ఇటీవల కేరళ పోలీసులు హర్ష(34) అనే వ్యక్తిని ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తును వెంబడించి వేధించినందుకు అరెస్టు చేశారు. ఎర్నాకుళం, కోజికోడ్‌లోని నటి నివాసాలకు అతడు పదేపదే పలు సందర్భాల్లో సందర్శించాడు. అతను ఆహార పొట్లాలతో పార్వతి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ప్రతిసారీ.. అతను భద్రతా అధికారులతో వాగ్వాదానికి దిగాడు.

అతను గత కొన్నేళ్లుగా తన ఫోన్ మెసేజ్‌ల ద్వారా నటిని ఇబ్బంది పెట్టేవాడని.. అసభ్యకరంగా మెసేజ్ లు చేస్తూ .. తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎర్నాకులం మారాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 354 డి (స్టాకింగ్) కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
నటి పార్వతి 2019 లో కూడా ఓ వ్యక్తి నుంచి ఆమె వేధింపులకు గరయ్యింది. దీనిపై కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. పార్వతి ఇటీవలే .. దర్శకుడు వసంత్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘శివరంజనియుమ్ ఇన్నుం సిల పెంగళమ్’లో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఇది ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సోనీ లైవ్ లో విడుదలైంది.
శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం అనేది అశోక మిత్రన్, అధవన్ , జయమోహన్ రాసిన కథల ఆధారంగా.. మూడు స్త్రీ-కేంద్రీకృత లఘు చిత్రాల సంకలనం. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, పార్వతి తిరువోతు, కాళీశ్వరి శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ, మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ నటి. టేకాఫ్, బెంగుళూరు డేస్ సినిమాలతో మంచి పాపులర్ అయ్యారు.





























