Thammareddy Bhardwaja : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు. అయితే ఇండస్ట్రీ నుండి ఎవరూ మాస్టర్ ను పట్టించుకోలేదు అనే విమర్శల నడుమ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడారు.

తెర వెనుక ఇండస్ట్రీ కోసం ఎంతో చేసారు…
భరద్వాజ గారు రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఆయన ఇండస్ట్రీలో మంచి డాన్సర్స్ ను అందించారని తెలిపారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ వచ్చినా ఆర్టిస్టులు మనవాళ్ళు ఉన్నారు కానీ మంచి టెక్నీషియన్స్ లేరు. మళ్ళీ చెన్నై వైపు ఆధారపడవలసి వచ్చింది. తెలుగులో డాన్స్ మాస్టర్ గా రాణించిన రాకేష్ మాస్టర్ ఆ లోటును భర్తీ చేసారు. తమిళ డామినేషన్ తెలుగులో ఉండకూడదని ముక్కుసూటిగా మాట్లాడారు. తెలుగులో డాన్సర్స్ ఎదగడానికి తన వంతు కృషిగా శిక్షణ ఇచ్చారు.

ఆయన ఆలోచన ఫలితమే నేడు టాప్ కోరియోగ్రాఫర్స్ గా తెలుగు వాళ్ళు ఉండటం అంటూ భరద్వాజ గుర్తు చేసుకున్నారు. ఆయన కెరీర్ లో ఒక వెలుగు వెలిగి అదే ముక్కుసూటి తనం వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్నారు. తన చివరి దశలో మద్యానికి బానిస అయి జీవితం అస్తవ్యస్తం చేసుకోవడం వల్లే ఆయనకు రావాల్సిన గుర్తింపు ఇండస్ట్రీ నుండి రాలేకపోయి ఉండవచ్చు. కానీ ఆయన ఒకప్పుడు మంచి డాన్సర్ అలాగే డాన్స్ మాస్టర్ అంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.































