Thammareddy Bhardwaja : గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా వైరల్ అవుతున్న ఇష్యూ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో. ఇక ఈ వీడియో మార్ఫింగ్ అని కావాలనే టార్గెట్ చేసారని ఎంపీ అంటుంటే ప్రతిపక్షాలు మాత్రం బాగా ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక నిన్న ఈ ఇష్యూ లో ఒక ట్విస్ట్ వచ్చింది. SP ప్రెస్ మీట్ పెట్టి మరీ అది ఒరిజినల్ వీడియో కాదు అంటూ చెప్పారు ఫార్వర్డ్ చేసిన వీడియో అంటూ ఏం చేయలేమని చెప్పారు. ఇక గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అసభ్య పద జాలంతో రెచ్చిపోయారు. ఈ ఇష్యూ మీద తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

నేను వెళ్లి వాణ్ని చంపాలా…
ఇక ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటని సీనియర్ నిర్మాత డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ ను అడిగితే అయినా ఇలాంటి విషయాలను టీవిలో డిబేట్లు పెట్టి మరీ చర్చిస్తున్నారు నిర్లజ్జగా అసలు సంస్కారం లేదు. ఆ వీడియో మార్ఫింగ్ అయితే చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి, లేదు ఒరిజినల్ అయితే ఆ ఎంపీ మీద చర్యలు తీసుకోవాలి అక్కడితో ఇష్యూ అయిపోతుంది. కానీ అలా చేయకుండా అధికార పక్షం, ప్రతి పక్షం విమర్శించుకోవడం ఏంటి అదేమైనా మంచి విషయమా అంటూ మండి పడ్డారు.

ఇక మీ అభిప్రాయం ఏంటి ఈ ఇష్యూ మీద, అది ఒరిజినల్ అనుకుంటున్నారా లేక ఫేక్ అని అనుకుంటున్నారా అంటే నేను వెళ్లి అతన్ని చంపాలా ఇప్పుడు.. అదేమన్నా గొప్పవిషయమా చర్చించుకోడానికి ప్రస్తుత రాజకీయనాయకులలో చాలా మందికి సంస్కారం, సభ్యత లేవు పదవుల్లో ఉన్నా హుందగా ఉండటం రాలేదు. నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ వంటి అత్యున్నత ప్రదేశాల్లో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు లాగా రాజకీయాలు లేవు అలాంటివాటి గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. రాష్ట్రం లో ఉన్న సమస్యలను పక్కన బెట్టి ఇలాంటి అనవసర విషయాల గురించి మాట్లాడుతూ విమర్శలు చేసుకుంటూ ఉన్నారు అంటూ మాట్లాడారు తమ్మారెడ్డి.
































