విలన్ పాత్ర అయిని తండ్రి పాత్ర అయినా అందులో ఒదిగిపోయి మరీ నటించే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. అయితే ఆయన ఇటీవల సనిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ మా ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెప్పిన ప్రకాశ్ రాజ్ అటు వైపు కొన్ని రోజులుగా ధనుష్ సినిమా కోసం చెన్నైలో షూటింగ్‌తో అతడు బిజీగా ఉన్నాడు. అయితే అదే షూటింగ్ లో అతడు ఫ్లోర్ పై జారి ఆయన కిందపడ్డాడు.

దీంతో అతడికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చేతికి చిన్న ఫ్రాక్చర్ కావడంతో చెన్నై నుంచి హైదరాబాద్‌కి వస్తున్నట్లు.. హైదరాబాద్ లో తన స్నేహితుడు డాక్టర్ గురవారెడ్డి సర్జరీ చేయనున్నారని నిన్న ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. తాజాగా ఈ రోజు అతడు సర్జరీ విజయవంతం అయిందని.. ట్విట్టర్ ద్వారా ఆయన సన్ షైన్ ఆసుపత్రి నుంచి ట్వీట్ చేశాడు.
తన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుడు గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెపుతున్నానని ఆయన అన్నారు. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ లు చేస్తానని.. ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ‘ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అని తాజాగా ట్వీట్ చేశారు.
The ???? devil is back… successful surgery.. thank you dear friend Dr #guruvareddy and ???????????? thank you all for your love n prayers.. back in action soon ???????? pic.twitter.com/j2eBfemQPn
— Prakash Raj (@prakashraaj) August 11, 2021
ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ప్రకాశ్ రాజ్ షేర్ చేశాడు. ఇది షేర్ చేసిన కొన్ని గంటల్లోనే పోస్ట్ వైరల్ గా మారింది. కంగ్రాట్యులేషన్ సర్.. అంటూ అతడి ట్వీట్ కు రీ ట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు.






























