టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ పెద్ద వివాదానికి కారణమైంది. వార్-2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్, తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య సంభాషణ జరిగిందని చెబుతున్న ఒక ఆడియోలో, “నేను అనంతపురం ఎమ్మెల్యే.. సినిమా ఆడదు” అని ప్రసాద్ వ్యాఖ్యానించినట్లుగా ఉంది. ఈ ఆడియో నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది.

ఆడియో నాది కాదు: దగ్గుబాటి ప్రసాద్
ఈ ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అది తనది కాదని గట్టిగా ఖండించారు. ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమని, గత 16 నెలలుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “నేను ఎప్పటినుంచో నందమూరి కుటుంబ అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు తప్పుడు ఆడియో సృష్టించి నేను జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందులో అసలే నిజం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
అభిమానులకు క్షమాపణ, పోలీసులకు ఫిర్యాదు
ఆడియో కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే, తన ప్రమేయం లేకపోయినప్పటికీ క్షమాపణ చెబుతున్నానని ప్రసాద్ తెలిపారు. తాను నారా, నందమూరి కుటుంబాలకు ఎప్పటికీ విధేయుడినేనని వెల్లడించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయటపెడతారని ఆయన చెప్పారు. ఈ ఆడియో నిజమా లేదా నకిలీదా అనేది పోలీసుల దర్యాప్తుతోనే తేలాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ pic.twitter.com/D5Y6xstJ7j

































