‘నెత్రికన్’ ట్రైలర్ ఆ చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా గురువారం విడుదల చేసింది. ఇందులో ‘మొదట్లోనే ఆ ఫోటోలో చూపించిన 12 మంది అమ్మాయిలను తాను కిడ్నాప్ చేశానని.. అయినా ఏ ఒక్క పోలీసు కూడా తనను పట్టుకోలేదని.. ఎవరికీ కూడా ఏ మాత్రం అనుమానం రాకుండా పనులు పూర్తి చేశానని.. కానీ ఓ అమ్మాయి వల్ల తన నేర చరిత్ర అంతా తారుమవారు అవ్వడంతో పాటు తన జీవితమే గంధరగోళంలో పడిందంటూ’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.

ఈ డైలాగ్ ను సినిమాలో విలన్ పాత్రగా నటించిన అజ్మల్ చెబుతాడు. అందమైన అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని.. అవకాశం చూసి కిడ్నాప్ చేస్తాడు. అంతే కాకుండా వాళ్లను చిత్ర హింసలు పెట్టి వాళ్లు చనిపోయే వరకు ఆనదించే సైకో పాత్రను అజ్మల్ పోషించాడు. లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధానపాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో నటుడు అజ్మల్ సైకో విలన్‌గా మెప్పించారు.
ఇందులో చూపించిన ప్రతీ సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగింది. అంధురాలి పాత్రలో నటించిన నయనతార.. ‘నాకు కళ్లు కనిపించవు.. కానీ నా చుట్టూ జరిగే ప్రతీ విషయాలను నేను గ్రహించగలను’ అంటూ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించేలా ఉంది. సైకో విలన్ పాత్రలో అజ్మల్ మాత్రం జీవించేశాడు. దీనికి దర్శకత్వం మిలింద్ రావు.
పోలీసులకు చిక్కకుండా తిరిగే ఈ సైకో కథకు ఓ అంధురాలు ఎలా ఫుల్‌స్టాఫ్ పెట్టింది అనే ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఆగస్టు 13న డిస్నీఫ్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విషయంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం హాట్ స్టార్ లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.




























