మొదటి నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి టాప్ ఫైవ్ లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యగా అతడు 12 వ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇలా రవిని ఎలిమినేట్ చేయడం అనేది అన్ ఫెయిర్ అంటూ నెటిజన్లు బిగ్ బాస్ నిర్వాహకులపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవి బయటకు రావడం చాలామందికి రుచించడం లేదు. దీనిపై కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

పింకీ (ప్రియంక సింగ్) ను ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి బిగ్ బాస్ ఆడిన నాటకం అని.. రవిని కావాలనే ఎలిమినేట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రియాంక సింగ్ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు.. ఆమె హౌస్ లో మానస్ కు కంటెంట్ ఇవ్వడం తప్ప ఏమి చేయలేదని.. పింకీ ఆట కూడా యాక్టివ్‌గా లేదనే వాదన కూడా వినిపిస్తుంది.
అలాంటిప్పుడు రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారని వాదిస్తున్నారు. పింకీ కంటే కూడా రవికి బయట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సన్నీ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ద్వారా కాజల్ సేవ్ అయిందని.. దీని వల్లనే రవి బలైయ్యారని వార్త వినిపిస్తోంది. అస్సలు ఏం జరిగిందో ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో తెలవనున్నది. ఇక ట్విట్టర్ లో ‘బ్రింగ్ బ్యాక్ రవి’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.





























