44b2-b3c1-389af841a6d0

Rajendra Prasad -Pavitra: నటుడు రాజేంద్రప్రసాద్ కు పవిత్ర మరదలు అవుతుందా… తెరపైకి వచ్చిన కొత్త బంధం?

Rajendra Prasad -Pavitra: సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర జంట గురించి మనకు తెలిసిందే వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని కూడా తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయినటువంటి నరేష్ పవిత్ర గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇకపోతే తాజగా నటి పవిత్ర హీరో రాజేంద్రప్రసాద్ కు వరుసకు మరదలు అవుతుంది అనే విషయం వైరల్ గా మారింది.

పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు కావడం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య బంధుత్వం ఏంటి అనే విషయానికి వస్తే… తాజాగా నరేష్ రాజేంద్రప్రసాద్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ నరేష్ ను దగ్గరకు తీసుకొని నిత్య పెళ్లి కొడుకుల ఉన్నారు అంటూ కామెంట్లు చేశారు.

ఇలా నరేష్ గురించి రాజేంద్రప్రసాద్ కామెంట్లు చేయడమే కాకుండా తనకు నరేష్ తమ్ముడు వరస అవుతారు అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇలా విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నరేష్ నిత్య పెళ్లి కొడుకు అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే కొందరు మాత్రం ఈ విషయం ప ఫన్నీ కామెంట్లు తెరపైకి తీసుకువస్తున్నారు.

Rajendra Prasad -Pavitra:మళ్లీ పెళ్లి…

రాజేంద్రప్రసాద్ మాటల ప్రకారం తనుకు నరేష్ తమ్ముడు అయితే నరేష్ తో రిలేషన్ లో ఉన్నటువంటి పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు అవుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇలా పవిత్ర లోకేష్ బావ మరదలు అనే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాగంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Actor Naresh: పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోబోతున్న నరేష్… మూడో భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా?

Actor Naresh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అనే విషయానికి వస్తే అది పవిత్ర నరేష్ నాల్గవ వివాహం అని చెప్పాలి. ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఆరు పదుల వయసులో మరొక నటి పవిత్ర లొకేషన్ వివాహం చేసుకోబోతున్నానని అధికారికంగా వెల్లడించారు.అయితే ఇప్పటికే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇవ్వడం గమనార్హం.

ఇకపోతే నరేష్ పవిత్ర ఇద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలోనే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరొక మహిళతో ఎలా అక్రమ సంబంధం పెట్టుకొని తనని పెళ్లి చేసుకుంటాడని పెద్ద ఎత్తున వివాదం సృష్టించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరికి విడాకులు మంజూరు అవడంతోనే నరేష్ నాలుగో పెళ్లి గురించి ప్రకటించారని తెలుస్తుంది.

ఇలా రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చిన అనంతరం నరేష్ తనకు భరణం కింద మొత్తంలో చెల్లించారనే విషయం గురించి ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నరేష్ రమ్య రఘుపతికి ఐదు కోట్ల రూపాయల భరణం చెల్లించినట్లు సమాచారం.

Actor Naresh: ఐదు కోట్ల రూపాయల భరణం అందుకున్న రమ్య రఘుపతి…

నరేష్ తన తల్లి విజయ్ నిర్మల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తిని అందుకున్నారు.అయితే ఈయన ఆస్తిలో రమ్య రఘుపతి కుమారుడికి వాటా ఉంటుందని అయితే ఈమెకు మాత్రం భరణం కింద 5 కోట్ల రూపాయలు చెల్లించారని వార్తలు వస్తున్నాయి.రమ్య రఘుపతి నరేష్ పవిత్ర వ్యవహారంలో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది. అయితే ఈమె ఐదు కోట్ల రూపాయల తీసుకొని విడాకులు ఇవ్వడానికి ఎలా కాంప్రమైజ్ అయ్యారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Jabardasth Pavitra: పెళ్లి పీటలు ఎక్కబోతున్న జబర్దస్త్ పవిత్ర… మొదలుపెట్టిన పెళ్లి పనులు!

Jabardasth Pavitra: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి మంచి ప్లాట్ ఫామ్ గా నిలుస్తోంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ నీ నిరూపించుకుంటూ కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా ఈ కామెడీ షో ద్వారా సుధీర్ , ఆది, శ్రీను, రాంప్రసాద్ వంటి ఎంతోమంది కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు.

జబర్దస్త్ ప్రారంభమైన కొంతకాలం వరకు ఈ కామెడీ షోలు మగవారు లేడీ గెటప్స్ వేసుకొని కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. అయితే ప్రస్తుతం మాత్రం జబర్దస్త్ లో పరిస్థితిలో మొత్తం తారుమారు అయ్యాయి. చాలా కాలం పాటు కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన ఈ జబర్దస్త్ కామెడీ షో లో ప్రస్తుతం ఆడవారు కూడా తమ కామెడీతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం ఈ జబర్దస్త్ కామెడీ షో లో వర్ష, ఫైమా, రోహిణి, పవిత్ర, రీతు చౌదరి వంటి వారు లేడీ కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు.

ఇక పవిత్ర జబర్దస్త్ లో సందడి చేస్తూ తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా అందరి సెలబ్రిటీల అలాగే ఇటీవల పవిత్ర కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పవిత్ర తన షూటింగ్ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకొనే పనిలో బిజీగా ఉంది.

Jabardasth Pavitra: పెళ్లి పనులలో బిజీబిజీగా పవిత్ర…

ఈ క్రమంలో తాజాగా తనకు పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతూ పెళ్లి కోసం తనకి కాబోయే వాడితో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లి సందడి చేసింది. పెళ్లి షాపింగ్ కోసం ఒక షాపింగ్ మాల్ కి వెళ్లిన పవిత్ర అక్కడ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరు వేసే పంచ్ డైలాగులకి షాపింగ్ మాల్ లో పని చేసే వారు కూడా తెగ నవ్వుకున్నారు. ముఖ్యంగా పట్టు చీర కట్టుకొని తన కన్నా తన స్నేహితురాలు చాలా అందంగా ఉంటూ పవిత్ర చేసిన కామెంట్స్ అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Puri jagannadh Daughter: నీకోసం ఇంటిదగ్గర ఎదురు చూస్తూనే ఉంటా.. వైరల్ అవుతున్న పూరి డాటర్ పవిత్ర పోస్ట్?

Puri jagannadh Daughter: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ డిజాస్టర్ టాక్ ఎదుర్కొంది.ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర తన తండ్రిని ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం పవిత్ర చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పవిత్ర స్పందిస్తూ… మై ఫరెవర్ నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత నర్వస్ గా ఫీల్ అవ్వలేదు. నేడు మీ బిగ్ డే మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. నీ కెరియర్ లో ఇది చాలా పెద్ద సినిమా..ఒక విషయం గుర్తు పెట్టుకోండి నాన్న మేము మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాము.

Puri jagannadh Daughter: వుయ్ లవ్ యు సో మచ్ ..

మిమ్మల్ని చూసి కొత్త అవకాశాలను అందుకొని రిస్క్ చేసే విషయంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాము నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాము.ఈ సినిమా కోసం నువ్వు నీ టీం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఆల్ ద బెస్ట్ రేపు నేను ఫిజికల్ గా నీ పక్కన లేకపోయినా నా ఆనందం నా విజిల్స్ నిన్ను చేరుకుంటాయి. మూవీ మొత్తం నేను చీర్ చేస్తాను. నిన్ను హోల్డ్ చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నాను పింకీ. వుయ్ లవ్ యు సో మచ్ అంటూ ఈ సందర్భంగా పూరి కుమార్తె పవిత్ర చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Suchendra Prasad: పవిత్ర నా భార్యే.. కానీ సర్టిఫికెట్ మాత్రం లేదు.. పవిత్ర భర్త సుచేంద్ర షాకింగ్ కామెంట్స్?

Suchendra Prasad: పవిత్ర లోకేష్ గత కొంతకాలం నుంచి ఈనటి పేరు సోషల్ మీడియాలో, మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.కన్నడ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఎన్నో కన్నడ సినిమాలలోనూ అలాగే తెలుగు సినిమాలలోను నటించి విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కూడా వార్తల్లో నిలిచారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం వల్ల పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను పవిత్ర లోకేష్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తను నా భార్యేనని, అయితే వివాహమైన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం తీసుకోలేదని సుచేంద్ర వెల్లడించారు.

మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది విదేశీ విధానం ఆ విధానం మాకు నచ్చకపోవటం వల్లే ఉద్దేశపూర్వకంగా తాము మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోలేదని ఈయన వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికెట్ మినహా మిగిలిన ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ వంటి వాటిని పరిశీలిస్తే పవిత్ర నా భార్య అని అర్థమవుతుంది. ఇకపోతే మేమిద్దరం భార్యాభర్తలుగా ఎన్నో కార్యక్రమాలకు కూడా హాజరయ్యామని, నేను తనని హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నానని సుచేంద్ర వెల్లడించారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరిగింది….

ఇకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ విధానం కావడంతో కేవలం మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రమే తీసుకోలేదు మిగిలిన ఏ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ చూసిన తను నా భార్య అని స్పష్టంగా అర్థమవుతుంది.ఇకపోతే వీటిని ఆధారంగా చేసుకుని నేను నా మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా సులభంగా తయారు చేయించుకోవచ్చు అంటూ సుచేంద్ర వెల్లడించారు. అయితే గతంలో పవిత్ర లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను సుచేంద్రను వివాహం చేసుకోలేదని కేవలం ఆయనతో రిలేషన్ లో మాత్రమే ఉన్నానని ప్రకటించడం గమనార్హం. ఏది ఏమైనా నరేష్ పవిత్ర వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. క్లారిటీ ఇచ్చిన తనయుడు?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు వరుస ఫ్లాప్ లను చవిచూసిన పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలను నిర్మిస్తూ దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి అనిల్ పాధురి దర్శకత్వంలో రొమాంటిక్ అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆకాష్ పూరితో ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పూరి జగన్నాథ్ కు ఒక కుమారుడు ఒక కుమార్తె అన్న సంగతి మనకు తెలిసిందే. కొడుకు ఆకాష్ పూరి సినిమాలలో నటిస్తూ ఉండగా కూతురు కూడా త్వరలోనే సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. పూరి కూతురు పవిత్రకు సినిమాలంటే ఏమాత్రం ఇష్టం లేదని, కేవలం నాన్న బలవంతం మీదే బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో నటించనుందని ఈ సందర్భంగా ఆకాష్ తెలియజేశారు.

అయితే తనకు సినిమాల్లో నటించడం కన్నా నిర్మాణరంగంలో పనిచేయడం ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో పవిత్ర పూరి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాణ బాధ్యతలను చేపడుతుందని ఆకాశ్ ఈ సందర్భంగా పవిత్ర వెండితెర ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.

రెండో పెళ్లికి సిద్దమైన సుమంత్.. వధువు ఎవరంటే?

అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమకథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్ ఆ తర్వాత సత్యం అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ అతనికి మాత్రం పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.

సుమంత్ ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ కూడా తనకు సరైన గుర్తింపు తీసుకురాలేదని చెప్పవచ్చు. ఇక సుమంత్ వ్యక్తిగత విషయానికి వస్తే దాదాపు15 ఏళ్ల క్రితం తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.ఈ విధంగా వీరిద్దరు విడిపోవడంతో కీర్తి రెడ్డి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని తన జీవితంలో సెటిల్ అయిపోయారు.

సుమంత్ మాత్రం 15 సంవత్సరాల నుంచి ఒంటరిగానే గడుపుతున్నారు. తనని మరో పెళ్లి చేసుకొమ్మని కుటుంబం సభ్యులు చెబితే సరైన వ్యక్తి దొరికితే చూద్దాం అనేవాడే కానీ దొరుకుతుందనే నమ్మకం అతనికి లేదని చెప్పేవాడు. అయితే ఇన్నాళ్లకు సుమంత్ కి సరైన వ్యక్తి దొరికిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

సుమంత్ ఎట్టకేలకు రెండవ సారి పెళ్లి చేసుకోబోతున్నారని, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సుమంత్ పెళ్లి పనులు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంటుగా జరుగుతున్నాయని, చాలా తక్కువ మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి వివాహం జరుగుతుందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అక్కినేని కుటుంబం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.