Thottempudi Venu : ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు వేణు. మొదటి సినిమా తోనే ఒక మంచి విజయం తో పాటు నంది అవార్డు కూడా కొట్టేసాడు. తరువాత చిరునవ్బుతో, హనుమాన్ జంక్షన్, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ అభిమానులు వరంకటేష్ తరువాత వేణు ఇష్టపడతారు. తరువాత వరుసగా పరాజయాలు రావడం తో 2013 లో ‘రామాచారి’ సినిమతో సినిమాలకు స్వస్తి చెప్పి అమెరికాలో స్థిరపడిపోయాడు. అయితే ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన కెరీర్ లో జరిగిన చాలా విషయాలు పంచుకున్నారు.

నాగార్జున గారు చెప్పడంతో నన్ను వద్దు అన్నారు…
‘స్నేహమంటే ఇదేరా’ సినిమాతో తనకు జరిగిన అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చారు.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఆర్ బి చౌదరి గారు స్నేహామంటే ఇదేరా సినిమా తీయాలి అనుకున్నప్పుడు సుమంత్ క్యారెక్టర్ కి మొదట నన్ను ఫైనల్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ రేపు సినిమా ఓపెనింగ్ అన్నపుడు నన్ను పిలిచి నాగార్జున గారు ఏవో కారణాలు చెప్పారు అని నన్ను వద్దు అన్నారు. ఎందుకో అర్థం అవ్వలేదు సరే అని వదిలేసాను సినిమా విడుదల అయ్యాక చుస్తే ఆ పాత్రకి సుమంత్ వున్నారు అని చెప్పారు.

మొదట నాగార్జున గారితో సినిమా అంటే చాలా సంతోషించాను. అసలే ముందు నుంచి సినిమా పిచ్చి, పెద్ద హీరోలతో నటించాలి అని ఉండేది. ఆ అవకాశం రాగానే పెద్ద హీరోతో నటించవచ్చు అనుకున్నాను కానీ కారణాలు ఏవైనా అది జరగలేదు అపుడు కొద్దిగా బాధ అనిపించింది అని చెప్పుకోచ్చారు.

































