కరోనా ప్రభావంతో ఇనాళ్ళు మూతపడిన విద్యా సంస్థలను తెరుచుకొవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించుకొవచ్చని సూచిచింది. థర్డ్ వేవ్ భయదోంళనలు వద్దని ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు నిర్వహించాలని సూచించింది.

వర్చువల్ పద్ధతుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. డిజిటల్ క్లాసులతో విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం చేకురేది ఏమిలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠాల పేరుతో ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లలు వాటిని అనుక్షణం అంటూపెట్టుకుని ఉంటున్నారు. ఇది వారి మానసిక పరిస్థితిపై ప్రభావం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక విద్యా సంస్థల తెరవడంపై విద్యాశాఖ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.






























