వేసవి, వర్షాకాలాల్లో పాములు ఎక్కువగా బయటకు రావడం సాధారణమే. ముఖ్యంగా పొలాలు, గ్రామీణ ప్రాంతాలు, నీటి దగ్గర నివసించే వారిలో పాము కాటు ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అయితే చాలా సందర్భాల్లో భయమే ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. సరైన సమయంలో సరైన ప్రథమ చికిత్స అందితే పాము కాటు నుంచి బాధితుడిని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పాము కరిచిన వెంటనే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.
పాము కరిచిన వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచడం అత్యంత ముఖ్యమైన విషయం. భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల విషం శరీరంలో త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకే బాధితుడికి ధైర్యం చెప్పి కూర్చోబెట్టాలి లేదా పడుకోబెట్టాలి. పరుగులు పెట్టించడం, ఆందోళన చెందించడం అస్సలు చేయకూడదు.
పాము కాటు వేసిన భాగాన్ని కదలకుండా ఉంచడం కూడా కీలకం. చేయి లేదా కాలు ఏ భాగంలో కాటేసిందో ఆ అవయవాన్ని వీలైనంత స్థిరంగా ఉంచాలి. అవసరమైతే చిన్న కర్ర లేదా గట్టి వస్తువుతో సపోర్ట్ ఇచ్చి కదలకుండా కట్టాలి. అలాగే కాటు వేసిన భాగాన్ని గుండె స్థాయి కంటే కింద ఉంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
చాలామంది చేసే పెద్ద తప్పు గట్టిగా తాడు కట్టడం. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ ఆగిపోవచ్చు. దాంతో కణజాలం దెబ్బతిని పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. కేవలం వదులుగా ఉండే బ్యాండేజ్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఉంగరాలు, గాజులు, గట్టిగా ఉండే చెప్పులు వెంటనే తొలగించాలి. ఎందుకంటే కొద్ది సేపట్లో వాపు రావచ్చు.
సినిమాల్లో చూపించినట్లు గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, కాల్చడం వంటి పాత పద్ధతులు చాలా ప్రమాదకరం. ఇవి ఇన్ఫెక్షన్లు పెంచడమే కాకుండా పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి. అలాగే బాధితుడికి మద్యం, కాఫీ లేదా ఏవైనా మందులు స్వయంగా ఇవ్వకూడదు.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడం. పాము కాటుకు సరైన చికిత్స యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్ మాత్రమే. సమయం వృథా చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకెళితే ప్రాణాపాయం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాము రంగు లేదా ఆకారం గుర్తు ఉంటే వైద్యులకు సమాచారం ఇవ్వడం చికిత్సలో ఉపయోగపడుతుంది. అయితే పామును పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…