Tag Archives: ram pothineni

Ram Pothineni: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో రామ్… క్లారిటీ ఇచ్చిన స్రవంతి రవి కిషోర్!

Ram Pothineni:టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోలు పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా శర్వానంద్ పెళ్లి చేసుకోగా వరుణ్ తేజ్ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక ఈయన కూడా ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలోనే మరొక హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ పోతినేని కూడా త్వరలోనే ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు రామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు.

ఈ విధంగా హీరో రామ్ పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో స్రవంతి రవి కిషోర్ ఈ పెళ్లి వార్తలపై స్పందించారు. స్రవంతి రవి కిషోర్ బ్యానర్ ఏర్పాటు చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసినటువంటి ఈయన హీరో రామ్ కి స్వయంగా బాబాయ్ అవుతారు. ఇలా రామ్ పెళ్లి వార్తలు గురించి ఈయన మాట్లాడుతూ రామ్ పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని కొట్టి పారేశారు.

Ram Pothineni: ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు…


ఒకవేళ రామ్ కి నిజంగానే పెళ్లి కుదిరితే దాచాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఈ విషయం అందరితో పంచుకుంటామని తెలిపారు. ఇంకా రామ్ పెళ్లి విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

Ram The Warrior movie: యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం #RAPO19. దీని టైటిల్ ‘యోధుడు(The Warrior)’. తమిళ చిత్ర నిర్మాత లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌లో.. రామ్ పోతినేని పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.

Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!

ఎక్కువగా మాస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫోటోలల్లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. వీటిని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దర్శకుడు గతంలో చేసిన రెండు తెలుగు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో పూర్తిగా విఫలమయ్యాయి.

పందెం కోడి 2 డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రజల నుండి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇలా లింగుస్వామికి గత కొంతకాలంగా ఎలాంటి హిట్ అందుకోలేదు. దీనితో అయినా ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నాడు.
లింగుస్వామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో సినిమా కావడం, తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

టైటిల్ ను తన సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నా..

ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నాడు. అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్‌ క్యాస్ట్‌ ఉండడం కూడా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది.
ఇదిలా ఉండగా.. పోస్టర్ విడుదలన కొద్ది సమయానికే ఆ టైటిల్ పై వివాదాలు నెలకొన్నాయి. తన టైటిల్ ను కాపీ కొట్టారని హవీష్ అనే యంగ్ హీరో ఆరోపిస్తున్నాడు. వారియర్ అనే టైటిల్ ను తన సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే సినిమా డీటెయిల్స్ ను కూడా ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. రాపో19 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రారంభించినప్పుడు కథ కాపీ వివాదంలో చిక్కుకుంది. ఇలా వివాదాల నడుమ ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

నటుడు రామ్ నటించిన రెడీ సినిమాకు పోటీగా వచ్చిన సినిమాలు ఇవే !

ప్రముఖ నటుడు రామ్, హీరోయిన్ జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా రెడీ. ఈ చిత్రంలో హీరో రామ్ ఎనర్జీ లెవల్స్ మామూలుగా ఉండవు. నటి జెనీలియాను ప్రేమించిన రామ్, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులతో ఆడిన నాటకాలు, ముఖ్యంగా బ్రహ్మానందంను ఈ చిత్రంలో బాగా వాడుకున్నారనే చెప్పాలి. ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్‌ చేశారో, అలాగే ఈ చిత్రంలోనూ ఓ పవర్‌ఫుల్ రోల్‌ని ఆయన ప్రదర్శించారు.

ఇకపోతే ఈ సినిమా ఆధ్యంతం కామెడీని అందిస్తూ, ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను కూడా రాబట్టింది. సుమారు 17 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల బాణీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జూన్ 19, 2008న రిలీజైన ఈ మూవీకి రెండు వారాల గ్యాప్‌తో వచ్చిన సినిమా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడీ సినిమాకు 13రోజుల ముందు అలీ హీరోగా నటించిన సోంబేరీ అనే సినిమా విడుదలైంది. కానీ కథాబలం అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. దీని తర్వాత జూన్ 13న రెడీ సినిమాకు 6 రోజుల ముందుగా విశ్వనటుడు కమల్ హాసన్ తీసిన దశావతారం రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం మొదట విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత అందరిచేత మంచి పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత హీరో రాజశేఖర్ నటించిన గోరింటారు. చెల్లెలి సెంటిమెంట్‌కు పెద్దపీట వేస్తూ తీసిన ఈ సినిమాలో అన్నపై అంతులేని అభిమానమున్న చెల్లెలిగా హీరోయిన్ మీరా జాస్మిన్, అలాగే వారిని విడదీయాలని చూసే క్యారెక్టర్‌లో ఆర్తి అగర్వాల్ నటించారు. కుటుంబ కథాచిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇలా మొత్తంగా రెడీ సినిమాతో రామ్ నంబర్ 1 పొజిషన్‌లో ఉండగా, ఆ తర్వాత గోరింటాకు’తో రాజశేఖర్, కమల్ హాసన్ దశావతారంతో విజయం సాధించారు.

షూటింగ్ లో గాయపడిన హీరో రామ్… ఆందోళనలో అభిమానులు!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని షూటింగులో భాగంగా గాయపడినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

ఎంతో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ ఎక్కువగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో రామ్ లుక్ గతంలో ఏ సినిమాలోనూ లేని విధంగా ఎంతో స్టైలిష్ గా కనిపించనున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకోసం అదేస్థాయిలో కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ కోసం రామ్ ఎక్కువగా జిమ్ లో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా జిమ్ లో బాగా వర్కౌట్ చేస్తున్న సమయంలో రామ్ మెడ నరం పట్టేసిందని తెలిపారు.

ఈ క్రమంలోనే తన పర్సనల్ డాక్టర్ ను సంప్రదించిన రామ్ తగినన్ని జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి బాగా ఉందని అయితే డాక్టర్ల సలహాలు సూచనల మేరకు మరికొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొనడం లేదని తెలియజేశారు. ఈ క్రమంలోనే లింగస్వామి సినిమా చిత్రీకరణను కొద్ది రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

తల్లికాబోతున్న కాజల్.. విశ్రాంతి అందుకేనా?

తెలుగు, తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది.

ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్, అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. ఇలా తెలుగులో పలు సినిమాల్లో నటించింది కాజల్. అయితే గత ఏడాది ఆమె గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మెగస్టార్ సరసన ఆచార్యలో కూడా నటిస్తోంది. అంతేకాకుండా ఆమె మరో సినిమాలో ఉగ్రవాదుల సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఓ వేశ్య పాత్రలో కనిపించబోతోందట. దానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా.. నాగ్ హీరోగా ఉన్నారు. వేశ్య పాత్ర అని తెలుసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. అలాంటి పాత్రను ఎందుకు ఎంచుకున్నారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. ఆమె గర్భం దాల్చింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. తమ వద్ద ఉన్న సినిమాల్లో షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

సహనం కోల్పోయి ఉప్పెన బ్యూటీ పై ఫైర్ అయిన డైరెక్టర్..?

“ఉప్పెన” చిత్రం ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు కృతి శెట్టి.మొదటి చిత్రం ఉప్పెన అనుకున్న దానికన్నా విజయవంతం కావడంతో ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను దక్కించుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమా విజయవంతం కావడంతో ఆ తర్వాత ఈమె తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ లొకేషన్ లో హీరోయిన్ లు సరిగ్గా చేయకపోతే దర్శకులు హీరోయిన్లను మందలిస్తారనే వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉప్పెన బ్యూటీ కూడా డైరెక్టర్ లింగుస్వామి సహనానికి పరీక్ష పెట్టి అతని ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

ఉప్పెన సినిమా ద్వారా తన హావభావాలను ఎంతో అద్భుతంగా వ్యక్తపరిచిన కృతిశెట్టి లింగుస్వామిని మెప్పించలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లింగుస్వామి నాజర్, కృతి శెట్టి మధ్య చిన్నపాటి ఎమోషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి సన్నివేశానికి అనుగుణంగా హావభావాలను సరిగా వ్యక్త పరచలేదని డైరెక్టర్ సెట్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గంట గడచినా కూడా షాట్ ఓకే కాకుండా అధిక టేకులు తీసుకోవటంవల్ల సహనం కోల్పోయిన డైరెక్టర్ షూటింగ్ ముందే సీన్స్ ప్రాక్టీస్ చేయాలనీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పెన ద్వారా అందరినీ మెప్పించిన ఈ బ్యూటీ లింగస్వామిని మాత్రం మెప్పించలేకపోయిందని భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? అబద్దం అనే విషయం తెలియాల్సి ఉంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తలపడనున్న.. యంగ్ హీరో?

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి మాస్ యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే హీరో రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.

ఇదివరకు ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ విలన్ పాత్రలో చేయబోతున్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.అయితే ఆ వార్తల్లో నిజం లేదని మాధవన్ స్పందించడంతో ఆ తర్వాత పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా హీరో రామ్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో చేయనున్న హీరో గురించి తెలియజేశారు.

ఇదివరకే తెలుగులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ సరైనోడు వంటి సినిమాలలో విలన్ పాత్రలో తన మార్క్ ఏంటో చూపించిన ఆది పినిశెట్టి లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మరోసారి హీరో రామ్ తో పోటీ పడనున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ ఆదికి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు.

ఇక పోతే ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జతకట్టారు. అదేవిధంగా నదియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభించిన ఈ సినిమాకు చిత్రబృందం ‘ఉస్తాద్’అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బర్త్ డే స్పెషల్ : ఆ రికార్డు మాత్రం ‘రామ్’ ఒక్కడికే సొంతం..!!

టాలీవుడ్ లో క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు హీరో రామ్ పోతినేని. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్‌ పుట్టించే యంగ్‌ హీరోల్లో రామ్‌ఒకరు. నేడు (మే 15) రామ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం.. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు.

ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’రవికిశోర్ తమ్ముడే మురళీ పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లో నడుస్తూ.. సినిమాలపై వైపు వచ్చాడు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవీఎస్‌ చౌదరీ దర్శకత్వం వహించిన దేవదాస్‌(2006) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్‌ అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

అయితే రామ్ రెండో చిత్రం ‘జగడం’ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి.ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది.

ఈ సినిమా తొలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 8 కోట్లకు పైగా షేర్‌ను సాధించడం విశేషం. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్‌ హీరో. అంతే కాదు ఈ సినిమాను డబ్‌ చేసి హిందీలో వదిలితే.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్‌తో అదరగొట్టింది. అంతేకాకుండా హిందీలోకి డబ్ చేసిన ఆయన నాలుగు చిత్రాలు 100 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేసుకోవడం ఓ రికార్డు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలను 100 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా ఘనతను దక్కించుకొన్నారు.ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్‌ రామ్‌ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే రామ్ పోతినేని..!!

సంక్రాంతికి రానున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్!

దేవదాసు సినిమా ద్వారా రామ్ పోతినేని ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమానే ఎంతో ఘన విజయం సాధించడంతో రామ్ కు తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో మాస్ క్యారెక్టర్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే దూకుడుతో రామ్ తరువాత” రెడ్” అనే చిత్రం ద్వారా అదే ఎనర్జీ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

రెడ్ అనే ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయకుండా నేరుగా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించిన చిత్రబృందం ఈ నెల 24న
రెడ్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలుపుతూ అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ సంక్రాంతి బరిలోకి రానున్న తన మూడవ చిత్రం” రెడ్” అని తెలిపారు. సంక్రాంతి బరిలోకి మొదటగా “దేవదాస్”, “మస్కా”చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని తెలిపారు.

ఈ చిత్ర నిర్మాణం పూర్తయి దాదాపు చాలా రోజులు అవుతున్నప్పటికీ ఈ త్రిల్లర్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎదురు చూశామని, అందుకోసమే సంక్రాంతికి సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు రామ్ నుంచి ఏవైతే కోరుకుంటున్నారు ఆ అంశాలన్నీ ఈ సినిమాలో చూడవచ్చని ఈ సినిమా నిర్మాత రవికిషోర్ తెలిపారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయని నిర్మాత తెలిపారు.