ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ముస్లిం వేషంలో కనిపించేది అందుకే.. రైటర్ కామెంట్స్ వైరల్?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు ఆయనని ఒక ముస్లిం గెటప్ లో చూపించారు.అయితే ఎన్టీఆర్ ను అలా ఎందుకు చూపించారనే విషయం గురించి రైటర్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రోమోలు చూసి, టైటిల్స్ చూసి సినిమాను డిసైడ్ చేయొద్దని రచయిత సాయి మాధవ్ బుర్రా అన్నారు.
ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వేషధారణపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అసలు ఆ గెటప్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలియకుండా ఎవరూ ఏదీ మాట్లాడడం సరి కాదని సాయి మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అల్లూరి సీతారామరాజు సినిమాను గుర్తు చేశారు.

ఆ సినిమాలో ఒక బ్రిటిష్ సైనికుడు అల్లూరి సీతారామరాజుకు గురి పెట్టగానే అప్పుడు ఆయన ఒక శ్రీ కృష్ణుడులాగా కనిపిస్తారని సాయి మాధవ్ చెప్పుకొచ్చారు. దాంతో ఆ సైనికుడు కాల్చకుండా తుపాకీని దించేస్తాడని ఆయన చెప్పారు. అప్పుడు ఇంకో సైనికుడు కాలుస్తాడని ఆయన అన్నారు.
అప్పట్లో ఈ సోషల్ మీడియా ఇంతగా లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజు , శ్రీ కృష్ణుడిలా ఎందుకు ఉంటాడు ? అని, అసలు అల్లూరి సీతారామరాజు ఫైట్ చేసిందే క్రిస్టియన్ మీదైతే ఆయన కృష్ణుడి గెటప్ ఎందుకు వేసుకుంటారు ? అని అప్పుడు అందరూ అడిగేవారు అని సాయి మాధవ్ అన్నారు.

ఆ ట్రైలర్ లో అల్లూరి సీతారామరాజుని చూపించి, క్రీస్తు గెటప్ చూపిస్తే అందరూ అలానే అనుకుంటారని… ఆయన తెలిపారు. కేవలం ఆ ట్రైలర్ చూసి ఆ సినిమాలో ఆయన ఆ గెటప్ వేశారని అనుకుంటారు గానీ నిజంగా వేయడు కదా అని ఆయన వివరించారు.అయితే రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ ను అలా ముస్లిం విషయంలో ఎందుకు చూపించారు అనే విషయం తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందేనని ఈ సందర్భంగా రైటర్ సాయి మాధవ్ ఎన్టీఆర్ ముస్లిం వేషం గురించి తెలిపారు.