Sai pallavi: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సరికొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని లేడీ పవర్ స్టార్ అనే బిరుదులతో పిలుస్తారు తాజాగా బాక్సాఫీస్ క్వీన్ అంటూ మరో బిరుదుని ఇచ్చారు.
సాయి పల్లవి సినిమా సెట్ లో ఉంటే కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా నా పాత్ర గురించి కూడా ఎంతో క్లారిటీతో ఉంటూ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. ఇక సాయి పల్లవి తో నటించాలన్న కాస్త కష్టంగా ఉంటుంది.ఆమెతో కలిసి డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం వేస్తుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా సాయి పల్లవి నటన డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
డాన్స్ చేయాలంటే భయం..
గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశానని అన్నారు. ఈ సినిమా జాలరి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి తెలిసిందే.




























