Thammareddy Bhardwaja : సీనియర్ నిర్మాత, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూల గురించి, అలాగే వస్తున్న హాట్ టాపిక్స్ గురించి అయన స్పందన తెలియజేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్నాడంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తమ్మారెడ్డి గారు స్పందించారు, ఆసక్తికర వాఖ్యలు చేసారు. నిజానికి వెరైటీ మ్యాగజైన్ లో స్ట్రాంగ్ కంటెండర్ ఆస్కార్ నామినేషన్స్ కి అంటూ ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. ఇక దాంతో సోషల్ మీడియాలో ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్టీఆర్ ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

నిజంగా నామినేట్ అయ్యాడా… మన సినిమాకు అంత దమ్ము ఉందా…
ఇక తమ్మారెడ్డి గారు ఈ విషయం గురించి మాట్లాడుతూ నాకు తెలియదు చాలా ఫేక్ న్యూస్లు వస్తూ ఉంటాయి బహుశా ఇది అలాంటిది అయ్యుండొచ్చు. ఈ మధ్య ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎక్కువయ్యాయి. మొన్నా మధ్య ప్రభాస్, రామ చరణ్, ఎన్టీఆర్ లు 200 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారని, వాటి ఓపెనింగ్ కి మోడీ ఒకసారి కెసిఆర్ ఒకసారి వెంకయ్యనాయుడు వచ్చారంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ ఫేక్. అలాగే వరదలుకు 200 కోట్లు సహాయం చేశాడంటూ కూడా వార్తలు వచ్చాయి అవన్నీ కూడా ఫేక్. అలా ఇది కూడా ఫేక్ అయ్యుండొచ్చు. ఒకవేళ నిజమైతే సంతోషమే. అయితే ఆస్కార్ స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. ఇంత వరకు లాగాన్ సినిమాకు మాత్రమే ఆస్కార్ ఎంట్రీ దొరికిందంటూ అభిప్రాయపడ్డారు.

ఇక సినిమా షూటింగుల విషయంలో బంద్ గురించి మాట్లాడుతూ బంద్ చేసి చర్చింకునేంత అవసరము లేదు షూటింగులు జరుపుతూకూడా చర్చలు జరుపుకోవచ్చు. కానీ వాళ్లకు సమయం లేదేమో అందరూ కూర్చొని మాట్లాడటానికి అందుకే షూటింగులు బంద్ చేసారు. ఓటీటీ, టికెట్ రేట్లు కారణాలు. ముందు సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తే, సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు నిరూపించాయి అంటూ చెప్పారు.

































