Tag Archives: rashmika

Rashmika: రష్మిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…. ఇప్పుడు భారీగానే అందుకుంటుందిగా?

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలోనూ అలాగే హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

ఈమె ఇటీవల తన 28వ పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా జరుపుకున్నారు. రష్మికకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సంచలనంగా మారింది. రష్మిక కర్ణాటకలోనే జన్మించి అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఇలా కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు..ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమెను చూసి కిరిక్ పార్టీ సినిమా అవకాశాలు కల్పించారు. ఈ సినిమా కోసం ఈమె ఏ విధమైనటువంటి ఆడిషన్స్ కూడా నిర్వహించలేదు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

మోడలింగ్ రంగంలో..
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ఈమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో చలో సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాకు 50 లక్షలు తీసుకున్నటువంటి రష్మిక అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

Rashmika: రష్మిక ప్రతి వీకెండ్ ఆ పని చేయాల్సిందేనా… మామూలు ప్లానింగ్ కాదుగా?

Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈమె ఇక్కడ కూడా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే తెలుగులో ఈమె నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస బాలీవుడ్ సినిమాలకు కూడా రష్మిక కమిట్ అవుతున్నారు. రష్మిక ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిత్యం సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే రష్మిక వీకెండ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారని తెలుస్తుంది.

స్నేహితులతో ఎంజాయ్…
ఈమె డే మొత్తం ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ వీకెండ్ మాత్రం తన కుటుంబానికి కావాల్సిన సమయం కేటాయించడమే కాకుండా ఇక ఎక్కువ భాగం స్నేహితులతోనే గడుపుతారని తెలుస్తుంది. ప్రతి వీకెండ్ ఈమె తన స్నేహితులతో కలిసి తనకు నచ్చినట్టుగా ఉంటారట. ఇలా ప్రతి వీక్ ఈమె స్నేహితులను కలిసి ఆ వీకెండ్ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారని తెలుస్తోంది.

Rashmika: మై డార్లింగ్.. పార్టీ కావాలంటున్న రష్మిక.. రౌడీ హీరో రిప్లై ఇదే?

Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఆల్ ది బెస్ట్ మై లవ్..
మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Rashmika: రష్మికను ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తారో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె విజయ్ దేవరకొండతో కలిసి రెండు సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాలను బయట పెట్టడం లేదని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లోకి వెళ్లడం ఏదైనా పండుగలు ఉంటే తన ఇంటికి వెళ్లి సెలెబ్రేట్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండతో పాటు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కూడా రష్మిక చాలా క్లోజ్ గా ఉంటారు అయితే ఇటీవల ఆనంద్ దేవరకొండ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఇలా ఆనంద్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా రష్మిక ఆనంద్ ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి రష్మిక హ్యాపీ బర్త్డే ఆనందా అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు.

రషీ….
ఇలా ఆనంద్ మాటలకు రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా పోస్ట్ చేసింది. ఇలా వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే రష్మికను ఆనంద్ దేవరకొండ ముద్దుగా రషీ అని పిలుస్తారని ఈ సందర్భంగా బయటపడటంతో అభిమానులు కూడా తనని ఆ పేరుతోనే పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Rashmika: రష్మిక సినిమాలకు కమిట్ అవ్వాలంటే స్క్రిప్టులో ఈ విషయాలు ఉండాల్సిందేనా?

Rashmika: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం ఈమె నేషనల్ క్రష్ గా గుర్తింపు పొంది వరుస సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్లో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా రష్మిక ఓ వెలుగు వెలిగారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా సక్సెస్ అవ్వడం వెనుక ఉన్నటువంటి కారణాలను తెలిపారు. ముఖ్యంగా స్క్రిఫ్ట్ ఎంపిక విషయంలో ఈమె తీసుకునే జాగ్రత్తలను ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తాను ముందుగా స్క్రిప్ట్ విన్న తర్వాత దానిని పూర్తిగా చదువుతానని తెలిపారు. స్క్రిప్ట్ మంచి కంటెంట్ ఉంటే అనంతరం నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలని భావిస్తాను. అంతేకాకుండా నేను చేసే పాత్ర ద్వారా కొంచెం అయినా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తాను ఈ మూడు అంశాలు కనుక స్క్రిప్టులో ఉంటే తాను ఆ సినిమాలను వదులుకోనని తెలిపారు.

ఈ మూడు విషయాలు ఉండాల్సిందేనా..
ఈ విధంగా రష్మిక స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఈ జాగ్రత్తలను తీసుకుంటారని ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈమె చేసే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Rashmika: పుష్ప భార్యగా నాపై బాధ్యత పెరిగింది.. రష్మిక కామెంట్స్ వైరల్!

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల జపాన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ వేడుకలలో పాల్గొంది. ఈ ఈవెంట్ కు హాజరైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన అప్ కమింగ్ మూవీస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పుష్ప 2 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్ర బృందంతో కలిసి తాను కలిసి షూటింగ్లో పాల్గొనడం గురించి ఆసక్తికర విషయాలు తెలిపారుని రోజులు నేను పుష్ప రాజ్ ప్రేయసిగా మాత్రమే ఉన్నాను అయితే ఇప్పుడు మాత్రం పుష్ప భార్య. అది చాలా బాధ్యతలతో నిండి ఉన్న పాత్ర. సీక్వెల్ లో చాలా ఎక్కువ డ్రామా, పాత్రల సంఘర్షణలు ఉన్నాయి. అలాగే ఈ లో ఎక్కువగా మసాలా ఉంటుందని తెలిపారు.

భార్యగా నాపై బాధ్యతలు పెరిగాయి…
డైరెక్టర్ సుకుమార్ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని.. పుష్ప 2 పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయని అయితే ఆ అంచనాలను ఈ సినిమా చేరుకుంటుంది అంటూ ఈ సందర్భంగా రష్మిక పుష్ప సీక్వెల్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

Rashmika: మాజీ ప్రియుడుతో రష్మిక ఇంకా ఆ పని చేస్తుందా.. అసలు విషయం బయటపెట్టిన మాజీ ప్రియుడు?

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ సినీ నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రష్మిక అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు ఇకపోతే రష్మిక ఇటీవల అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

రష్మిక మందన్న రీసెంట్ గా అండర్ 30 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది . ఈ క్రమంలోనే పలువురు స్టార్ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందిస్తున్నారు. తన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి రష్మిక సాధించిన ఈ ఘనత గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా రక్షిత శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రష్మిక అనుకున్నది తప్పకుండా సాధిస్తుంది ఆమె తన జీవితంలో కొన్ని ఆశయాలు గోల్స్ ఉన్నాయని, ఆమె గోల్స్ కచ్చితంగా రీచ్ అవుతుంది సో టాలెంటెడ్ ..మేము పెళ్లి బ్రేక్ చెప్పుకున్నా సరే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాము. రష్మిక తన జీవితంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశిస్తున్న అంటూ రక్షిత్ శెట్టి ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపారు.

సో టాలెంటెడ్..

రక్షిత్ శెట్టి రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉంటూ పెళ్లికూడా చేసుకోవాలనుకున్నారు. వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. నిశ్చితార్థం తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లికి బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ వీరిద్దరూ ఇంకా మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నారు అంటూ రక్షిత్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

Rashmika: ఫోర్బ్స్ జాబితాలో సరికొత్త రికార్డు సృష్టించిన రష్మిక.. సంతోషంలో ఫ్యాన్స్!

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి రష్మిక ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా ద్వారా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ మ్యాగజైన్ సమస్త అయినటువంటి ఫోర్బ్స్ ఇండియా వెర్షన్ లో రష్మిక.. ప్రత్యేక ఆర్టికల్ ప్రచురించబడింది. ఇంకా..ఇండియాలో ప్రస్తుతం టాప్ పొజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలలతో పాటు సినిమా స్టార్స్ ను కూడా కలుపుకుని..  స్టార్స్ కి సంబంధించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక ఆర్టికల్ ని ప్రచురించింది. 

మ్యాగజైన్ కవర్ పేజీ..

ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి రష్మికకు సంబంధించినటువంటి ఆర్టికల్ ప్రచురించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఇలాంటి ప్రముఖ మ్యాగజైన్లు చోటు సంపాదించుకున్నటువంటి నటిగా రష్మిక గుర్తింపు పొందారు. అదేవిధంగా ఈమెతో పాటు ఇతర రంగాలలోని ప్రముఖులతో కలిసి దిగినటువంటి ఫోటో ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika: వాలెంటైన్స్ డే ప్లాన్స్ చెప్పిన రష్మిక.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్!

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా బుంగమూతి పెట్టుకుని సెల్ఫీలకు పోజులిస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

00

ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఇటీవల కాలంలో పని ఎక్కువగా ఉండటం వల్ల తాను అభిమానులతో మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. మీరందరూ కూడా కామెంట్ల రూపంలో ఇప్పటివరకు జరిగిన విశేషాలు అన్నిటిని తనతో పంచుకోమని తెలిపారు. అలాగే వాలెంటైన్స్ డే ప్లాన్స్ కూడా తనకు చెప్పమని తెలిపారు.

ఇలా వాలెంటైన్స్ డే ప్లానింగ్ ఏంటి అంటూ రష్మిక ప్రశ్నించడంతో వెంటనే ఈమె ఫాలోవర్స్ ఒకరు. ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు మీరు ఎలాంటి ప్లాన్స్ చేశారు అంటూ ఈమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు రొటీన్ వర్క్ ఉంటుంది అంటూ స్మైల్ ఎమోజీలను షేర్ చేశారు.

విజయ్ దేవరకొండతో ప్లాన్స్ ఏంటీ…

ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ విజయ్ దేవరకొండతో ఎలాంటి ప్లాన్స్ చేయలేదా రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో పలువురు నేటిజన్స్ ఈమె పట్ల ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rashmika: తప్పుడు వార్తలను నిజం చేస్తే పోలే… రెమ్యూనరేషన్ పై రియాక్ట్ అయిన రష్మిక!

Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం భాషతో సంబందం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.

ఇకపోతే రష్మిక ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే రష్మిక ఒక్కో సినిమాకు సుమారు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఇలా తన రెమ్యూనరేషన్ గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె స్పందించారు. నేను ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నానని మీకు ఎవరు చెప్పారు మీరు ఇంతలా చెప్తున్నారు అంటే నేను కూడా ఈ విషయం గురించి ఓసారి ఆలోచించాల్సిందే.

ఆలోచించాల్సిన విషయమే..

ఇకపై నిర్మాతల దగ్గర కూడా నేను రెమ్యూనరేషన్ గురించి డిమాండ్ చేస్తానని, మీడియా వాళ్ళు నా రెమ్యూనరేషన్ పెంచారని చెప్పి మీ మాటకు నేను కట్టబడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా తన రెమ్యూనరేషన్ పెరిగిందంటూ వస్తున్నటువంటి వార్తలపై రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.