Tollywood Heroins: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అందుకున్నారు ఇలా వెండితెరపై అందరిని నవ్వుతూ తమ అందంతో అందరిని ఆకట్టుకున్నటువంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తెరవ వెనక మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగిన కొంతమంది హీరోయిన్స్ వింత జబ్బుల బారిన పడ్డారట. మరి ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే..

సమంత: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నారు.ఈ వ్యాధి కారణంగా ఈమె సినిమాలకు దూరమై ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
నయనతార: లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార కూడా ఒకానొక సమయంలో చర్మ సమస్యలతో బాధపడ్డారట ఈమె మేకప్ కనుక వేసుకుంటే చర్మం మొత్తం ఎర్రగా మారిపోయేది దీంతో రెండు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఈ సమస్యకు చికిత్స తీసుకున్నారు.
హంసానందిని: ఐటమ్ సాంగ్స్ ద్వారా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయినటువంటి హంసానందిని భయంకరమైనటువంటి క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమెతో పాటు సోనాలి బింద్రే మమతా మోహన్దాస్ వంటి సెలబ్రిటీలు కూడా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే.
స్నేహ ఉల్లాల్: అచ్చం ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్నటువంటి ఈమె కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడ్డారట. ఈ వ్యాధి కారణంగా తొందరగా అలసిపోవడం నిరసించి పోవడం ఉన్నఫలంగా కిందపడిపోవడం వంటివి జరిగేవి దీంతో ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలియానా: గోవా బ్యూటీ ఇలియానా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు సన్నని నడుముతో సన్నజాజితీగల ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె ఉన్నఫలంగా అధిక శరీర బరువు పెరిగిపోయారు. ఇలా ఇలియానా శరీర బరువు పెరిగిపోవడానికి కారణం ఆమె బాధపడినటువంటి బాడీ డిస్పోర్విక్ డిసీజ్ కారణమని తెలుస్తుంది. ఇలా ఈ హీరోయిన్స్ అందరూ కూడా ఈ విధమైనటువంటి వింత వ్యాధులతో బాధపడ్డారు.




























