Thammareddy Bhardwaja : సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం నింపిన సినిమాలు బింబిసార, సీతారామం. ఈ రెండు సినిమాలు మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాలు నిరూపించాయి. ఇక ఈ సినిమాలు తమ విజయంతో పెద్ద సినిమా డైరెక్టర్లకు కనువిప్పు కలిగించాయి. సినిమా బడ్జెట్ అదుపు లో పెట్టి సినిమా హిట్ చేయొచ్చని నిరూపించాయి. ఇక ఈ సినిమాలా విజయం గురించి సీనియర్ డైరెక్టర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు.

ఆ డైరెక్టర్ సాహసం చేసాడు…
బింబిసార, సీతారామం సినిమాలు రెండు కూడా మంచి ప్రేక్షకాధారణతో దూసుకుపోతున్నాయి. తమ్మారెడ్డి గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ కంటెంట్ బాగున్నా, సినిమాలు కొత్త దర్శకుడు తీసినా సినిమాలు హిట్ అవుతాయని థియేటర్లకు ప్రేక్షకులను తీసుకొచ్చాయి. సీతారామం సినిమా మొదటి రోజు అంత కలెక్షన్ లేకపోయినా తరువాత నుండి బాగా పుంజుకుంది ఒక క్లాసిక్ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకుంది. అసలు హీరో మలయాళం అతను అయినా డబ్బింగ్ సినిమాలా కాకుండా సినిమాను ఆదరించారు ప్రేక్షకులు.

ఇక బింబిసార సినిమా కోసం నలభై కోట్లు ఖర్చు పెట్టారు. కళ్యాణ్ రామ్ మార్కెట్ అంత లేకపోయినా, కొత్త దర్శకుడు అయినా అంత ఖర్చు పెట్టడానికి నిర్మాత వెనుకాడలేదు అంటే సినిమా మీద వాళ్లకు ఉన్న నమ్మకం అది, అదే సినిమాను నిలబెట్టింది. భారీ బడ్జెట్ సినిమా అంటే హీరోల రెమ్యూనరేషన్ అని కాదు నువ్వు తీస్తున్న ప్రొడక్ట్స్ కి ఎంత ఖర్చు పెడుతున్నావ్ అన్నదే ఎక్కడ విషయం. అలా చూసుకుంటే మన వాళ్ళు భారీ బడ్జెట్ పేరుతో హీరోల రెమ్యూనరేషన్, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ లాంటివి ఎక్కువైపోయి సినిమా బడ్జెట్ పెరిగిపోతోంది. కంటెంట్ లేకుండా పెద్ద హీరో ఉన్నా సినిమాని జనాలు చూడరు. ఇక టికెట్ రేట్లు పెరిగితే పెద్ద హీరో అయినా సినిమా చూడరు అంటూ తమ్మారెడ్డి గారు విశ్లేషించారు.

































