ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రమోషన్ పనిలో ఉన్నారు.

దానికి రాజమౌళి దగ్గరనుంచి చూసుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక, తమిళనాడు వెళ్లి అక్కడి ఫ్యాన్స్ తో ముచ్చటించిన విషయం తెలిసిందే. జనని పాట విడుదలలో భాగంగా.. అతడు విలేకురుల సమావేశంలో కూడా మాట్లాడాడు. తమిళ మీడియాకు మూడు సంవత్సరాల నుంచి టచ్ లో లేకపోవడంతో కూడా వారిని క్షమించండి అంటూ అడిగిన విషయం కూడా తెలిసిందే.
ఇదంతా ఇలా ఉండగా.. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియలో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. మొత్తం ఈ సినిమాకు ఆమె 10 రోజుల వరకు కాల్ షీట్ ఇచ్చినట్లు.. దానికి ఆమె రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె నిడివి కూడా కేవలం 15 నిమిషాల వరకే ఉంటుందట.
అయితే దీనిపై నిర్మాత మొదట ససేమిరా అనడంతో.. రాజమౌళి కల్పించుకొని బాలీవుడ్ లో ఈ సినిమా సస్టెయిన్ కావాలంటే కచ్చితంగా ఆమె ఉండాలంటూ చెప్పాడట. అందుకే ఆమెకు అంత పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు నెలల వరకు కాల్ షేట్ తీసుకొని రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకునే అలియా కేవలం 10 రోజులకు ఇంత తీసుకోవడం సరికాదని అంటున్నారు.



























