సాధారణంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అన్ని పోషక విలువలు కలిగిన కూరగాయలను కొన్నిసార్లు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి కోవకు చెందినవే గోరు చిక్కుడు కాయలు. ఈ గోరు చిక్కుడు కాయలను వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ గోరుచిక్కుడు కాయలను ఎవరు తినకూడదు? తినడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఈ గోరు చిక్కుడుకాయలలో ఎన్నో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, అధికంగా లభిస్తాయి.ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఏ మన కంటిసమస్యలు ఏర్పడకుండా విటమిన్ ఏ కాపాడుతుంది. అంతేకాకుండా వారంలో రెండు సార్లు ఈ గోరు చిక్కుడును ఆహారంలో చేర్చుకోవడం వల్ల రేచీకటి సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
ఇందులో ఉన్న క్యాల్షియం, ఐరన్ ఎముకలు పటుత్వానికి సహకరిస్తాయి.రక్తహీనత సమస్యతో బాధపడేవారు గోరుచిక్కుడును తీసుకోవడం ద్వారా వారి శరీరంలో రక్తం అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే ఈ కూరగాయలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంమే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ గోరుచిక్కుడు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ మందులు వాడేవారు వీటిని తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ కూరగాయలను తినాలి అనుకున్నపుడు ఆ పూటకు వేసుకోవలసిన మందులను వేసుకోకుండా ఉండటం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఈ గోరు చిక్కుడు మందులకు విరుగుడుగా పనిచేస్తాయి దానివల్ల శరీరంలో కొన్ని అలర్జీలు ఏర్పడే అవకాశాలు ఉండటం వల్ల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు వీటిని తినకూడదని చెబుతుంటారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…