Harish Uthaman: హరీష్ ఉత్తమన్ ఈయన మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు తెరకు మాత్రం ఈయన ఒక పేరుమోసిన విలన్ గా అందరికీ పరిచయమే. ఈయన తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ తాజాగా రెండవ వివాహం చేసుకున్నారు.

ఈ క్రమంలోని ఈయనకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరీష్ ఉత్తమన్ మలయాళ నటి చిన్ను కురువిల్లను జనవరి 20న కేరళలోని మవెలిక్కర వద్ద ఉన్న రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రెండో పెళ్ళి చేసుకున్నాడు.కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

హరీష్ ఉత్తమన్ ఇదివరకే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్ పుర్‌ను 2018 లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం అయిన ఏడాది కూడా గడవకముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత విడాకులతో విడిపోయారు.
గౌరవం చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ..
ఈ క్రమంలోనే హరీష్ తిరిగి చిన్ను కురువిల్లను రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా హరీష్ ఉత్తమన్ రెండవ వివాహం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఇండస్ట్రీకి చెందిన వారు అలాగే అభిమానులు ఆయనకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హరీష్ ఉత్తమన్ 2013వ సంవత్సరంలో గౌరవం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, మలుపు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, ఎక్స్ ప్రెస్ రాజా, కవచం, వంటి ఎన్నో సినిమాలలో విలన్ గా ప్రేక్షకులను సందడి చేశారు.






























