ప్రస్తుతం కరోనా ఉధృతి అధికంగా ఉన్న కారణంతో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా వారిని ఉత్తీర్ణత చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యార్థులందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ విధంగా పదో తరగతి చదివిన విద్యార్థి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. కానీ ఉదయానికి ఆమె శవమై స్థానికులకు కనిపించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహబూబ్ నగర్ జిల్లా ఉంద్యాలకు చెందిన విష్ణు, పద్మలు దంపతులు. వారికి ఒక కూతురు స్రవంతి ఉంది. స్రవంతి పదవ తరగతి పూర్తి చేసుకుంది.తన తండ్రి విష్ణు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలోనే స్రవంతి ఇంట్లో తన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది.బయటకు వెళ్ళిన కూతురు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులకు స్నేహితులకు ఫోన్ల ద్వారా తమ కూతురు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ విధంగా ఎంతోమందిని అడిగినప్పటికీ స్రవంతి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఘట్‌కేసర్‌లో దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మహబూబ్నగర్ జిల్లా వాసిగా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు.
తన కూతురు తమతో గొడవ పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి పోయిందని విష్ణు, పద్మలు పోలీసులకు తెలిపారు.అయితే స్రవంతి తల్లిదండ్రులతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందా లేక ఆమె ఎవరైనా హత్యాచారం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…