Tarakaratna : నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో మళ్ళీ గుండె కొట్టుకునేలా 45 నిమిషాల పాటు కుప్పం వైధ్యులు శ్రమించారు. ఇక అక్కడినుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్న ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ వార్తలు వచ్చినా ఎవరూ ఈ విషయంలో క్లారిటీగా చెప్పలేదు. ఇక నేడు ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించారు. ఇక ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.

ఆయన చివరి కోరిక తీర్చేదేవరు…
భరద్వాజ గారు మాట్లాడుతూ తారకరత్న వారసత్వంగా సినిమాల్లోకి హీరోగా వచ్చినా తానేంటో తన నటన ఏంటో అమరావతి సినిమాలో విలన్ గా చేసి ప్రూవ్ చేసుకున్నాడు ఆ నటనకు గాను నంది అవార్డు అందుకున్నాడు అంటూ చెప్పారు. సినిమా కెరీర్ పక్కన పెడితే రాజకీయాల్లోకి రావాలని తారకరత్న అనుకున్న సమయం నుండి పార్టీ కోసం కష్టపడ్డాడు అంటూ చెప్పారు. టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటం నష్టాన్ని కలిగిస్తుందని తెలిసి నందమూరి ఫ్యామిలీని కలిపే దిశగా ప్రయత్నాలను చేసాడు తారకరత్న. ఇక వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి అందుకోసం కార్యకర్తలను, పార్టీ నాయకులను కలుపుకుని పనిచేసిన తారకరత్న ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం నందమూరి కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అంటూ చెప్పారు భరద్వాజ. ఇక తారకరత్న ఆరోగ్యం విషయంలో మొదటి నుండి క్లారిటీ లేదని, ఆయనకు గుండె పోటు వచ్చిన సమయంలోనే శరీరం నీలి రంగుకు మారిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే తారకరత్న కోలుకుంటాడు అంటూ బాలకృష్ణ అక్కడే ఉండి అన్నీ తానై చూసుకున్నారు.

ఇక అప్పటికే తారకరత్న పరిస్థితి విషమించినా బయటికి చెబితే లోకేష్ పాదయాత్ర మీద ఆ ఎఫెక్ట్ పడుతుందని చెప్పడం లేదు అంటూ వార్తలు వచ్చాయి. అయితే నందమూరి కుటుంబం నుండి అందరూ వెళ్లి తారకరత్న ను పరామర్శించడం ఇవన్నీ ఆ వార్తలకు ఊతం ఇచ్చాయి. ఇక కొద్దిరోజులు తారకరత్న గురించి హెల్త్ బుల్లిటెన్స్ వచ్చినా చివరికి అవి కూడా ఆపేసారు. అసలు ఏం జరుగుతోంది అనేది బయటి వారికి తెలియకపోవడం అనుమానాలకు బలం చేకూర్చింది. చివరికి నిన్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి హైదరాబాద్ తరలించడంతో అందరికీ ఏదో చెడు వార్త వినబోతున్నాం అనేది అర్థమైంది. అయితే తారకరత్న విషయంలో అసలేం జరిగిందనేది బయటవారికీ మాత్రం గందరగోళంలాగే ఉంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
































