Tag Archives: tdp

Lokesh: మరోసారి మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదా?

Lokesh: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికలలో మొదటిసారి పోటీ చేశారు. అయితే ఈయన గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైపు పోటీ చేసినటువంటి ఈయన ఆయన చేతిలో సుమారు 5000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

ఇలగతే ఎన్నికలలోకేష్ ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా కూడా మంగళగిరిలో గెలవాలి అన్న ఉద్దేశంతో ఈయన ఈ ఐదు సంవత్సరాలపాటు మంగళగిరిలో తరచూ పర్యటిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి సిద్ధం కాగా ఎలాగైనా తనని ఓడించే దిశగా వైసిపి వ్యూహం రచిస్తోంది..

ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున మురుగుడు లావణ్యను రంగంలోకి దించారు .ఈమె బిసి మహిళా కావటం విశేషం మంగళగిరిలో పెద్ద ఎత్తున బిసి ఓట్లు ఉండటంతో తనకి సీటు కేటాయించారు అంతేకాకుండా ఈమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె కావడంతో స్థానికంగా ఆమెకు మరింత మద్దతు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బీసీ ఓట్లే లక్ష్యంగా..
మొదటినుంచి కూడా మంగళగిరిలో వైకాపాకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లోకేష్ కి కూడా కాస్త మద్దతు ఉందని చెప్పాలి. ఇలా ఈయనకు మద్దతు పెరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక బీసీ మహిళ అయినటువంటి లావణ్యను జగన్ రంగంలోకి దించారు. దీంతో ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ కి ఓటమి తప్పదని అక్కడ వైసిపి జెండా ఎగురుతుందంటూ వైసిపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో లావణ్య లోకేష్ కి ఎలాంటి పోటీ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

AP politics: టీడీపీ మూడో జాబితా విడుదల… భగ్గుమన్న శ్రీకాకుళం.. మేనిఫెస్టో కాల్చివేత?

AP politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి175 స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను, అలాగే 25 స్థానాలలో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి గొడవలు కానీ నిరసనలు కానీ చోటు చేసుకోలేదు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి టికెట్లు రాకపోవడంతో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గత కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా మూడో జాబితాను కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేశారు ఈ క్రమంలోనే ఈ జాబితాలో కూడా తమ పేరు లేకపోవడంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలకు తెర తీశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి కాకుండా.. గోండు శంకర్‌కు టికెట్‌ కేటాయించడంపై ఆమె వర్గీయులు రగిలిపోయారు.

చంద్రబాబు ఫోటో ధ్వంసం..
చంద్రబాబు ఫొటోను పగలకొట్టి.. చించిపారేసి కాళ్ల కింద పడి తొక్కారు. పార్టీ జెండాల్ని, మేనిఫెస్టోను తగలబెట్టి బాబు, పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. చంద్రబాబు తీరుపై గుండ లక్ష్మీదేవి అనుచరులు రగిలిపోతూ.. మంటలు రాజేసి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా తనకు టికెట్ రాకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ ఈమె పార్టీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

AP politics: చిచ్చు రేపిన రెండో జాబితా.. రాజీనామాల బాటలో టీడీపీ జనసేన?

AP politics: ఏపీ ఎన్నికల తేదీ ప్రకటనలు రాకముందే ఎన్నికల వేడి రాజు కుంది. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతూ పార్టీకే ముప్పు తెచ్చేలా పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లను జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు ఇదివరకే 99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండో జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ రెండో జాబితా పార్టీ నేతలలోనూ కార్యకర్తలలోనూ పెద్ద ఎత్తున చిచ్చు రేపింది.

రెండో జాబితాలో ఆయన తమ పేరు ఉంటుందని ఆశించినటువంటి పలువురు సీనియర్లకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సీట్లు రాలేదన్న ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలలో టిడిపికి జనసేన పార్టీకి తీవ్రస్థాయిలో వ్యతిరేక సెగ తగులుతుంది.

టీడీపీకి రాజీనామా..
పలు నియోజకవర్గాలలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో మనస్థాపానికి గురైనటువంటి కొంతమంది నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో చంద్రబాబు నాయుడుకి జనసేనానికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది ఇక మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పేరు రెండో జాబితాలో లేకపోవడంతో ఈయన కూడా అలక మానలేదని తెలుస్తుంది. అయితే ఇలా అలిగిన వారందరినీ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి వారందరికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ… ఊహించని షాక్ ఇచ్చిన పిఠాపురం వాసులు?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో హీరోగా నటిస్తూనే మరో వైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీని స్థాపించారు అయితే ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలి అన్న ఉద్దేశంతో ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సభలను ఏర్పాటు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సీట్ల పంపకాలు కేటాయింపులు కూడా పూర్తి అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ తాను ఈసారి భీమవరం గాజువాక నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించారు.

ఇలా ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయగానే పిఠాపురంలో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు భగ్గుమన్నారు.. పవన్ కళ్యాణ్ కు టికెట్ ఇస్తే కనుక తాము ఓట్లు వేయము అంటూ టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపి పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ కరపత్రాలతో పాటు ఫ్లెక్సీలను చింపేసి మంటలలో కాల్చి వేశారు.

గెలుపు కష్టమేనా…
ఇలా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాననే విషయాన్ని ప్రకటించడం ఆలస్యం వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి ఇలా వీరి వ్యవహార శైలి చూస్తుంటే ఈసారి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అసాధ్యంగానే మారిందని తెలుస్తోంది.

Poonam Kaur: టీడీపీ జనసేన సీట్లు ప్రకటన.. కుక్క ఫోటోని షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన పూనమ్?

Poonam Kaur: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం కోసం ఇతర పార్టీలన్నీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.

ఈ క్రమంలోనే తొలి జాబితా కింద టిడిపి జనసేన కూటమి అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఇందులో మొత్తం 99 అభ్యర్థులను ప్రకటించగా 94 టిడిపి అభ్యర్థులు కాగా మిగిలిన 5 సీట్లను జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ లిస్టు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెతుతున్నాయి.

నాలుగు సీట్లు పొందడం కోసం ఒక పార్టీ పెట్టి తిరిగి ఆ పార్టీని టిడిపితో కలపడం దేనికి అంటూ పలువురు విషయంపై విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా ఈ విషయంపై తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇవ్వటం వల్లే టీడీపీతో కుమ్మక్కయ్యారు అంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

జనసేనకు ఐదు…
ఈ క్రమంలోనే పూనమ్ సోషల్ మీడియా వేదికగా దివంగత నటి శ్రీదేవి కుక్కతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి వైసీపీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు ఏం టైమింగ్ అక్క మీది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు టైం చూసి కుక్క ఫోటో వదిలింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్ లు చేస్తున్నారు.

Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు టిడిపికి కలిసొచ్చేనా… వైసిపి ప్రమాదంలో ఉన్నట్టేనా?

Telangana: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఏ సంఘటన జరిగినా ఇరు రాష్ట్ర ప్రజలు నాయకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే తాజగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున బారాస, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతూ ప్రచార కార్యక్రమాలను చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి బారాస పార్టీకి ప్రజలు మద్దతు తెలుపకపోగా హస్తం చేతిలో హస్తం వేసి కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

ఇలా తెలంగాణలో పదేళ్ల బారాసపాలనకు ప్రజలు పులిస్టాప్ పెట్టారని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలపై ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి కొంతమేర ఏపీ నేతలలో కూడా గుబులు మొదలైందని తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుతో ఎంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అధికారక ప్రకటన లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపి ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి పడేలా వ్యూహం రచించారు.

ఇక రేవంత్ రెడ్డి గెలవగానే కాంగ్రెస్ జెండాలతో పాటు ఊరేగింపులో పసుపు జెండాలు కూడా కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రేవంత్ రెడ్డి ఎట్టకేలకు విజయం సాధించార. అయితే రేవంత్ రెడ్డికి ఎంతో సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా వచ్చే ఎన్నికలలో రేవంత్ సహాయ పడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపారో ఇక్కడ కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నారని తెలుస్తుంది.

అలర్ట్ అవుతున్న వైసీపీ నేతలు…

ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తుకుదురుచుకున్నారు. మరోవైపు బీజేపీ పార్టీని కూడా కలుపుకోవడానికి కేంద్రంతో పవన్ కళ్యాణ్ చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని పార్టీలు కలిసి ఈసారి వైసిపి పార్టీపై దండెత్తబోతున్నాయని తెలుస్తుంది . ఇలా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి బారాస పార్టీకే ప్రజలు మద్దతు తెలుపలేదు దీంతో వైసిపి నేతలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకపోతే తెలంగాణలో బారాసకి వచ్చిన పరిస్థితి ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రాబోతోంది అంటూ మరికొందరు నేతలు భావిస్తున్నారు అయితే రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదు కనుక ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.

Ramgopal Varma: నందమూరి ఫ్యామిలీలో తారక్ ఒక్కడే అసలైన మగాడు: వర్మ

Ramgopal Varma:నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వర్మ మాట్లాడుతూ నేను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి రాలేదని తెలిపారు. కేవలం ఒక జోక్ చెప్పడానికి ఇక్కడికి వచ్చానని ఇది చాలా సీరియస్ జోక్. ఈ జోక్ వింటే ఎవరు కూడా నవ్వరని వర్మ తెలియజేశారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అని తెలిపారు.

చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని కొందరు అంటున్నారు అయితే ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తికి అవగాహన లేదా అవగాహన లేని వ్యక్తికి ఎందుకు పూజలు చేస్తున్నారు దండలు వేస్తున్నారని ప్రశ్నించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి వారు సైతం చంద్రబాబు పక్కనే కూర్చుని వాళ్లను పోగిడారు. ఇది ఒక రకంగా రజినీ కాంత్ కూడా ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడొస్తున్నట్టే.

Ramgopal Varma: Jr.NTR ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు…

ఇక మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్ మాత్రమే. వాళ్లందరితో పాటు వేదికను పంచుకోకుండా, అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. అందుకు కారణం వాళ్ల తాత మీద ఉన్న విపరీతమైన గౌరవంతో Jr.NTR ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడంటూ ఎన్టీఆర్ గురించి రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Alekhya Reddy: భర్త చివరి కోరిక తీర్చనున్న అలేఖ్య రెడ్డి…. గుడివాడ ఎన్నికల బరిలో అలేఖ్య!

Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య ఒంటరైన విషయం మనకు తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో నందమూరి కుటుంబం తారకరత్నను ఇంటికి దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే తారకరత్న తన భార్య అలేఖ్య ముగ్గురు పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవారు అయితే తారకరత్న గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా తారకరత్న మరణంతో అలేఖ్య ఎంతో కృంగిపోయారు. తన భర్తను తలుచుకుంటూ తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ బాధను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా అలేఖ్యకు సంబంధించిన ఓ వార్త సినీ రాజకీయ రంగాలలో తీవ్ర చర్చలకు కారణమైంది. అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికలలో గుడివాడ ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తారకరత్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా రాజకీయాలలో కొనసాగాలని భావించారు. ఈ క్రమంలోని గుడివాడ నుంచి తాను పోటీ చేయాలనే నిర్ణయించుకున్నారట అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే తారకరత్న అనుకోకుండా గుండెపోటుకి గురై మరణించడంతో ఆ కోరిక అలాగనే ఉండిపోయిందట.

Alekhya Reddy: ఎమ్మెల్యే అభ్యర్థిగా అలేఖ్య రెడ్డి…


ఈ క్రమంలోనే తన భర్త చివరి కోరికను తీర్చడం కోసం అలేఖ్య రెడ్డి ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే అలేఖ్యను గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చంద్రబాబునాయుడు ఏ విధంగాను అధికారిక ప్రకటన తెలియజేయలేదు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

AP Politics: ఎన్నికలు ఎప్పుడు జరిగిన 160 స్థానాలు తెదేపావే: అచ్చం నాయుడు

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎంత రసవత్తరంగా మారుతూ ఉంటాయి. నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాజాగా విశాఖలో బుధవారం నిర్వహించిన జోన్‌-1 (ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధి) సమీక్షసమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత అచ్చం నాయుడు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అచ్చం నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఎంతోమంది ముఖ్యమంత్రిలు పరిపాలించారు. అయితే మొదటిసారి ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని తెలియజేశారు.ఇలాంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం.

సొంత పార్టీ నాయకులే ఆయనని నమ్మడం లేదు అలాంటిది ఈయన నువ్వే మా నమ్మకం జగన్ అని ప్రజల ముందుకు వెళుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.జగన్ అంటే నమ్మకం కాదు ఆయన రాష్ట్రానికి పట్టిన ఓ దరిద్రం అంటూ అచ్చం నాయుడు ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు చేశారు.ఇక ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియచేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలను కోరారు.

AP Politics: ఎమ్మెల్సీ ఫలితాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి…

ఇక జగన్ పని అయిపోయిందని వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడం ఖాయం అని తెలిపారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఏకంగా 160 సీట్లను గెలుపొంది అధికారాన్ని అందుకుంటుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇక 30 సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని గొప్పలు చెప్పిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలను బ్రతిమాలుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయని అచ్చం నాయుడు వెల్లడించారు.

Manchu Manoj: మనోజ్ పెళ్లికి మోహన్ బాబు రావడం లేదా…. వ్యవహారం అంతవరకు వెళ్లిందా?

Manchu Manoj: మంచు మనోజ్ రెండోసారి పెళ్లికొడుకుగా మారిపోయారు.ఈయన ఇది వరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చినటువంటి మనోజ్ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే ఈయన కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారు.

ఇలా గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇకపోతే మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని సమాచారం.

ఇలా భూమ మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి మోహన్ బాబు తన పెళ్లికి కూడా రావడంలేదని తనతో పాటు తన పెద్ద కుమారుడు విష్ణు కూడా ఈ పెళ్లికి దూరంగా ఉంటున్నారని సమాచారం. అందుకే మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా మారి తన ఇంటి వద్ద మనోజ్ పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Manchu Manoj: ఆస్తులను పనిచేసిన మోహన్ బాబు…

ఇక మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి గల కారణమేంటనే విషయానికి వస్తే మౌనిక టిడిపి నాయకుడి కుమార్తె కావడం ఒక కారణమైతే ఆమె ఇది వరకే పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చి విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి మోహన్ బాబు ఇష్టపడటం లేదని తెలుస్తుంది.ఇక ఈ విషయంలో వీరి మధ్య గొడవలు కూడా జరిగాయని అందుకే మోహన్ బాబు మనోజ్ కి రావలసిన ఆస్తిని కూడా తనకు ఇచ్చేసినట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది.. నిజంగానే మోహన్ బాబు పెళ్లికి దూరంగా ఉంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.