Tamil Hero Vijaykanth : తమిళ హీరో విజయ్ కాంత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తన తమిళ సినిమాలు తెలుగు డబ్ అయి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు కూడా అభిమాన హీరోగా ఉన్నాడు. ఎక్కువ భాగం పోలీస్ అధికారి పాత్రలో నటించిన విజయ్ కాంత్ కెప్టెన్ విజయ్ కాంత్ గా బాగా ఫేమస్. తను నటించిన సినిమాల్లో 20 కి పైగా పోలీస్ ఆఫీసర్ పాత్రలలో నటించారు. ఇక సినిమా రంగం నుండి రాజకీయాల వైపు వెళ్లిన విజయ్ కాంత్ 2005 సెప్టెంబరు 14న విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) పార్టీని స్థాపించాడు. 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు.

నడవలేని స్థితిలో విజయ్ కాంత్…
విజయ్ కాంత్ ప్రస్తుతం రాజకీయాలకు, సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ గారు హీరో విజయ్ కాంత్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసారు. ఆ ఫోటోల్లో విజయ్ కాంత్ నడవలేని స్థితిలో వీల్ చైర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు విజయ్ కాంత్ కి ఏమైంది అని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్ కాంత్ చాలా రోజుల నుండి డయాబేటీస్ తో బాధపడుతున్నారు. అలా ఆయన కాలి మూడు వేళ్ళను కూడా వైద్యులు ఇటీవలే తొలగించడం జరిగింది.

దీంతో ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి మొదటి అవకాశం ఇచ్చి కెరీర్ లో మంచి హిట్ ఇచ్చిన విజయ్ కాంత్ గారితో మంచి అనుబంధం ఉంది. అందుకే విజయ్ కాంత్ గారికి అలానే ఆయన భార్య ప్రేమలత కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపడానికి వారి ఇంటికి వెళ్లి కాసేపు విజయ్ కాంత్ తో గడిపి వచ్చారు. అయితే ప్రస్తుతం విజయ్ కాంత్ గారు ఉన్న పరిస్థితి చూసి ఆయన అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు, త్వరగా కోలుకుని మళ్ళీ ఆరోగ్యంగా బయట కనిపించాలని ఆశిస్తున్నారు.