Thammareddy Bhardwaj : సోషల్ మీడియా జమానాలో ఏదైనా వైరల్ అవడానికి క్షణం చాలు. ఏదైనా విషయం అందరికి వెళ్ళిపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలను అందరు ఫాలో అవుతుంటారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయానికి నిర్ధారణ, వాస్తవికత ఉండవు. ఇది సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా ఉంటుంది. వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలలో వార్తలు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో నిత్యం ఏదో ఒక వార్త వారి గురించి చక్కర్లు కొడుతుంటాయి, చాలా సార్లు ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోక పోయినా కొన్ని సార్లు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపడం వల్ల వారు ఆ విషయం పై స్పందించాల్సి వస్తోంది.

సభ్యతతో ఉండండి…..
ఇక ఈ విషయం పై ఇటీవల జీవిత, సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే వార్తలకు హద్దులు ఉండాలని, వారిపనిపై విమర్శించే హక్కు ఉంటుంది కానీ వ్యక్తిగతంగా వారిని కించపరిచే హక్కు ఉండదని అన్నారు. సోషల్ మీడియాకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండాలని, ఇలాంటి వార్తలు వ్యాపించేవారు కొంచెం సభ్యతతో వ్యవహరించాలని సెలబ్రిటీలకు కూడా కుటుంబాలు ఉంటాయి మీరు రాసే తప్పుడు కథనాల వల్ల వారి జీవితాల్లో సమస్యలు వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.

ఇక జీవిత మాట్లాడుతూ ఇటీవల కుటుంబమంతా కలిసి దుబాయ్ వెళితే నా కూతురు బాయ్ ఫ్రెండ్ తో లేచి పోయింది అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించారని సోషల్ మీడియాలో వ్యూస్ కోసం మా జీవితాలను సఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న వీరిద్దరు సోషల్. మీడియాలో ఫేక్ వార్తలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు.



























