Kommineni Srinivasa Rao : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్ బుక్ నా వరకు వచ్చింది” అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతలో, ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం మరింత కలకలం రేపింది.

అరెస్ట్ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… “రెడ్ బుక్ నా వరకు వచ్చింది. జర్నలిస్టులపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, 70 ఏళ్ల వయస్సులో తనను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.
టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలను కించపరిచారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన్ని అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.



































