Tag Archives: Ycp

Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు టిడిపికి కలిసొచ్చేనా… వైసిపి ప్రమాదంలో ఉన్నట్టేనా?

Telangana: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఏ సంఘటన జరిగినా ఇరు రాష్ట్ర ప్రజలు నాయకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే తాజగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున బారాస, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతూ ప్రచార కార్యక్రమాలను చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి బారాస పార్టీకి ప్రజలు మద్దతు తెలుపకపోగా హస్తం చేతిలో హస్తం వేసి కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

ఇలా తెలంగాణలో పదేళ్ల బారాసపాలనకు ప్రజలు పులిస్టాప్ పెట్టారని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలపై ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి కొంతమేర ఏపీ నేతలలో కూడా గుబులు మొదలైందని తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుతో ఎంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అధికారక ప్రకటన లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపి ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి పడేలా వ్యూహం రచించారు.

ఇక రేవంత్ రెడ్డి గెలవగానే కాంగ్రెస్ జెండాలతో పాటు ఊరేగింపులో పసుపు జెండాలు కూడా కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రేవంత్ రెడ్డి ఎట్టకేలకు విజయం సాధించార. అయితే రేవంత్ రెడ్డికి ఎంతో సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా వచ్చే ఎన్నికలలో రేవంత్ సహాయ పడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపారో ఇక్కడ కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నారని తెలుస్తుంది.

అలర్ట్ అవుతున్న వైసీపీ నేతలు…

ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తుకుదురుచుకున్నారు. మరోవైపు బీజేపీ పార్టీని కూడా కలుపుకోవడానికి కేంద్రంతో పవన్ కళ్యాణ్ చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని పార్టీలు కలిసి ఈసారి వైసిపి పార్టీపై దండెత్తబోతున్నాయని తెలుస్తుంది . ఇలా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి బారాస పార్టీకే ప్రజలు మద్దతు తెలుపలేదు దీంతో వైసిపి నేతలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకపోతే తెలంగాణలో బారాసకి వచ్చిన పరిస్థితి ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రాబోతోంది అంటూ మరికొందరు నేతలు భావిస్తున్నారు అయితే రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదు కనుక ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.

Bullet Bhaskar: వైసిపి పై పంచ్ డైలాగ్స్ వేసిన బుల్లెట్ భాస్కర్…. కట్ చేస్తే అభిమానులకు క్షమాపణలు!

Bullet Bhaskar: బుల్లితెర కామెడీ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ వరప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ టీం లో నరేష్ తో పాటు బుల్లెట్ భాస్కర్ తల్లిదండ్రులు కూడా చేశారు. ఓ నటి ‘బావగారూ సినిమాకు తీసుకెళతారా’ అని భాస్కర్ తండ్రిని అడగ్గా.. సెకండ్ షోకు వెళ్లకమ్మా. ఆయనకు రే చీకటి అంటూ తల్లి కౌంటరిచ్చింది. ఆయనకు నెల ఇన్ కమ్ ఎంత వస్తుందమ్మా అని అడగ్గానే 2750 రూపాయలు వస్తుందని చెప్పారు.అదేంటి మరి పెరగదా అనడంతో పెరగదు వేరే గవర్నమెంట్ వస్తేనే పెరుగుతుంది అంటూ వైసీపీ పై పంచ్ డైలాగ్స్ వేశారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ 2750 రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డైలాగ్స్ రాసారని తెలిసి వైసీపీ అభిమానులు బుల్లెట్ భాస్కర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.గత ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు.

Bullet Bhaskar: క్షమాపణలు చెప్పిన భాస్కర్…


ఒకవేళ మీరు ఇలాంటి రాజకీయ విమర్శలు కనుక చేయాల్సి వస్తే రాజకీయ వేదికల పైకి వచ్చి విమర్శలు చేయాలి కానీ కళామతల్లి వేదికపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు అంటూ తీవ్ర స్థాయిలో బుల్లెట్ భాస్కర్ టార్గెట్ చేయడంతో దెబ్బకు ఈయన వైసిపి అభిమానులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా స్కిట్ లో డైలాగ్స్ అన్నింటిని కూడా తొలగించారు.

AP Politics: సొంత చెల్లి తల్లి జగన్ ను నమ్మడం లేదు రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి?

AP Politics: 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు పెద్ద ఎత్తున తమ పార్టీలను బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నటువంటి జగనన్న మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం జగనన్న అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నినాదాలు వినిపించాలి అంటూ వైఎస్ఆర్సిపి ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

జగన్ మోహన్ రెడ్డిని తన సొంత చెల్లి షర్మిల తల్లి తన బావ అనిల్ బాబాయ్ కూతురు సునీత నమ్మడం లేదు ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ ఈయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ నువ్వే మా దరిద్రం అంటూ చెబుతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగనన్నే మా నమ్మకం అంటూ నినాదాలు చేయమని చెబుతున్నారు. సజ్జల ఇలా మాట్లాడటం చాలా విడ్డూరంగా అనిపిస్తుందని వర్ల రామయ్య తెలిపారు. ఇక ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి అంటూ ఈయన ప్రశ్నించారు.

AP Politics:ఎందుకు నమ్మాలి జగన్…

జగన్ నాలుగు సంవత్సరాల పాలనలో ఏకంగా 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకు ఆయనని నమ్మాలా? రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకపోవడం వల్ల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి జగన్ మా నమ్మకం అని నమ్మాలా? అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను తప్పారు.మద్యపానం నిషేధం అన్నావు మద్యం తాగి ఎంతో మంది మహిళల పుస్తెలు తెగిపోయాయి.సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుడిని పట్టుకోలేనటువంటి చేతకాన్ని ముఖ్యమంత్రిని ఎందుకు నమ్మాలి అంటూ ఈయన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

Tarakaratna: వైసీపీ నుంచి తారకరత్నను పోటీ చేయమని అడిగా… తారకరత్న అలాంటి సమాధానం చెప్పారు: కొడాలి నాని

Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.తన కెరియర్లో ఒక్క శత్రువు కూడా లేకుండా అందరితోనూ ఎంతో సన్నిహితంగా మెలిగిన తారకరత్న గురించి ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి మాటలు కనుక వింటే ఆయన ఎంత గొప్పగా బతికాడో అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని తారకరత్న మరణం పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా తారకరత్న వ్యక్తిత్వం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు.తారకరత్న ఎప్పుడూ కూడా ఎవరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి కాదు అన్న తమ్ముడు బాబాయ్ అంకుల్ ఆంటీ అంటూ ఏదో ఒక సంబంధం కలుపుకొని మాట్లాడే వ్యక్తిత్వం తనదని తెలిపారు.

ఇక తారకరత్నకు అత్తగారి ఇంటి వైపు నుంచి చూస్తే వైసిపి పార్టీ పుట్టింటి వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఆయనకు ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.ఈ క్రమంలోని ఓ రోజు తారకరత్నతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయవచ్చు కదా అని అడిగాను అందుకు తారకరత్న సమాధానం చెబుతూ తెలుగుదేశం పార్టీ తాతగారు స్థాపించిన పార్టీ తాను ఈ పార్టీలోనే కొనసాగుతాను అంటూ సమాధానం చెప్పారు.

Tarakaratna:తాత స్థాపించిన పార్టీలోనే కొనసాగుతా….


తారకరత్న దేనికి ఆశపడకుండా తన కష్టాన్ని నమ్ముకుని తన తాతయ్య స్థాపించిన పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇలా మనకు అందనంత దూరానికి వెళ్లిపోయారని కొడాలి నాని తారకరత్న గొప్ప మనసు, ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలా తారకరత్న గురించి కొడాలి నాని చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nagababu: రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టె…. రోజాపై నాగబాబు కామెంట్స్ వైరల్!

Nagababu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారపక్షం ప్రతిపక్షాల మధ్య నిత్యం గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికారపక్షంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుల మీద చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా తరచూ జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ మీద మాటలతో విరుచుకుపడుతూ ఉంటుంది.

ఇక ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ కోసమే చంద్రబాబుతో కలిసి పొత్తు కుదుర్చుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేయటమే కాకుండా మెగా కుటుంబ సభ్యులైన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు పదిమందికి సాయం చేయాలని ఆలోచిస్తారు కానీ మెగా బ్రదర్స్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. అందుకే ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు.

ఇక తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ రోజా కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజగా నాగబాబు స్పందిస్తూ.. ఏపీ పర్యటక శాఖ మంత్రిగా రోజా తన బాధ్యతలు మరిచిపోయి నోటికొచ్చినట్లు పిచ్చపిచ్చగా మాట్లాడితే ..ఇప్పుడు 18 వ స్థానంలో ఉన్న ఆంధ్రపదేశ్ ఆమె పదవి దిగిపోయే లోగా రాష్ట్రాన్ని 20వ స్థానానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని నాగబాబు విమర్శించాడు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీరి జీవితాలు దయనీయంగా మారాయని నాగబాబు విమర్శించాడు.

Nagababu: పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు….

పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, పర్యాటక శాఖను ఎలా అభివవృద్ధి చేయాలో తెలుసుకోవాలని నాగబాబు హితవు పలికారు. ఇన్ని రోజులు చిరు, పవన్‌ కళ్యాణ్ గురించి రోజా నోటికి వచ్చినట్లు మాట్లాడినా తాను రియాక్ట్ అవ్వలేదంటే ఒకటే ఒక కారణమని నాగబాబు వెల్లడించాడు . ఎందుకంటే రోజా నోటికి మున్సిపాల్టీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదని… చూస్తూ చూస్తూ ఎవరూ మున్సిపాల్టీ కుప్పతొట్టిని గెలకరని నాగబాబు ఫైర్ అయ్యాడు . రోజా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇతరులపై నోరు పారేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలంటూ నాగబాబు హితవు పలికాడు.

Balakrishna: వైసీపీని టార్గెట్ చేస్తూ బాలయ్య సినిమాలో డైలాగ్స్…

Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర టిడిపి కార్యకర్తలు కూడా అధికారపక్షం మీద మాటలతో విరుచుకుపడుతూ ఉంటారు. అలాగే వైసిపి కార్యకర్తలు కూడా టిడిపి పార్టీ నేతలపై మాటల దాడికి దిగుతూ ఉంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎల్లప్పుడూ అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా అధికారపక్షం అధినేత అయిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఇప్పటికీ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు.హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను మరింతగా పెంచేసింది.

ఈ సినిమాలో బాలకృష్ణ నుంచి ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో బాలకృష్ణ చెప్పిన ఒక డైలాగ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్‌ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna: చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు….

ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ పేరు మీదుగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలకు వైయస్సార్ పేరు మార్చాడు. అంతేకాకుండా ఇటీవల ఎన్టీఆర్ పేరు మీదుగా ఉన్న హెల్త్ యూనివర్సిటీ ని కూడా వైఎస్ఆర్ పేరు మీద మార్చడంతో టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇలా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వారి చేతిలో ఉందని ఎన్టీఆర్ పేరు మీద ఉన్న ప్రతిదాన్ని వైయస్సార్ పేరుగా మార్చారు. ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చెప్పినట్లు నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

YS Sharmila: కొడుకు ఫోటోలను షేర్ చేసిన వైఎస్ షర్మిల… కటౌట్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్న నేటిజన్స్!

YS Sharmila: వైయస్ షర్మిల పరిచయం అవసరం లేని పేరు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితమైనటువంటి ఈమె ప్రస్తుతం తెలంగాణలో పార్టీ స్థాపించి తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఇక షర్మిల భర్త అనిల్ పాస్టర్ గా ప్రవచనాలు చెబుతూ నిత్యం టీవీలలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా షర్మిల అనిల్ ఇద్దరిని మనం తరచూ చూస్తూ ఉన్నప్పటికీ వీరి పిల్లలు ఎలా ఉన్నారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే సెలబ్రిటీల పిల్లలను చూడాలని అభిమానులు ఎలా అయితే ఆశపడతారో రాజకీయ నాయకుల పిల్లలను చూడాలని కూడా అంతే ఆత్రుత పడుతుంటారు.

ఇక వైయస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ప్రస్తుతం విదేశాలలో చదువుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలలో స్థిరపడినటువంటి రాజారెడ్డి తాజాగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే వైయస్ షర్మిల తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

YS Sharmila: హీరోకి ఏమాత్రం తీసిపోని రాజారెడ్డి….

ఈ క్రమంలోనే వైయస్ రాజారెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేంటి షర్మిల కొడుకు ఇలా ఉన్నాడు. హీరో కటౌట్ కి ఏమాత్రం తీసిపోడు… రాజారెడ్డి కటౌట్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజారెడ్డి ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు రాజారెడ్డి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత తన తాతయ్య మామయ్యలా రాజకీయాలలోకి వెళ్తారా లేక సినిమాలలోకి వస్తారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Puri Jagannadh Brother: సాయిరామ్ శంకర్ కాకుండా పూరి జగన్నాథ్ కు మరో తమ్ముడు ఉన్నాడని తెలుసా? అతను ఎమ్మెల్యే అని తెలుసా?

Puri Jagannadh Brother: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసి ఇండస్ట్రీకి ఎంతోమంది స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత పూరి జగన్నాథ్ కు చెల్లుతుందని చెప్పాలి. పూరి జగన్నాథ్ ఇప్పటికే ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు.

ఇక ఈయన ఖాతాలో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయో అలాగే ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.పూరి తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను మాత్రం ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ కాలేకపోయారనీ చెప్పాలి. అయితే పూరీకి రామ్ శంకర్ మాత్రమే కాకుండా ఇంకో తమ్ముడు కూడా ఉన్నారు.

Puri Jagannadh Brother:ఎమ్మెల్యేగా పూరి తమ్ముడు…

ఈ విషయం చాలా మందికి తెలియదు. పూరి మరో తమ్ముడి పేరు ఉమాశంకర్. ఈయన వైసిపి తరపున నర్సీపట్నం నుండీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన మొదట్లో తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసినప్పటికీ అనంతరం వైసిపి పార్టీలోకి వచ్చారు.2014లో వైసిపి పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2019లో బంపర్ మెజారిటీతో గెలుపొందారు.తన తమ్ముడు ఎమ్మెల్యే అయినప్పటికీ ఈయన మాత్రం ఎప్పుడు తన తమ్ముడి పేరు ఉపయోగించుకోలేదు.

Pawan Kalyan -Ali: పవన్ వ్యాఖ్యలు సరైనవి కాదు.. అలీ కామెంట్స్ వైరల్?

Pawan Kalyan -Ali: ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే తప్పనిసరిగా ఆ సినిమాలో ఆలీ ఉండాల్సిందే. అలా వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అయితే వీరిద్దరూ రాజకీయాలలోకి రావడం వల్ల రాజకీయాలు వీరిద్దరిని బద్ధ శత్రువులుగా మార్చాయి.

అలీ వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయక పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి వైసిపి పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వం పై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అలీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వం ప్రజల కోసమే ఎంతో కృషి చేస్తుందని ఈయన వెల్లడించారు.

2019 ఎన్నికలలో ప్రజలు అప్పనంగా 151 సీట్లు జగన్ కి అందించలేదని, ప్రజలకు జగన్ పై నమ్మకంతోనే ఆయనకు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. ఇకపోతే ఏపీ రాజధాని ఎక్కడ పెట్టిన అభివృద్ధి మాత్రం రాష్ట్రమంతా జరుగుతుందని అలీ పేర్కొన్నారు. విశాఖషూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు బీచ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని విశాఖ ఎంతో అభివృద్ధి చెందినదని ఈయన తెలిపారు.

Pawan Kalyan -Ali: అలీ పవన్ మధ్య దూరం పెరగనుందా…

విశాఖలో ఎలాంటి అభివృద్ధి చెందని సమయంలో కూడా సినిమా షూటింగ్లో జరుపుకున్నాయని అయితే ప్రస్తుతం మరింత అభివృద్ధి చేయడంతో ఇతర భాష సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశాలు ఉన్నాయని ఆలీ పేర్కొన్నారు.ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ ను తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం అర్థం లేదని అలీ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే కొందరు అలీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీ ఎలక్ట్రానిక్ సలహాదారుడుగా ఈయనకు పదవి రావడంతో జగన్ ప్రభుత్వం పై ప్రశంసల కురిపిస్తున్నారని ఈ ప్రశంసల కారణంగా అలీ పవన్ మధ్య మరింత దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

Mokshagna: కుక్కలు అరుస్తుంటాయ్… కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!

Mokshagna: విజయవాడలోనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతోమంది ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా బాలకృష్ణ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైసిపి నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా తన తండ్రి గురించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రంగంలోకి నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి పై విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బాలయ్య గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కుక్కలు మొరుగుతున్నాయి మీరు ఎంత అరిచిన కనీసం బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు. ఒకప్పుడు అవసరముండి ఆయన కాళ్ల వద్దకు వచ్చిన వారందరూ అవసరం తీరిపోయాక ఆయనపై కారు కూతలు కూస్తున్నారు. ఇలాంటి కారు కూతలు కూసే వారికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mokshagna: భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు..

ఇలా ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఒకవైపు వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలకు కౌంటర్ ఇవ్వగా తెలుగుదేశం నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున వైసిపి నేతలపై మండిపడుతున్నారు.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అనేది తెలియాల్సి ఉంది.