Titan Submarine tragedy : ఉత్తర అంట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు. 1912 ప్రాంతంలో జరిగిన టైటానిక్ ప్రమాదంలో సుమారు 1500 మంది మరణించారు. అయితే ఆ షిప్ శిథిలాలను కనుగొన్నా సముద్ర అడుగున ఉన్న వాటిని చేరుకోవడం కష్టం. అయితే ఓషన్ గేట్ సంస్థ తయారు చేసిన టైటన్ సబ్ మెరైన్ తాజాగా ఆ సాహసం చేసింది. ఐదగురు వ్యక్తులు ఆ సబ్ మెరైన్ ద్వారా సముద్రం లోపలికి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూడాలని భావించారు. అయితే వారి సహస యాత్ర విషాదంగా మారింది. సముద్రంలోకి వెళ్లిన వారి జాడ రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తెలియరాలేదు. వారికి సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు కూడా ఇప్ప్పటికే ఖాళీ అయ్యుంటాయనే అంచనాతో వారు మరణించి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గాలింపు చర్యలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే చివరికి ఆ సబ్ మెరైన్ సముద్రంలోకి వెళ్లిన కొద్ది గంటల్లోనే పేలి పోయి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకే పేలి పోయింది…
టైటాన్ అనేది సబ్ మెరైన్ కాదు సబ్ మెర్సిబుల్ అంటూ సబ్ మెరైన్ ఇంజనీర్ ఫణిరాజ్ తెలిపారు. అది రీసెర్చ్ కోసం ఉపయోగించే సబ్ మెర్సిబుల్. దాని ఓషన్ గేట్ వాళ్ళు టూరిజం కోసం వాడారు. అందులో వెళ్లిన వారిలో ఎవరూ టెక్నీషియన్స్ లేరు. ట్రైనింగ్ అంటూ వారికి ఏమి ఉండదు. ఇక టైటన్ గంటల వ్యవధిలోనే టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతానికి చేరుకోవాలి. నిజానికి సముద్రంలోకి వెళ్లిన గంట తరువాత నుండి టైటన్ నుండి కమ్యూనికేషన్ కట్ అయింది.

లోపలికి వెళ్లే కొలది నీటిలో ఒత్తిడి పెరుగుతుంది. అలా పది మీటర్లకు ఒక కేజీ/సెంటిమీటర్2 ఒత్తిడి పెరుగుతుంది. అంటే 4000 మీటర్లు అంటే 40 కెజీల ఒత్తిడికి టైటాన్ తట్టుకోగలగాలి. దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఎక్సప్లోషన్ అంటే పేలిపోవడం. టైటన్ లో ఆది జరుగలేదు. బయట ఉన్న నీటి ఒత్తిడి వల్ల టైటన్ ఇంప్లోషన్ అయింది. అనగా బయట ప్రెషర్స్ వల్ల నొక్కుకుపోయింది. అందుకే వాళ్లంతా వెళ్లిన గంటలవ్యవధిలోనే మరణించారు అంటూ తెలిపారు.































