Tag Archives: politics

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagma: 48 ఏళ్ళ వయసులో పెళ్లికి సిద్ధమైన నటి నగ్మ… వైరల్ అవుతున్న నగ్మా కామెంట్స్?

Nagma: తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి వారిలో నటి నగ్మా ఒకరు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి నగ్మా బాలీవుడ్ భోజ్ పురి కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా నగ్మా హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమయంలో ఈమె ఎంతో మంది హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు వచ్చాయి. ఇలా చాలామంది హీరోలతో నగ్మా రిలేషన్ లో ఉండడమే కాకుండా కొన్ని కారణాలవల్ల వారితో బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి ఇలా బ్రేకప్ చెప్పుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి నగ్మా ప్రస్తుతం 48 సంవత్సరాల వయసులో తన పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అందరిలాగే తను పెళ్లి చేసుకుని పిల్లలతో ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను కాలం కలిసి వస్తే అదే జరుగుతుందేమో వేచి చూడాలి అంటూ చెప్పుకొచ్చారు.

Nagma: నాకంటూ కుటుంబం కావాలని ఉంది…


సంతోషం అనేది ఒక దశలో మాత్రమే ఆగిపోకూడదని, నాకు పెళ్లి జరిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి నగ్మా మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పెళ్లి గురించి ఈమె కామెంట్ చేయడంతో పెళ్లి చేసుకుని సమయంలో హీరోలతో రిలేషన్ లో ఉంటూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి ఆ శుభవార్తను ఎప్పుడూ చెప్పబోతున్నారు అంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.

Varun Tej: బాబాయ్ కి మాఅవసరం ఉండకపోవచ్చు.. ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: వరుణ్ తేజ్

Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన సినిమా గాండీవ దారి అర్జున ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతూ వైసిపి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం బ్రో సినిమా వేడుకలో భాగంగా సినిమా అయినా, రాజకీయమైన బాబాయ్ వెంటే అంటూ వరుణ్ తేజ్ కూడా మాట్లాడారు.

ఈ క్రమంలోనే యాంకర్ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ వచ్చే ఎన్నికలలో మీరు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపబోతున్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ నాకు తెలిసి బాబాయ్ కి మాతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు అని తెలియజేశారు. ఆయనకు మా మద్దతు అవసరమైతే మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు సపోర్ట్ చేస్తుందని తెలిపారు.

Varun Tej: ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది..


కేవలం రాజకీయాల పరంగా మాత్రమే కాకపోయినా ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ బాబాయ్ కి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని వరుణ్ తెలిపారు. గత ఎన్నికలలో కూడా నా వంతు నేను సపోర్ట్ చేశానని తమ సపోర్ట్ ఎప్పుడూ బాబాయ్ కి ఉంటుందంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Renu Desai: పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు… సంక్షేమం కోసమే రాజకీయాలలోకి వచ్చారు: రేణు దేశాయ్

Renu Desai: రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సినీనటిగా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం పవన్ కళ్యాణ్ పట్ల పలు సందర్భాలలో విమర్శలు కురిపించిన రేణు దేశాయ్ ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల కురిపించడమే కాకుండా తన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం గురించి కాకుండా వృత్తిపరమైన విషయాలకు వస్తే ఆయన డబ్బు మనిషి కాదని తాను రాజకీయాలలోకి వచ్చినది డబ్బు కోసం కాదని తెలిపారు. పేదల సంక్షేమం కోసమే తాను రాజకీయాలలోకి వచ్చారని రేణు దేశాయ్ తెలిపారు.

తాను తన వ్యక్తిగత విషయాల గురించి కాకుండా ఒక వ్యక్తిలా తనకు రాజకీయపరంగా మొదటి రోజు నుంచి చాలా మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు.పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తిల ఆయనకు మద్దతు తెలుపుతున్నానని అలాగే తనకు ఒక అవకాశం ఇవ్వాలని అందరిని వేడుకున్నారు.

Renu Desai: పిల్లలను రాజకీయాలలోకి లాగొద్దు..

పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల కోసమే కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారని తెలిపారు.తన పిల్లల గురించి మాట్లాడుతూ చాలా మంది పిల్లలను కూడా రాజకీయాలలోకి లాగుతున్నారని ఈమె తెలిపారు. ప్రస్తుతం వారికి వారి చుట్టూ ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు అందుకే తన పిల్లలను దయచేసి రాజకీయాలలోకి లాగొద్దు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పులి… ఆయన కోరిక నెరవేరాలి… పరుచూరి కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు వారాహి యాత్రలో భాగంగా రాజకీయ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఇలా సినిమాలు రాజకీయాలు అంటూ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలనీ పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంటూ ఈయన కామెంట్ చేశారు…

సమాజం ఎప్పుడు ఒకరి ఆధిపత్యంలోని ముందుకు సాగకూడదని సమాజంలో మార్పులు రావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సరైనదని పరుచూరి వెల్లడించారు. ఇలా సమాజం మారాలి అంటే అప్పుడప్పుడు అధికారం కూడా చేతులు మారాల్సిన అవసరం ఉందని ఈయన తెలిపారు.ఈ క్రమంలోనే గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దెబ్బతిన్న పులిలా మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారని ఈయన తెలిపారు. తన పట్టుదలతో ఈసారైనా తాను అనుకున్నది సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.

Pawan Kalyan: సినిమాలు మాత్రం మానొద్దు….


ఈ విధంగా పవన్ కళ్యాణ్ కోరుకున్నది నెరవేరాలని ఆయన మంచి కోరుకున్నటువంటి వారిలో తాను కూడా ఒకరని ఈ సందర్భంగా పరుచూరి పవన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పాలిటిక్స్ లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి.. వాటిని లెక్క చేయకుండా ముందు సాగాలి.. ఓటింగ్ అనేది పెద్ద రాజకీయం తంత్రం సమాజం గురించి ఒక రాజకీయ నాయకుడు చెప్పితే వినడం కన్నా… ఒక సినీ నాయకుడు చెబితే వినే వారే అధికంగా ఉన్నారని ఈయన తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతూ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టకుండా అప్పుడప్పుడు సినిమాలు చేయాలని తాను కోరుకుంటున్నానని పరుచూరి వెల్లడించారు.

Sai Dharam Tej: ప్యాకేజి స్టార్ మూడు పెళ్లిళ్ల స్టార్ అన్న వారందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్!

Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు పవన్ పేరు వింటేనే ఎంతోమంది అభిమానులకు పూనకం వస్తుందని చెప్పాలి అంతలా ఈయన అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సంగతే మరో లెవల్ లో ఉంటుందని చెప్పాలి. ఇలా సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక రాజకీయాల విషయానికి వస్తే ఈయనని విమర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈయనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చాలామంది దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ మూడు పెళ్లిళ్లు స్టార్ అంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ మాటలు విన్నటువంటి పవన్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ విమర్శలు కురిపిస్తుంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి ధరమ్ ఇదే ప్రశ్న ఎదురయింది.

మావయ్యను చాలామంది వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు.మామయ్యను ఇలా వ్యక్తిగత విషయాల ద్వారా అవమానిస్తూ ఉండడం చాలా బాధ కలుగుతుంది. అయితే మేము వాటిపై రియాక్ట్ అవ్వలేక సైలెంట్ గా ఉండడం లేదు మామయ్య చెప్పిన బాటలోనే మేము నడుస్తున్నాం కాబట్టి సైలెంట్ గా ఉన్నామని సాయి ధరంతేజ్ తెలిపారు.

Sai Dharam Tej: ఇలా ఉంటుందని మామయ్య ముందే చెప్పారు…


మామయ్య పాలిటిక్స్ లోకి వచ్చేముందు నన్ను వైష్ణవ్ వరుణ్,చరణ్ అందరిని పిలిచి నేను పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది నన్ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విషయాల గురించి కూడా విమర్శిస్తారు అలా విమర్శించినప్పుడు మీరు ఎవరు రియాక్ట్ అవ్వద్దు ఒకవేళ రియాక్ట్ కావాలి అనుకుంటే రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన చేసుకుని రాజకీయాలలోకి రండి అని తెలిపారు.మీ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందని నాకు తెలుసు కానీ అక్కడ ఏం జరిగినా మీరు రియాక్ట్ అవ్వద్దు మీ కెరియర్ మీ ప్రొఫెషన్ వదిలి మీరు బయటకు రావద్దు అని చెప్పారు అందుకే మౌనంగా ఉన్నామని ఈ సందర్భంగా తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manchu Lakshmi: నలుగురు పిల్లలని కనాలనుకున్నాను… కానీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఇక్కడ సక్సెస్ కావడం కోసం కృషి చేస్తున్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె సరైన స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ముఖ్యంగా మనోజ్ మౌనిక పెళ్లి విషయంలో ఈమె తీసుకున్నటువంటి బాధ్యతల గురించి తెలియజేశారు మనోజ్ మౌనికల వివాహం చేయడానికి చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం నాన్నకి ఉండేది.

ఇక నాన్నను పెళ్ళికి ఒప్పించడం నావల్ల కాలేదు అందుకే ఓసారి యాదాద్రి వెళ్లినప్పుడు ఎలాగైనా వీరి పెళ్లికి నాన్నను ఒప్పించు దేవుడా అంటూ భారం మొత్తం తనపై వేశానని తెలిపారు మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం జరిగిపోయిందని అందుకే వారిద్దరిని యాదాద్రి తీసుకెళ్లానని తెలిపారు.ఇక పెళ్లికి ముందు మనోజ్ మౌనిక ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవారని ఇప్పుడు వేరుగా ఉంటున్నారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

Manchu Lakshmi: రాజకీయాలపై ఆసక్తి లేదు…


ఇక మనోజ్ నాకు ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే చేసి పెడతారని తనకు చాలా సాయంగా ఉంటారని తెలియజేశారు.ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ తాను నలుగురు పిల్లలని కనాలని అనుకున్నాను కాకపోతే దేవుడు నాకు ఒకరిని ఇచ్చారు అంటూ తెలియచేశారు. ఇక రాజకీయాల గురించి ప్రశ్నలు రావడంతో అసలు తనకు రాజకీయాలు అంటేనే ఆసక్తి లేదని ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Prudhvi Raj Daughter: నాన్న రాజకీయాలు నాకు నచ్చవు… నటుడు పృథ్వీరాజ్ పై కామెంట్స్ చేసిన కూతురు!

Prudhvi Raj Daughter: సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయ్యారు కమెడియన్ పృథ్వీరాజ్. ఇలా ఈ డైలాగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈయన గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన విషయం మనకు తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈయనకు వైసిపి ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పదవిని అప్ప చెప్పింది.

అయితే కొన్ని కారణాలవల్ల ఈ పదవి నుంచి తొలగించడంతో పృధ్విరాజ్ సైతం ప్లేట్ ఫిటాయించారు.
ప్రస్తుతం ఈయన వైసీపీ పార్టీకి కాకుండా జనసేన పార్టీకి జై అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక కమెడియన్ గా ఈయనకు అవకాశాలు తగ్గడంతో డైరెక్టర్ గా మారిపోయారు ఈ క్రమంలోనే క్రాంతి అనే హీరోతో తన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రాన్ని చేస్తున్నారు.

ఈ సినిమాలో పృధ్విరాజ్ కుమార్తె హీరోయిన్ గా నటించడం విశేషం అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన తండ్రి గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమాలో అవకాశం తనకు తన తండ్రి ఒక కూతురుగా ఇవ్వలేదని ఈ పాత్రకు తాను కరెక్ట్ గా సరిపోతానన్న ఉద్దేశంతో నాన్న తనకు ఈ పాత్ర ఇచ్చారని తెలియజేశారు.

Prudhvi Raj Daughter: నాన్నకు పాలిటిక్స్ అంటే ఇష్టం…


ఇక నాన్న సినిమాలలో ఎంతో అద్భుతమైన కామెడీ చేస్తూ మంచి మంచి పాత్రలలో నటించారు. నేను తన పాత్రలను ఎంతో ఇష్టపడతాను కానీ తన రాజకీయాలు నాకు నచ్చవని తెలిపారు.పాలిటిక్స్ లోకి వెళ్లొద్దని నాన్నకు నేను చెప్పలేను ఎందుకంటే నాన్నకు పాలిటిక్స్ అంటే ఎంతో ఇష్టమని ఈమె తెలియజేశారు అయితే ఇండస్ట్రీలోకి వచ్చేముందు నాన్న నాకు ఒకే విషయం చెప్పారు. మీ ముందు వెనుక చాలా జరుగుతుంటాయి కానీ వాటిని పట్టించుకోకు అని సలహా ఇచ్చారని శ్రీలు తెలిపారు.

Jogi Naidu: పవన్ గాలి వాటం రాజకీయాలు చేస్తున్నారు… నిజమైన పొలిటీషియన్ జగన్ మాత్రమే: జోగి నాయుడు

Jogi Naidu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇక్కడ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై వైసిపి మద్దతు దారుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్న జోగి నాయుడు తాజాగా పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జోగి నాయుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జోగి నాయుడు మాట్లాడుతూ తాను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ కార్యకర్తగా పని చేశానని తెలిపారు.అయితే కొన్ని సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ తనకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు.పవన్ సిద్ధాంతాలు నచ్చిన ఆయన చేసే పనులన్నీ సినిమాటిక్ గా ఉంటాయని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే గాలివాటం రాజకీయాలు చేస్తున్నారని ఆ తర్వాత మాయమైపోతారని జోగినాయుడు తెలిపారు. పవన్ కళ్యాణ్ కి సినిమాలు ప్రొఫెషనల్ రాజకీయాలు కాదని తెలియజేశారు. కానీ జగన్ కి రాజకీయమే ఒక ప్రొఫెషన్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఆ వ్యాపారాల బాధ్యతలన్నింటిని ఆయన ఇతరులకు అప్పగించారు.

Jogi Naidu: పవన్ సినిమాలలో ప్రొఫెషనల్…

ఇలా వ్యాపారాలను ఇతరులకు అప్పగించి ఆయన పూర్తి రాజకీయ నాయకుడిగా ప్రజలలోనే ఉంటున్నారని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు.ఎన్నికలు అయిపోగానే సినిమాలలోకి వెళ్తారు తీరా ఎన్నికల సమయానికి వస్తారు అంటూ జోగినాయుడు తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లకుండా పూర్తిగా ప్రజలలో ఉండి ఉంటే కనుక పరిస్థితి మరోలా ఉండేదని జోగినాయుడు తెలియజేశారు. ఇలా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sivaji: పవన్ రాజకీయాలపై ఫోకస్ చేయలేదు… పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ!

Sivaji: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోని నటుడు శివాజీ గతంలో తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలితారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన గత కొద్దిరోజులుగా మౌనం వహిస్తున్నప్పటికీ తాజాగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఎంతో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పవన్ అభిమానులు విపరీతంగా ఉన్నారని అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సరిగా ఫోకస్ చేయలేదు అంటూ వెల్లడించారు. ఆయన వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అయితే అవి ఎప్పుడు ఉపయోగించాలో తనకు తెలియడం లేదని వెల్లడించారు.

ప్రస్తుతం మనం సాధారణ పవన్ కళ్యాణ్ ను మాత్రమే చూస్తున్నాము. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తి బయటపడినప్పుడు ఆయన అస్త్రాలను సరైన సమయంలో ఉపయోగించినప్పుడు పవన్ కళ్యాణ్ తప్పకుండా సీఎం అవుతారని శివాజీ వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ను జగన్ తో పోలుస్తూ ఈయన కామెంట్ చేశారు. జగన్ దేనిపైనైనా ఫోకస్ పెడితే తప్పకుండా సాధిస్తారని అలాగే ఆయన ఏపీలో అధికారంలోకి వచ్చారని తెలిపారు.

Sivaji: పవన్ అప్పుడే సీఎం అవుతారు…

జగన్ మాదిరిగా పవన్ రాజకీయాలపై ఫోకస్ చేయలేదని అలా ఫోకస్ చేసిన రోజున ఈయన గొప్ప నాయకుడు అవుతారని, తాను బలంగా అనుకుంటే అన్ని అయిపోతాయి సామి అంటూ మహేష్ బాబు ఖలేజా సినిమా స్టైల్ లో శివాజీ పవన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.