Trisha : ప్రపంచంలో ఒకరిన పోలిన ఒకరు ఏడుగురు వుంటారు అనడం నిజమేనేమో… ఎందుకంటే మన హీరో, హీరోయిన్ డూపులను చూస్తూనే ఉంటాము. అలాంటివారు కనిపిస్తే ఎంతో ఆసక్తిగా గమనిస్తాము. కొద్దిగా పోలికలు వున్నా చాలు వారిలాగే డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ తో అచ్చు గుద్ధినట్లు అలానే కనిపించే ప్రయత్నం చేస్తారు. బిగ్ బాస్ ద్వారా పాపులరిటీ తెచ్చుకున్న అషు రెడ్డి జూనియర్ సమంతల మొదట పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో మరో అమ్మాయి సమంతల కనిపించి క్రేజ్ తెచ్చుకుంది. అలాంటి వారి జాబితా లోకి తాజాగా ఒక అమ్మాయి వచ్చి చేరింది.

అచ్చుగుద్దినట్లు త్రిష లాగ…
ప్రస్తుతం తాజాగా హీరోయిన్ త్రిషను పోలిన ఒక అమ్మాయి వెలుగులోకి వచ్చింది. అటు ఇటుగా దాదాపుగా త్రిషను పోలి ఉన్న ఈ డూప్ త్రిష పేరు దీపిక విజయ్. కర్ణాటకకు చెందిన ఈ అమ్మాయి అచ్చుగుద్దినట్లు త్రిషను పోలి ఉండడం విశేషం. ఇంకేముంది ప్రస్తుతం త్రిషకు డూప్ అంటూ నెట్లో వైరల్ అవుతోంది.

తొందరగా ఈ అమ్మాయిని చుసిన వారు త్రిష అని మోసపోవచ్చు. అయితే త్రిష బాగా ఇష్టపడే వారు మాత్రమే కనిపెట్టగలరు. అంతేకాదు ఈ అమ్మాయి అచ్చం త్రిష లాగానే డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ మాత్రమే కాదు బాడీ లాంగ్వేజ్ తో కూడా అందరిని ఆకట్టుకుంటోంది. ఇపుడు త్రిషను పోలిన ఈ దీపిక విజయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో డూప్ త్రిష లాగ క్రేజ్ సంపాదించుకుంది.



























