Featured

Taraka Ratna : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే… వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, తారక రత్నకు ఏమవుతాడంటే…!

Published

on

Taraka Ratna : నందమూరి బిడ్డగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తారక రత్న మొదటి సారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినపుడే ఒకేసారి తొమ్మిది సినిమాలను సైన్ చేసి రికార్డు క్రియేట్ చేయాడు. ఇక మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ తో మంచి గుర్తింపే తెచ్చుకున్నా ఆ తరువాత కెరీర్ లో తడబడ్డాడు. ఇక విలన్ గాను రవిబాబు సినిమాలో నటించిన తారక రత్న మంచి మార్కులే కాకుండా నంది అవార్డు తెచ్చుకున్నా అది కొనసాగించలేదు. ఇక రాజకీయాల వైపు ప్రస్తుతం అడుగుపెట్టి టీడీపీ తరుపున స్పీచ్ లతో అదరగొడుతున్న ఆయన లోకేష్ పాదయాత్రలో గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న తారకరత్నను బాబాయ్ బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నారు.

భార్య అలేఖ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్…

తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చని ఆయన కుటుంబం తారక రత్నను దూరం పెట్టిందనే వాదన వుంది. విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని తారక రత్న 2012 లో ప్రేమ వివాహం చేసుకోవడం ఇరు వైపులా ఇష్టం లేకపోయినా పెళ్ళైన తరువాత అలేఖ్య కుటుంబం అంగీకరించారు. కూతురు పుట్టాక తారకరత్న కుటుంబం ఆయనను దగ్గరకు తీసుకుంది. అసలు అలేఖ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అన్నది ఇపుడు ఎక్కువగా సోషల్ మీడియాలో నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. అలేఖ్య రెడ్డి స్వస్థలం అనంతపురం కాగా ఆమె తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మధుసూదనరెడ్డి. అలేఖ్య విద్యాభ్యాసం అంతా నల్గొండ, హైదరాబాద్ లో జరిగింది. ఇక ఆమె వివాహం టీడీపీ సీనియర్ నాయకుడు మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి తో జరుగగా పెళ్ళైన కొంతకాలనికే వారు మస్పర్తలతో విడిపోయారు. తారక రత్న చెన్నై లో చదువుతున్న సమయంలో అలేఖ్య రెడ్డి అక్క అతనికి సీనియర్ అలానే స్నేహాతురాలు అలా అలేఖ్య రెడ్డితో పరిచయం ఏర్పడింది.

Advertisement

విడాకుల తరువాత అలేఖ్య ఇంటికే పరిమితమైన కాస్టుమ్ డిజైనర్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. అలా తారక రత్న ‘నందీశ్వరుడు’ సినిమాకు పనిచేసిన అలేఖ్య కు తారక రత్న కు మధ్య పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ కొంతకాలం డేట్ చేసారు. కోతకాలం సహజీవనం కూడా చేసారనే టాక్ కూడా ఉంది. ఇక ఇరు వైపులా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి అంగీకరించకపోవడంతో సంఘీ టెంపుల్ లో కొంతమంది సన్నిహితుల మధ్య 2012 లో వివాహం చేసుకున్నారు. పాప పుట్టాక ఇరు కుటుంబాలు మళ్ళీ మాట్లాడాయి. ఇక వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి భార్య అలేఖ్య రెడ్డి కి అక్క అవడంతో విజయ సాయి రెడ్డి తారక రత్న ను బ్రదర్ అంటూ పిలుస్తారట.

Trending

Exit mobile version