కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020 వచ్చి అందరికీ వనుకుపుట్టేలా చేసింది. ఒక పక్క కరోనా విలయ తాండవం.. మరో పక్క సినీ మరియు క్రీడా దిగ్గజాలు మరణించడం వంటి అనేక బాధాకర విషయాలు 2020లో చూసాం. ఈ నేపధ్యంలో తదుపరి వచ్చే ఏడాదైనా అంతా బాగుండాలని కోరుకుందాం. అయితే కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రధాననగరాలన్నీ న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతాయి. హోటల్స్, రెస్టారెంట్స్ , పబ్బులు ఇలా అన్ని సిద్దమవుతాయి. ప్రజలు ఆనందంలో మునిగి తేలుతూ కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
అయితే ఈసారి నూతన సంవత్సరం వేడుకల పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పబ్బులు, కబ్బులు, డ్యాన్స్ బార్లు కు ఎటువంటి పర్మిషన్ లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేసారు. అయితే స్టార్ హోటళ్లకు రోజువారీ కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ఈ నేపధ్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు సీపీ సజ్జనార్. నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బెంగళూరులో ఓ కుటుంబం గడచిన రోజుల్లో అనుభవించిన సంఘటన వాస్తవానికి ప్రతి తల్లిదండ్రి గుండెను గుద్దేసేలా ఉంది. రాత్రి ఇంటికి…
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్‌ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్‌డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…