రోడ్డుపైన పదో తరగతి విద్యార్థి శవం.. సగం కాలిన స్థితిలో?

0
92

ప్రస్తుతం కరోనా ఉధృతి అధికంగా ఉన్న కారణంతో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా వారిని ఉత్తీర్ణత చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే విద్యార్థులందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ విధంగా పదో తరగతి చదివిన విద్యార్థి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. కానీ ఉదయానికి ఆమె శవమై స్థానికులకు కనిపించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహబూబ్ నగర్ జిల్లా ఉంద్యాలకు చెందిన విష్ణు, పద్మలు దంపతులు. వారికి ఒక కూతురు స్రవంతి ఉంది. స్రవంతి పదవ తరగతి పూర్తి చేసుకుంది.తన తండ్రి విష్ణు పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలోనే స్రవంతి ఇంట్లో తన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది.బయటకు వెళ్ళిన కూతురు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులకు స్నేహితులకు ఫోన్ల ద్వారా తమ కూతురు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ విధంగా ఎంతోమందిని అడిగినప్పటికీ స్రవంతి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఘట్‌కేసర్‌లో దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతిచెందింది. సర్వీస్ రోడ్డు పక్కన కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మహబూబ్నగర్ జిల్లా వాసిగా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు.

తన కూతురు తమతో గొడవ పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లి పోయిందని విష్ణు, పద్మలు పోలీసులకు తెలిపారు.అయితే స్రవంతి తల్లిదండ్రులతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందా లేక ఆమె ఎవరైనా హత్యాచారం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here