పవన్, మహేష్ లకు వాళ్లిద్దరు కావాలట..!? మన హీరోలకు నటీనటులు దొరకడం లేదా?

0
258

తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తూ.. థియేటర్లలో సందడి చేస్తోంది.. ఇక ఈ సినిమా తర్వాత పవన్.. అయ్యప్పనున్ కోషియం సినిమా రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో పవన్ కు ప్రత్యర్థిగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. అయితే.. రానాకు హీరోయిన్ ఎప్పుడో దొరికిసేంది. ఆయన సరసన ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. కానీ.. పవన్ కే హీరోయిన్ దొరకట్లేదు. ఎన్నో పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. ఇప్పుడు స్పాట్ లైట్ నిత్యామీనన్ వద్ద ఆగిపోయింది. మరి, ఆమె ఫైనల్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

ఇక, మహేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే.. సూపర్ స్టార్ కు ప్రత్యర్థి దొరకట్లేదు. బలమైన విలన్ కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నప్పటికీ.. ఎవ్వరూ ఫైనల్ కావట్లేదు. అరవింద్ స్వామి, ఉపేంద్ర, మాధవన్ అంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. మరి, ఇందులో ఎవరైనా ఖరారవుతారా? మరో పేరు లైన్లోకి వస్తుందా? అన్నది తెలియదు. ఇంకా చాలా సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. మెగాస్టార్‌-రామ్ చరణ్ ‘ఆచార్య’కూ హీరోయిన్ సమస్య వచ్చింది. చిరు సరసన కాజల్ ముందుగానే ఎంపికైనప్పటికీ.. సినిమా సగం పూర్తయ్యాక గానీ రామ్ చరణ్ కు జోడీ సెట్టవ్వలేదు. చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే సెట్స్ లోకి వచ్చింది.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా సగం పూర్తయ్యాక మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు. సౌత్ కు జస్టిన్ ప్రభాకర్‌, హిందీకి మిథున్‌, మనన్ భరద్వాజ్ లను సెలక్ట్ చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’కు సైతం ఇదే పరిస్థితి. ఇదేవిధంగా.. బన్నీకి సైతం విలన్ దొరకలేదు. చాలా కాలం తర్వాత ఫాహద్ ఫాసిల్ ను ఎంచుకున్నారు. వచ్చే నెలలో ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది.. మొత్తానికి మన టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు తమ సినిమాల్లో నటీ నటులు దొరకడం చాలా కష్టం అయిపోయింది…!!