చాలామందికి స్టార్ హీరోల రెమ్యూనిరేషన్ తెలిసి అమ్మో.. అంత సంపాదన ఉంటుందా.. అంటూ తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారు. కానీ వాళ్ల కంటే ఎక్కువగా కొంతమంది స్టార్ హీరోల భార్యలు సంపాదిస్తున్నారు. అలా సంపాదించే వాళ్ల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. కాలం గిర్రున తిరుగుతోంది. ఒకప్పుడు ఇల్లాలు వంటింట్లోనే పరిమితం అయ్యేది.. కానీ ప్రస్తుతం అలా లేదు. పేకట పేకాటే.. బామ్మర్ది.. బామ్మర్దే అన్నట్ల.. ఇటు ఇంట్లో పని చేసుకుంటూనే అటు సంపాదించే మహిళలు చాలా మంది ఉన్నారు.
రామ్ చరణ్ వరస సినిమాలు చేస్తూ సినిమాలకి రూ.కోట్లలో రెమ్యూనిరేషన్ తీసుకుంటుంటే తన భార్య ఉపాసన అపోలో చారిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బి. పాజిటివ్ కి మ్యాగజిన్ చీఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆమె సంపాదన రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా తన భర్త కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజిన్ కి చీఫ్ ఎడిటర్ గా ఉంటూ.. తన తండ్రి సెయింట్ ఇన్స్టిట్యూట్ బిసినెస్ కూడా చూసుకుంటారు. నాచురల్ స్టార్ నాని సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అతడు నిర్మాతగా మారిన విషయం కూడా తెలిసిందే. అయితే నాని భార్య అంజనా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి అర్.కే. మీడియా లో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.
బాహుబలి సినిమాకి కూడా అంజనా డిజైనర్ గా పని చేసారు. ఇలా ఆమె నాని కంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ఒకప్పటి హీరో గా వెలుగు వెలిగిన అల్లరి నరేష్ కి ఇపుడు పెద్దగా సినిమాలు లేవు. గతంలో సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తే ప్రస్తుతం ఆ అవకాశాలు తగ్గాయనే చెప్పొచ్చు. ఇక తన భార్య విరూప వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ ఈవెంట్ మ్యానేజర్ గా రూ. లక్షల్లో సంపాదిస్తుంది. డైరెక్టర్ గా మారియు యాక్టర్ గా మెప్పించిన రాహుల్ రవీందర్ తెలుగు లో తమిళ్ లో సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఆయన భార్య చిన్మయి సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ తన భర్త కన్నా ఇంకా ఎక్కువగా సంపాదిస్తుంది.
తెలుగులో సమంతకి డబ్బింగ్ చెప్పేది చిన్మయి అని మనకి తెలుసు. ఆమె ఒక సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. ఎంతో బిజీగా ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నాగచైతన్య సంవత్సరానికి ఒక సినిమానే చేస్తుంటే అయినా భార్య హీరోయిన్ సమంత మాత్రం తెలుగు మురియు తమిళంలో సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సినిమాలతో అదరకొడుతుంది. కొన్ని యాడ్స్ షోస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్య కంటే ఎక్కువ సంపాదిస్తుంది సమంత. ఆమె సొంతంగా క్లాత్ స్టోర్ కూడా రన్ చేస్తుంది.
ఇక యాంకర్ సుమ గురించి చెప్పాల్సిన అవరం లేదు. ఆమె యాంకరింగ్ తో పాటు.. పలు యాడ్స్ ల్లలో కూడా నటిస్తూ.. రాజీవ్ కనకాల కన్నా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. రాజీవ్ కనకాల గతం లో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలే చేస్తున్నాడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే.. మహేశ్ బాబు కంటే.. నమ్రత పలు వ్యాపారాలను మొదలు పెట్టి అతడి కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. హీరో నందు సినిమాలు చేస్తుంటే భార్య గీత మాధురి పాటలు పడుతూ భర్తతో సమానంగా గా సంపాదిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…