Tag Archives: producer

మరోసారి సింగర్ గా మారిన దిల్ రాజు.. వీడియో వైరల్..

సినిమాల్లో కాస్త డిఫరెంట్ గా హీరోలు, హీరోయిన్లతో పాటలు పాడించడం ఈ మధ్య చాలనే చూస్తున్నాం… గతంలో ప్రొఫెషనల్ సింగర్స్ మాత్రమే పాటలు పాడాలన్నా సంప్రదాయం నుంచి ప్రస్తుతం కాస్త వెరైటీగా హీరోలు, హీరోయిన్లు తమ గొంతును సవరించుకుంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో వెంకీ, చిరంజీవి, పవన్ కళ్యాన్, రవితేజ, ఎన్టీఆర్ వంటి వారు తమ సినిమాల్లో పాటలు కూడా పాడారు. మరో వైపు రాశీ ఖన్నా, శృతి హాస‌న్ వంటివారు కూడా పాటలు పాడారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ఓ పాట పాడారు.

కరీంనగర్ లో జరిగిన  ‘అమిగోస్ డ్రైవ్ ఇన్’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు పాటలు పాడడం విశేషం. ఆయన నిర్ణయం సినిమాలోని ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే పాటను పాడుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. దీంతో ఆయనలోని సింగింగ్ టాలెంట్ను బయటకి తీశారు. మొదట మొహమాటంగా పాడినట్లు కనిపించినా.. తరువాత పాటలో లీనమై పాటను పాడారు. 

గతంలో కూడా దిల్ రాజు సినిమాలో పాటపాడారు. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ ను దిల్ రాజు నిర్మించారు. ఆ సినిమాలో ‘అన్నయ్యెచ్చినాడు’ అంటూ మొదటి సారిగా పాటను పాడారు. ఆస్పూర్తితోనే మళ్లీ తనలోని గాయకుడిని బయకు తీశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు పాడిన పాట వీడియో వైరల్ అయింది.

ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫొటోషూట్‌ కోసం పిలిచి నన్ను మోసం చేశారు : నటి జయవాణి

ఒక మూవీ అని చెప్పి ఫోన్ చేశారు. వాళ్లేం చెప్పారంటే ఒకప్పుడు రమాప్రభ గారు ప్రేమ్‌నగర్ లాంటి సినిమాల్లో వేసుకున్నారు కదా ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పినట్టు ప్రముఖ ఆర్టిస్ట్ జయవాణి తెలిపారు. అయితే ఆ క్యారెక్టర్ తనకు సెట్ అవుతుందా లేదా చూద్దామని ఆ డైరెక్టర్ తనతో అన్నారని ఆమె చెప్పారు. అక్కడున్న వాళ్లలో తనకు ఎవరూ తెలియదని, డైరెక్టర్‌తో పాటు ప్రొడ్యూసర్ కూడా కొత్తవాళ్లని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించి ఒక ఫొటోషూట్ చేద్దామని అన్నారని జయవాణి చెప్పారు. కానీ ఆ పాత్రలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. అసలు అది ఎలా ఉంటుందో తనకు తెలియదు కాబట్టి ఓకే చెప్పానని ఆమె అన్నారు. అది ఎలా ఉందంటే లంబాడీ డ్రెస్ టైప్ ఉందని తనకు తర్వాత తెలిసిందని ఆమె చెప్పారు. అది వేసుకొని ఫొటోషూట్ తీసుకున్నారని ఆమె వివరించారు. అలా ఫొటోలు తీస్తున్న సమయంలో ఒక నాలుగు ఫొటోలు సరిపోతాయి కదండీ అని తను అంటే, లేదమ్మా ఫొటోషూట్ కదా అని తనకు ఏదో నచ్చజెప్పారని ఆమె తెలిపారు. అలా ఆ రోజు ఫొటోషూట్ అని చెప్పి తన ఫొటోలు తీసుకున్నారని ఆమె అన్నారు.

ఇకపోతే ఆ తర్వాత ఆ ఆఫీస్ ఏమైందో తెలియదు. ప్రొడ్యూసర్ ఏమయ్యారో, డైరెక్టర్ ఏమయ్యారో తనకు తెలియలేదని జయవాణి అన్నారు. కానీ తన ఫొటోస్ అన్నీ మాత్రం వెబ్‌సైట్‌లో వచ్చేశాయని ఆమె చెప్పారు. అవి ఎలా వచ్చాయి? వాటిని ఎలా తీసేయాలి ? ఎవరిని అడగాలని కూడా తనకు తెలియలేదని ఆమె అన్నారు. అక్కడ ఫొటోస్ తీసిన ఫొటోగ్రాఫర్‌ నెంబర్ గానీ, ఇంకెవరి డిటేల్స్ కూడా తాను తీసుకోలేదని ఆమె చెప్పారు. అవి ఎవరు పెట్టారో తనకు ఇప్పటికీ తెలియదని, కానీ ఇప్పటికీ అదొక మచ్చలాగా తనతో ట్రావెల్ అవుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొడ్యూసర్ పెద్ద తేడా.. ఆయనతో మాట్లాడలేదని నా సీన్స్ అన్నీ తీసేశారు: నటి అర్చన

ఒక తమిళ్ సినిమాలో తాను ఓ బ్యూటిఫుల్ రోల్‌ తాను నటించానని ప్రముఖ నటి అర్చన తెలిపారు. తనకు, తన మదర్‌కి ఓ కోడ్ లాంగ్వేజ్ ఉండేదని వీడు తేడా అని మాట్లాడుకుంటారని ఆమె అన్నారు. అలా సెట్లో ఉన్నపుడు వీడి బిహేవియర్ కొంచెం తేడాగా ఉందని అలా అనుకుంటామని ఆమె చెప్పుకొచ్చారు.

ఇకపోతే కొందరు షూటింగ్‌ సెట్లో అర్చన గారు ఉండాలి అంటారు. తీరా వెళ్లాక సిల్లీ బిహేవియర్ కనిపిస్తూంటుందని ఆమె చెప్పారు. అప్పుడు తాను మమ్మీ వీడు కొంచెం తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే, అవును. సరే వదిలేసేయ్ అని తన మదర్ అన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా షూటింగ్ కోసం హాంకాంగ్‌ వెళ్లానని, తనతో పాటు తన మదర్ కూడా వెంట వచ్చినట్టు ఆమె తెలిపారు. అక్కడ బ్యూటిఫుల్ సాంగ్ షూట్ చేశామని, మంచి ఫుటేజ్ షూటింగ్ కూడా అయిందని ఆమె అన్నారు.
కానీ ఆ ప్రొడ్యూసర్ చాలా యూజ్‌లెస్ ఫెలో అని ఆమె అన్నారు. వాడిని చూస్తే సినిమా తీయాలి, ఫ్యాషన్ కోసం ఏమీ రాలేదని, తన దగ్గర చాలా బ్లాక్‌ మనీ ఉంది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టేయాలి అనేసి వచ్చినట్టు తనకు అనిపించిందని అర్చన తెలిపారు.

ఒక రెండు మూడు సార్లు అతను మాట్లాడిన మాటలు తనకు నచ్చలేదని ఆమె అన్నారు. అయినా కూడా చూసీ చూడనట్టు ఉండి, అవేమీ తాను పట్టనట్టే ఉన్నానని ఆమె తెలిపారు. కానీ డైరెక్టర్‌కి మాత్రం తనపై మంచి ఒపీనియన్ ఉందని ఆమె చెప్పారు. చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్‌ కూడా అని ఆమె అన్నారు.

ఇకపోతే ఆ సినిమా రిలీజైంది. ఆ తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని అర్చన అన్నారు. అదేంటంటే, తాను చేసిన సాంగ్ మొత్తం ఆ సినిమా నుంచి తీసేసారని ఆమె వాపోయారు. అప్పుడు తాను చాలా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హీరో శర్వానంద్ ను అవమానించిన నిర్మాణసంస్థ..?

హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస ప్లాప్ సినిమాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈయన నటించిన నాలుగైదు చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో శర్వానంద్ తన ఆశలన్నీ తన తదుపరి చిత్రాల పెట్టుకున్నారు. ప్రస్తుతం శర్వా ఉన్న పరిస్థితులలో అతనికి ఒక సూపర్ హిట్ అంతేతప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేడు.

ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన మహా సముద్రం సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే శర్వానంద్ డ్రీమ్ వారియర్స్ పిక్చర్ నిర్మాణసంస్థలో ఒకే ఒక జీవితం అనే సినిమాలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాను థియేటర్లో కాకుండా మేకర్స్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.థియేటర్లో విడుదల చేయటం వల్ల ఈ సినిమా అనుకున్నంత కలెక్షన్లను సాధించలేదన్న కారణంతో మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటిటీలో విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇలా ఈ సినిమాని థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాణ సంస్థ హీరో శర్వానంద్ పై నమ్మకం లేకే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే హీరో శర్వానంద్ అవమానించినట్లే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శర్వానంద్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని థియేటర్లో విడుదల చేస్తే మరోసారి డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఇందులో క్లారిటీ రావాలంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.

ఇలియానా అడ్వాన్స్ తీసుకొని.. డేట్స్ ఇవ్వలేదు అందుకే అవకాశాలు రావట్లేదు: కాట్రగడ్డ ప్రసాద్

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను నిర్మించిన నిర్మాతగా కాట్రగడ్డ ప్రసాద్ ను చెప్పుకోవచ్చు. ఈయన అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కాట్రగడ్డ ప్రసాద్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది నిర్మాతలు కథపై ఉన్న నమ్మకంతో సినిమాలను తెరకెక్కిస్తారు. అయితే కొందరు నిర్మాతలు తీవ్రంగా నష్టపోయి ఎంతో దయనీయ పరిస్థితులలో ఉంటారు. అయితే ఇలాంటి నిర్మాతలను హీరోలు ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రసాద్ హీరోలను కోరారు. సినిమాలలో నష్ట పోవడమేకాకుండా కొందరు నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలకు డేట్లు ఇవ్వకుండా తిరుగుతుంటారని తెలిపారు.

ఇలాంటి వారి విషయాలకు వస్తే ఉదాహరణకు ఇలియానను చెప్పవచ్చు. ఈమె ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఆ నిర్మాతకు డేట్స్ ఇవ్వకుండా మోసం చేశారని తెలియజేశారు. అయితే ఈమె తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలి, లేదా ఆ నిర్మాతకు డేట్స్ అయినా ఇవ్వాలి. అలా కుదరని పక్షంలో ఎవరు కూడా సినిమాలు ఇవ్వకూడదని దక్షిణాది ఇండస్ట్రీలోని అందరూ నిర్ణయించుకున్నారు.

ఈ విధంగా నిర్మాతలందరూ నిర్ణయం తీసుకోవటం వల్ల ఆమెకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రాలేదని ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసాద్ తెలియజేశారు. ఇలా నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకొని డేట్స్ ఇవ్వకుండా, డబ్బులను వెనక్కి తిరిగి ఇచ్చిన వారు ఎంతో మంది ఉన్నారని ఈ సందర్భంగా తన సినీ అనుభవాలను పంచుకున్నారు.

ఇండస్ట్రీలో చాలామంది నాకు డబ్బు ఎగొట్టారు .. నాకు కోపం వస్తే అదే పని చేస్తా: సురేష్ బాబు

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయం పై పట్టు సాధించే కొంతమంది నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు అని చెప్పవచ్చు. సురేష్ బాబు నిర్మాణంలో ఎలాంటి సినిమాలు తెరకెక్కిన మినిమం లాభాలు పొందే విధంగా మార్కెట్ చేయడం అతని నైజం. ఎక్కువగా సురేష్ బాబు చిన్న సినిమాలపై ప్రయోగాలు చేస్తూ కొత్తవారికి ఇండస్ట్రీలో అవకాశాలను ఇస్తూ, యువతకు ప్రోత్సాహం కల్పిస్తున్నారు.

తాజాగా సురేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన నారప్ప చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల సురేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సురేష్ బాబు ప్రతి రూపాయి విషయంలో కూడా ఎంతో కఠినంగా వ్యవహరిస్తానని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ విషయంపై స్పందించిన సురేష్ బాబు ఈ విధంగా స్పందించారు.

ఇండస్ట్రీలో నా దగ్గర నుంచి చాలామంది సినిమాలు నిర్మిస్తామని, డిస్ట్రిబ్యూషన్ కోసమని చాలామంది డబ్బులు తీసుకున్నారు. ఆ లిస్టులో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడూ కూడా వారిని తన డబ్బు తిరిగి చెల్లించాలని ఇబ్బంది పెట్టలేదని, వారు నష్టాలలో ఉంటే ఆ డబ్బును తిరిగి చెల్లించమని అడగనని ఈ సందర్భంగా తెలిపారు.

నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవారిలో ప్రస్తుతం కొందరి దగ్గర మాత్రం డబ్బు ఉన్నా కూడా అప్పు తిరిగి చెల్లించలేదు. ఇలా తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే నాకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే నా దగ్గర డబ్బులు తీసుకున్న వారి లిస్టు మొత్తం బయటపెడతానని ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు.

భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి ఇంటి పేరు లో ఎస్ అంటే సుడి అని ఎందుకు అనేవారు.?!


1980 దశకంలో అప్పుడు తెలుగు నాట ఇంటింటికి దూరదర్శన్ లేదు కేవలం ఆకాశవాణిలో మాత్రమే చిత్రాలు, చిత్ర విశేషాలు, పాటలు వినడానికి మాత్రమే అవకాశం ఉండేది. ఉదయం లేవగానే జనరంజని కార్యక్రమంలో మనకి వినపడే మాట భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మూవీలో నుంచి ఈ పాట అంటూ… ఓ ప్రత్యేకమైన వాయిస్ చాలా గమ్మత్తుగా వినిపించేది. ఆ దశకంలో భార్గవ్ ఆర్ట్స్ అంటే బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టర్ అంటే భార్గవ్ ఆర్ట్స్ అనే పేరు ఉండేది.

అయితే 1951లో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సన్నారెడ్డి. గోపాల్ రెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టడం వలన ఎస్.గోపాల్ రెడ్డి వ్యవసాయం చేస్తాడు అని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. ఆ తర్వాత ‌అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు.తన ఎదుగుదలకు ఉన్నచోటు ప్రతిబంధకం అని తన మకాము మద్రాస్ కు మార్చాడు. అక్కడ సహచరుల సహాయముతో సినిమాల వైపు మొగ్గు చూపడం జరిగింది.

తన స్నేహితుడు సోమవారపు సుధాకర్ రెడ్డితో కలిసి డబ్బింగ్ చిత్రాలను చేయడం ప్రారంభించాడు. అలా మొదటగా తమిళంలో కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సినిమాను తెలుగులోకి చిలిపి కృష్ణుడు పేరుతో డబ్బింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాహం దాహం అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత గోపాల్ రెడ్డి సొంతంగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి సొంతంగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు.

అలా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో మొదటగా మనిషికో చరిత్ర హిట్ అవగా సుమన్, భానుచందర్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా ముక్కుపుడక చిత్రాన్ని నిర్మించారు. ఇది బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.అపరాధి సినిమా ఆవరేజ్ గా నిలువగా 1984 లో వచ్చిన మంగమ్మగారి మనవడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలా బాలకృష్ణ తో ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు ఆ తర్వాత మాతో పెట్టుకోకు లాంటి చిత్రాలను తీయడం జరిగింది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి.

భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో బాలకృష్ణ తో కాకుండా నాగార్జున తో మురళి కృష్ణ, అర్జున్ తో మాపల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు శ్రీకాంత్ మధురానగరిలో, రాజశేఖర్ తో రథయాత్ర, వడ్డే నవీన్ తో మా బాలాజీ లాంటి చిత్రాలను నిర్మించడం జరిగింది. అందుకే ఎస్.గోపాల్ రెడ్డి ఇంటి పేరు సన్నా రెడ్డి అయినప్పటికీ ఆయన ఇచ్చిన సక్సెస్ మూవీస్ తో సినీ పరిశ్రమలో అంతా ఆయనను సుడి గోపాలరెడ్డి అని పిలిచేవారు.