Thaman : ప్రస్తుతం హీరోలకు, దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు థమన్. ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా థమన్ కొనసాగుతున్నారు. సినిమాలలో థమన్ ఇచ్చే పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అదరగోడుతున్నాడు. సినిమాలు విజయం సాధించడానికి థమన్ పాత్ర కూడా ఉంటుంది అనడంలో అతిషయోక్తి లేదు. కెరీర్లో ఇంత విజయం సాధించిన థమన్ వెనుక వాళ్ళ అమ్మ సావిత్రి కృషి ఎంతగానో ఉందని చాలా సార్లు చెప్పారు. తాజాగా థమన్ వాళ్ళ అమ్మ పుట్టినటజు సందర్బంగా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు…
థమన్ వాళ్ళ అమ్మ సావిత్రి గారు 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా…. ఇలా ట్వీట్ చేసారు. అమ్మ 70 లోకి అడుగుపెట్టింది. 21 ఏళ్ల బాల్యం.. 14 ఏళ్లు భర్తతో.. 35 ఏళ్లుగా నా జీవితం కోసం, నా కెరీర్ కోసం త్యాగాలు.. నీ కోసం కష్టపడతాను. ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అంటూ… ఒక వీడియోని కూడా జత చేసాడు. మాస్ అమ్మ ఈ రోజు ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమె పాడిన ‘మసక మసక ’ సాంగ్ ఈ సాయంత్రాన్ని ఎంతో క్రేజీగా మార్చింది. డ్రమ్స్ శివమణి అన్న ఫైర్‌లో ఉన్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా’’ అంటూ పేర్కొన్నారు.

My Mass Mother in full form today ???????????? #MasakaMasaka Song her version made the evening go crazy ???????????????? @drumssivamani anna ???????????? #S70 ???? Many more happy returns #Savithri ❤️ pic.twitter.com/lymkYe62SY
— thaman S (@MusicThaman) August 7, 2022
Amma gaaru turns 70 today ❤️
— thaman S (@MusicThaman) August 6, 2022
21 years of Her Child hood ????
14 years With Her dear Husband ????
35 long years of Sacrifice For
Me My life and My Career ♥️
Will Work Very hard for U
Will try to be on My Super best for U
Thanks for giving Me this Life ✊#Amma ♥️ pic.twitter.com/NUK3coHsvR
ఇక థమన్ పోస్ట్ చేసిన వీడియోలో సావిత్రి గారు మసక మసక పాట పడుతుండగా… శివమణి డ్రమ్స్ కొడుతున్నారు. అయితే థమన్ అమ్మ గారు మాస్ పాటని ఇరాగదీశారు. నెటిజన్లను సైతం ఈ వీడియో ఆకట్టుకుంటోంది.


































