Tamannaah: హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా గుర్తింపు పొందిన తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి సినిమాతోనే తన అందం అభిప్రాయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్న ఆ తర్వాత తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
17 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమన్నా ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నార్త్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఇదిలా ఉండగా కొంతకాలంగా తమన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ఎక్కడికి వెళ్లిన జంటగా కనిపించడంతో తొందర్లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల నుండి సమాచారం.
న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ గోవాలో ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో తమన్నా తన ప్రియుడు విజయ వర్మ మీద ముద్దుల వర్షం కురిపించింది. దీంతో వీరి ప్రేమ వార్తలు అప్పటినుండి వైరల్ గా మారాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన వీరిద్దరూ తమ మధ్య అటువంటి అనుబంధం లేదని కొట్టిపారేసినప్పటికీ.. ముంబై వీధుల్లో ఇద్దరు కలిసి చట్టా పట్టాలేసుకొని చెక్కర్లు కొడుతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లి మీడియా కంటికి చిక్కారు.
ఇంతకాలం మీడియాకి మొఖం చాటేసిన వీరు ఇప్పుడు ధైర్యంగా మీడియా ముందు జంటగా సందడి చేస్తున్నారు. దీంతో వీరి ప్రేమ, పెళ్ళి కి సంబందించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా వీరి రిలేషన్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ వర్మ తన ప్రియురాలు తమన్న కి ముద్దు పేరు పెట్టినట్టు తెలుస్తోంది. తమన్నాని విజయ్ ముద్దుగా తమటార్ అని పిలుస్తాడని సమాచారం. ఇక సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ జంటగా ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…