Teena sadhu: తెలుగు బుల్లితెర పై డాన్స్ షోలలో బాగా పేరున్నవి కొన్ని మాత్రమే. డాన్స్ బేబీ డాన్స్ అంటూ జెమినీ టీవీ లో వచ్చిన డాన్స్ షో ఆ తరువాత ఢీ ఈటీవీ డాన్స్ షో ఇప్పటికి మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఇక ఓంకార్ యాంకర్ గా వచ్చిన ఆట డాన్స్ షో కూడా బాగా పాపులర్. ఆ షో నుండి ఎంతో మంది డాన్సర్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక ఆట డాన్స్ షో 1 స్ట్ సీజన్ విన్నర్ టీనా సాదు మరణించింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో విషాదం అలముకుంది.

టీనా సాదు మరణ వార్తను ఆట సందీప్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసాడు. ఈ విషయాన్ని ఇంకా నమ్మలేక పోతున్న అంటూ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఇక టీనా సాదు ఎలా మృతి చెందిందనే విషయం స్పష్టంగా తెలియదు. చిన్నవయసులోనే టీనా ఆకస్మిక మృతి అందరిని షాక్ గురిచేసింది. గుండె పోటు తో మరణించిందనే వార్తలు వినిపించాయి. అనుమానస్పదంగా ఉండటంతో ఆమె మృతి పై అందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మధ్యపానమే కారణం…..
ఇక టీనా మృతి పై కుటుంబ సభ్యుల మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆట సీజన్ 4 కి జడ్జి గా కూడా వ్యవహరించిన టీనా రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని ఆ తరువాత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన టీనా యాంకర్ శిల్ప చక్రవర్తిని కలిసి మళ్ళీ రియల్టీ డాన్స్ షోలలో పాల్గొనాలని అనుకుంటున్నట్లు చెప్పిందట. ఇక తిరిగి గోవా వెళ్లిపోయిన టీనా అతిగా మద్యం సేవించడం వల్ల గుండె పోటుతో మరణించిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. కానీ అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది. ఇక ఇపుడు ఈ వార్త, అలాగే టీనా చివరిగా తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.




























