Taraka Ratna : నందమూరి బిడ్డగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తారక రత్న మొదటి సారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినపుడే ఒకేసారి తొమ్మిది సినిమాలను సైన్ చేసి రికార్డు క్రియేట్ చేయాడు. ఇక మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకున్నా ఆ తరువాత కెరీర్ లో తడబడ్డాడు. ఇక విలన్ గాను రవిబాబు సినిమాలో నటించిన తారక రత్న మంచి మార్కులే తెచ్చుకున్నా అది కొనసాగించలేదు. ఇక రాజకీయాల వైపు ప్రస్తుతం అడుగుపెట్టి టీడీపీ తరుపున స్పీచ్ లతో ఆధరగొడుతున్న ఆయన లోకేష్ పాదయాత్రలో గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న తారకరత్నను బాబాయ్ బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటుండగా ఆయన తండ్రి మోహన్ కృష్ణ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

తండ్రి మోహన్ కృష్ణ కు దూరంగా తారకరత్న…
తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చని ఆయన కుటుంబం తారక రత్నను దూరం పెట్టిందనే వాదన ఉంది. విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని తారక రత్న 2012 లో వివాహం చేసుకోవడం, ఇరు వైపులా ఇష్టం లేకపోయినా పెళ్ళైన తరువాత అలేఖ్య కుటుంబం అంగీకరించారు. కూతురు పుట్టాక కూడా తారకరత్న కుటుంబం ఆయనను దగ్గరకు తీసుకోలేదు. చెల్లి పెళ్ళికి కూడా తారకరత్న దూరంగా ఉంచారు.

అయితే బాబాయ్ బాలకృష్ణ, హరికృష్ణ తనయలు ఇలా మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులతో మంచి బంధం కలిగి ఉన్న తారక రత్న స్వతహాగా ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసి ఉండే వ్యక్తి. అలా నందమూరి కుటుంబ సభ్యులందరికీ దగ్గరయ్యాడు కానీ తండ్రి మోహన్ కృష్ణ మాత్రం ఆయన్ను దూరం పెట్టాడు. అయితే ఇపుడు తారక రత్న చావు బతుకుల మధ్య పోరాడుతున్నా అన్నీ భార్య అలేఖ్య రెడ్డి ఆమె కుటుంబం అలాగే బాలకృష్ణ ఆయన ఇద్దరు అల్లుళ్ళు చూసుకుంటున్నారు కానీ మోహన్ కృష్ణ కానీ ఆయన కుటుంబంలో ఎవరూ కానీ రాలేదు. అయితే బాబాయ్ బాలకృష్ణ ఎప్పటికప్పుడు తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వివరిస్తునట్లు తెలుపుతున్నారు.