సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది అడుగుపెట్టి వారి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు హీరో కొడుకులు అయితే ఎంట్రీ సులభంగానే దొరుకుతుంది కానీ సామాన్య జనానికి సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ దొరకడం చాలా కష్టం. ఇలాంటి సందర్భంలో కూడా కొంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి గుర్తింపు సాధించి కొన్ని దశాబ్దాలపాటు ఇక్కడ హీరోలుగా స్థిరపడిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు అయితే చేసింది కొన్ని సినిమాలే అయిన చాలా రోజులు గుర్తు ఉంటారు అలాంటి వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అర్జున్ సింగ్ బజ్వా అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ ఆయన్ని చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తు పడతారు. అతను ఎవరు అంటే తెలుగులో సంపంగి సినిమాతో హీరోగా పరిచయమైన దీపక్.

ఆయన అసలు పేరు అర్జున్ సింగ్ బజ్వా ఆయనది ఢిల్లీ. నాన్న పేరు సుందర్ సింగ్ బజ్వా ఆయన కొన్ని రోజుల పాటు ఢిల్లీలో బిజెపి ఉపమేయర్ గా పని చేశాడు. అయితే దీపక్ చదువు ముగించుకుని తర్వాత మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లు ఏర్పాటు చేసిన అరేక ఫ్యాషన్ షో లో పాల్గొని మంచి గుర్తింపు సాధించాడు. ఆ తర్వాత లక్స్, గోద్రెజ్ లాంటి ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ కూడా చేశాడు ఆయన ఐశ్వర్యరాయ్,కత్రినా కైఫ్, ప్రీతి జింటా లాంటి హీరోయిన్ల పక్కన మోడలింగ్ చేశాడు. అయితే తెలుగులో లో సన యాదిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన సంపంగి సినిమాలో హీరోగా నటించి తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు ఆ తర్వాత నీ తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్ లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్లో బోయపాటి శీను మొదటి సినిమాగా తెరకెక్కించిన భద్ర సినిమా లో రవితేజ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపును సాధించాడు. ఆ సినిమాలో కొన్ని సీన్లలో రవితేజతో కలిసి కామెడీ కూడా బాగా చేశాడు తర్వాత తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన మిత్రుడు సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున తమ్ముడు గా నటించి మంచి గుర్తింపును పొందారు ఆ సినిమాలో అన్నయ్య అయిన కింగ్ ని చంపాలి అని చూసే క్యారెక్టర్ లో నటించి అందరి మన్ననలు పొందాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాలో అనుష్క కి జోడి గా నటించి మెప్పించాడు. అలాగే ఇండియాలో నెంబర్1 డైరెక్టర్ అయిన మణిరత్నం దర్శకత్వంలో ధీరుబాయ్ అంబానీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన గురు సినిమాలో విలన్ పాత్రలో నటించి తనదైన విలనిజాన్ని పండించాడు ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మధుర్ బండార్కర్ తీసిన ఫ్యాషన్ అనే సినిమాలో ప్రియాంక చోప్రా కి జోడిగా నటించి మంచి గుర్తింపును సాధించారు.

తెలుగులో భారీ హిట్ సాధించిన మర్యాద రామన్న సినిమాని రీమేక్ చేస్తూ అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో చేసిన సన్నాఫ్ సర్దార్ సినిమాలో సోనాక్షి సిన్హా పక్కన నటించాడు. బాలీవుడ్లో రుస్తుం సినిమా తో 100 కోట్ల క్లబ్ లో చేరాడు సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా చేసినప్పటికీ సెకండ్ హీరోగా దీపక్ చేశాడు అలాగే ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులో కూడా నటించబోతున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే 2010, 2014 గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇలా సినిమాల్లో హీరోగా, అడ్వర్టైజ్ మెంట్స్ లో మోడల్ గా, ఫిలిం ఫెస్టివల్స్ లో వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు దీపక్. ప్రస్తుతం అయితే తెలుగులో సినిమాలు ఏం చేయలేదు ఫ్యూచర్ లో ఏదైనా చేస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here