Tarakaratna: నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా ఈయన మరణించడంతో తన భార్య అలేఖ్యరెడ్డి ఎంతో కృంగిపోయారు. ఇక ఈయన మరణించి దాదాపు నెలరోజులు కావస్తున్న ఇంకా తన భర్త మరణం నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేదని తెలుస్తుంది.
ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి తన పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా మిగిలిపోయారు. అయితే తనకు ఎలాంటి కష్టం రాకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె బాలయ్య తన కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
బాలకృష్ణ తన ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలుతోపాటు తారకరత్న ఫోటోని కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోని అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మా కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే…మేం కష్టంలో ఉన్నప్పుడు కొండల మాకు అండగా నిలిచారు. నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు ఒక తండ్రిగా నీ వెంటే ఉన్నారు. ఇక నువ్వు ఆస్పత్రి బెడ్ పై ఉన్నప్పుడు పక్కనే కూర్చుని ఒక తల్లిలా లాలి పాడారు.
ఎవరు లేని సమయంలో నీకోసం ఏడ్చారు. తన సిల్లీ జోక్స్ తో నిన్ను నవ్వించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ చివరి క్షణం వరకు ఆయన నీ వెంటే ఉన్నారు. ఓబు నువ్వు మరికొన్ని రోజులు బ్రతికి ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఈ సందర్భంగా అలేఖ్య తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…