TSPSC: తెలంగాణలో మరో ఒకటిన్నర రెండేళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు కూడా బలపడాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాల్ విసురుతున్నాయి. బీజేపీ పార్టీ బలపడేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరాడుతోంది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు వైఎస్సార్టీపీ పార్టీ కూడా సిద్ధం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా.. టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీపై ఘాటు విమర్శలు చేస్తోంది. సీఎం కేసీఆర్, కేటీఆర్ లను విమర్శిస్తోంది.

గతంలో ఉద్యోగా నోటిఫికేషన్లు, రైతుల సమస్యలు, పంట నష్టం, ధాన్యం కొనుగోళ్లపై స్పందించింది. ప్రభుత్వ తీరును విమర్శించింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది.
వైఎస్ షర్మిళ అరెస్ట్..
తాజాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆందోళనకు పిలుపునిచ్చింది. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భైటాయించి ఆందోళన చేపట్టారు షర్మిల. నిరుద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈక్రమంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వైఎస్ షర్మిళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గతం నుంచి కూడా ముఖ్యంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసుకుంటూ… పలు వ్యాఖ్యలు, విమర్శలు చేశారు వైఎస్ షర్మిళ



























