Taraka Ratna : ఆధ్యాత్మికం వైపు అడుగులేసిన తారకరత్న… గడ్డం పెంచాడు… బొట్ట పెట్టి, రుద్రాక్ష వేసాడు… మూడేళ్లుగా అన్నీ మానేసాడు… మాట తూలింది లేదు… పట్టించుకున్నది లేదు…!

0
322

Taraka Ratna : నందమూరి బిడ్డగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తారక రత్న మొదటి సారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినపుడే ఒకేసారి తొమ్మిది సినిమాలను సైన్ చేసి రికార్డు క్రియేట్ చేయాడు. ఇక మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకున్నా ఆ తరువాత కెరీర్ లో తడబడ్డాడు. ఇక విలన్ గాను రవిబాబు సినిమాలో నటించిన తారక రత్న మంచి మార్కులే తెచ్చుకున్న అది కొనసాగించలేదు. ప్రస్తుతం రాజకీయాల వైపు అడుగుపెట్టి టీడీపీ తరుపున స్పీచ్ లతో ఆధరగొడుతున్న ఆయన లోకేష్ పాదయాత్రలో గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్నారు. అయితే తారకరత్న చాలా మారిపోయాడు, గత మూడేళ్లుగా ఆయనలో ఎంతో మార్పు వచ్చిందని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

ఆధ్యాత్మికం వైపు తారకరత్న… పార్టీలు బంద్…

తారక రత్న జీవితం పాప పుట్టాక చాలా మారిపోయింది అంటూ ఆయన స్నేహితులు చెబుతారు. ఒకప్పుడు పార్టీలు ఫ్రెండ్స్ అంటూ ఉండే తారక రత్న లైఫ్ స్టైల్ మారిపోయిందని, ఆధ్యాత్మికం వైపు అడుగులేసాడని చెబుతారు. ఉదయం 5 గంటలకు లేవడం ఏవో ఒక ఎక్సర్సైజులు చేయడం ఆ తరువాత ఫ్రెష్ అయి దాదాపు రెండు గంటలు పూజలు చేసి ఆపై ఫ్యామిలీతో కాసేపు గడిపి బయటికి వెళ్తారట. సిగరెట్ పూర్తిగా మానేసిన తారక రత్న మద్యం ఎపుడో కానీ తాగరట. ఇక వైట్ దుస్తులు, నుదుటన బొట్టు, తెల్ల గడ్డం ఇలా అన్నింటా మారిన తారక రత్న పాలిటిక్స్ లోకి రావాలని భావించి టీడీపీ లో క్రియాశీలకంగా ఉంటూ ఫ్రెండ్స్ తో పార్టీలు అందునా మద్యం పార్టీలు అంటే పూర్తిగా మానేశారట.

ఏనాడూ ఎవరినీ ఒక మాట కూడా నోరుజారి అనడం కానీ ఎవరైనా ఏదైనా అంటే కోపం తెచ్చుకోవడం కానీ చూడలేదంటూ తారక రత్న ఫ్రెండ్స్ చెబితారు. అందరితోనూ కలిసిపోయి కులం మతం కాదు మనిషిలో మంచి చూడాలి అని ఎప్పుడూ చెబుతుంటాడట తారకరత్న. కేవలం బయటికి వెళ్లి పని చూసుకోవడం ఇంట్లో పాపతో గడపడం ఇలానే జీవితం సాగిస్తున్నారంటూ ఆయన గురించి ఆయన స్నేహితులు తెలిపారు.