Political News

తెలుగు సీఎంల భేటీ.. కృష్ణా – గోదావరి బోర్డులపై సంచలన నిర్ణయాలు!

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి పంపకాలు, ప్రాజెక్టుల వివాదాలపై ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), నిమ్మల రామానాయుడు (ఆంధ్రప్రదేశ్), ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్), నీటిపారుదల శాఖ కార్యదర్శులు కూడా హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలు ఉత్కంఠ రేపాయి.

Telugu CMs meet.. Sensational decisions on Krishna – Godavari boards!

సమావేశ ఎజెండాలో కీలక అంశాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ప్రతిపాదించింది. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో చేర్చింది. వీటిలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, సమ్మక్క సాగర్, ప్రాణహిత-చేవెళ్ల సహా పలు కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొంది.

నిమ్మల రామానాయుడు ఏమన్నారంటే..

సమావేశం అనంతరం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చలు చాలా మంచి వాతావరణంలో జరిగాయని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఆహ్లాదకరంగా చర్చలు సాగాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్రం తెలిపిందన్నారు.

ముఖ్యంగా, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని రామానాయుడు వెల్లడించారు.

జులై 21 (సోమవారం) లోగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తారని, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టులపై టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. “రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. రెండు రాష్ట్రాలు అయినా ప్రజలు ఒక్కటే, అందరికీ న్యాయం జరగాలి” అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

నీటి వివాదాల నేపథ్యం

గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య “వాటర్ వార్” కొనసాగుతోంది. ముఖ్యంగా, గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రాజెక్టే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా మారింది. ఇలాంటి సమయంలోనే బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదాల నేపథ్యంలోనే కేంద్రం జోక్యం చేసుకుని ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులతో ఈ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీతో నీటి వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago