Pakisthan: భారత్ కు పొరుగు దేశం అయిన పాకిస్తాన్ కు భారత్ కు మధ్య సరిహద్దు వివాదాలతో పాటు.. ఇతర రకాల వాగ్వాదాలు ఎప్పుడూ చోటు చేసుకుంటూ ఉంటాయి. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి.. పాకిస్థాన్ ఇటువంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. పొరుగు దేశాలపై కాలుదువ్వుతూ కనిపిస్తోంది. ఇలా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ దేశ అభివృద్ధిని మరిచిపోయింది పాకిస్థాన్.

ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం మన పొరుగు దేశం అయిన అప్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం నడుస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రభుత్వాన్ని నిర్ధాక్షిణ్యంగా దింపేసి.. తాలిబన్లు తమ స్వరూపాన్ని చూపించారు. దీంతో ఆ రోజు నుంచి ఆ దేశ ప్రజలకు తిండిలేక అలమటిస్తున్నారు.

తమ ఆహారం కోసం తమ కిడ్నీలకు అమ్ముకుంటున్నారంటేనే అర్థం చేసుకోవాలి.. అక్కడి పాలను ఎంత దుర్భరంగా ఉందో. ఇలాంటి పాలనే పాకిస్థాన్ లో చోటు చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ప్రమాదకరంగా మారబోతోంది.
సైనికులను పిట్టల్లా కాల్చి చంపేసినా..
తెహరి తాలిబన్లు ఇటీవల పాకిస్థాన్ సైనికులను పిట్టల్లా కాల్చి చంపేశారు. ఇటువంటి చర్యలు జరుగుతున్నా అడిగే వాడే కరువయ్యాడు. ఇదే అదునుగా భావించిన తెహరి తాలిబన్లు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసిన జనరల్ హరి సింగ్ నల్వా కు గుర్తుగా హరి పూర్ లో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు. దానిని పాకిస్థాన్ లోని మతోన్మాద శక్తులు ఆ విగ్రహాన్ని కూల్చివేసి..ఆ ప్రాంతం పేరును సాదిక్ అక్బర్ చౌక్ గా పెట్టారు. ఇదంతా జరుగుతున్నా.. పాకిస్థాన్ పీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో తాలిబన్ల పాలను ఇమ్రాన్ ఖాన్ కూడా స్వాగతం పలుకుతున్నారా.. అనే అనుమానాలకు తావిస్తోంది. ఇక ఏ క్షణమైనా పూర్తిగా పాకిస్థాన్ పై అమ ఆధిపత్యం చెలాయించేందుకు తెహరి తాలిబన్లు రెడీ గా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



























